కంటెంట్‌కు వెళ్లండి

circa 800–400 BC

The Hebrew Prophets

God speaks through Isaiah, Jeremiah, and the minor prophets—calling Israel to repentance and foretelling the coming Messiah.

3,706 వచనాలు · 14 గ్రంథాలు చేర్చబడ్డాయి

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. యెషయా 54:7సుమారు క్రీ.పూ. 712

    “కొద్ది కాలం నేను నిన్ను విడిచిపెట్టాను, కానీ గొప్ప జాలితో నేను నిన్ను తిరిగి చేర్చుకుంటాను.

  2. యెషయా 54:8సుమారు క్రీ.పూ. 712

    తీవ్రమైన కోపంలో కొంతకాలం నీవైపు నేను చూడలేదు కాని నిత్యమైన కృపతో నీపై జాలి చూపిస్తాను” అని నీ విమోచకుడైన యెహోవా అంటున్నారు.

  3. యెషయా 54:9సుమారు క్రీ.పూ. 712

    “ఇది నాకు నోవహు కాలంలోని జలప్రళయంలా ఉంది, జలప్రళయం భూమి మీదికి ఇకపై రాదని నోవహు కాలంలో నేను ప్రమాణం చేశాను. అలాగే ఇప్పుడు నీ మీద కోప్పడనని, ఎన్నడు నిన్ను గద్దించనని నేను ప్రమాణం చేశాను.

  4. యెషయా 54:10సుమారు క్రీ.పూ. 712

    పర్వతాలు కదిలినా కొండలు తొలగిపోయినా నా మారని ప్రేమ నిన్ను విడిచిపోదు. నా సమాధాన నిబంధన తొలిగిపోదు” అని నీపై దయ చూపించే యెహోవా చెప్తున్నారు.

  5. యెషయా 54:11సుమారు క్రీ.పూ. 712

    “తుఫానులతో కొట్టుకుపోతూ ఓదార్పు లేక బాధపడుతున్న పట్టణమా, వైడూర్యాలతో నేను నిన్ను తిరిగి కడతాను, నీలమణులతో నీ పునాదులను వేస్తాను.

  6. యెషయా 54:12సుమారు క్రీ.పూ. 712

    రత్నాలతో నీ కోట బురుజులపై గోడలు, మెరిసే వజ్రాలతో నీ గుమ్మాలు ప్రశస్తమైన రాళ్లతో నీకు గోడలు కడతాను.

  7. యెషయా 54:13సుమారు క్రీ.పూ. 712

    యెహోవా నీ పిల్లలందరికి బోధిస్తారు వారికి గొప్ప సమాధానం కలుగుతుంది.

  8. యెషయా 54:14సుమారు క్రీ.పూ. 712

    నీవు నీతిలో స్థాపించబడతావు: బాధించేవారు నీకు దూరంగా ఉంటారు. నీవు దేనికి భయపడే అవసరం లేదు. భయం నీకు దూరంగా ఉంటుంది. అది నీ దగ్గరకు రాదు.

  9. యెషయా 54:15సుమారు క్రీ.పూ. 712

    ఎవరైనా నీ మీద దాడి చేస్తే, అది చేసింది నేను కాదు; నీ మీద దాడి చేసినవారు నీకు లొంగిపోతారు.

  10. యెషయా 54:16సుమారు క్రీ.పూ. 712

    “చూడు, నిప్పులు ఊది మండించి తన పనికి తగిన ఆయుధాన్ని తయారుచేసే కమ్మరిని సృజించింది నేనే. నాశనం చేయడానికి నాశనం చేసేవాన్ని సృష్టించింది నేనే.

  11. యెషయా 54:17సుమారు క్రీ.పూ. 712

    నీకు వ్యతిరేకంగా తయారుచేయబడిన ఏ ఆయుధం విజయం సాధించదు, నిన్ను దూషించే ప్రతి నాలుకను నీవు ఖండిస్తావు. యెహోవా సేవకులు పొందే స్వాస్థ్యం ఇదే, నా వలన వారికి కలిగే నిరూపణ ఇదే” అని యెహోవా ప్రకటిస్తున్నారు.

  12. యెషయా 55:1సుమారు క్రీ.పూ. 712

    దాహంతో ఉన్నవారలారా, నీళ్ల దగ్గరకు రండి. డబ్బులేని వారలారా, మీరు వచ్చి కొని తినండి! డబ్బు లేకపోయినా ఏమీ చెల్లించకపోయినా, ద్రాక్షరసం, పాలు కొనండి.

  13. యెషయా 55:2సుమారు క్రీ.పూ. 712

    ఆహారం కాని దాని కోసం మీరెందుకు డబ్బు ఖర్చుపెడతారు? తృప్తి కలిగించని వాటికోసం ఎందుకు కష్టార్జితాన్ని వెచ్చిస్తారు? వినండి, నా మాట వినండి, ఏది మంచిదో దానిని తినండి, అప్పుడు మీరు గొప్ప వాటిని ఆనందిస్తారు.

  14. యెషయా 55:3సుమారు క్రీ.పూ. 712

    శ్రద్ధగా విని నా దగ్గరకు రండి; మీరు వింటే బ్రతుకుతారు. నేను మీతో నిత్య నిబంధన చేస్తాను, దావీదుకు వాగ్దానం చేసిన నా శాశ్వత ప్రేమను మీకు చూపిస్తాను.

  15. యెషయా 55:4సుమారు క్రీ.పూ. 712

    చూడండి, నేను అతన్ని జనాంగాలకు సాక్షిగా చేశాను, జనాంగాలకు రాజుగా అధిపతిగా అతన్ని నియమించాను.

  16. యెషయా 55:5సుమారు క్రీ.పూ. 712

    ఖచ్చితంగా నీకు తెలియని దేశాలను నీవు పిలుస్తావు. యెహోవా నిన్ను మహిమపరచడం చూసి నీ దేవుడైన యెహోవాను బట్టి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని బట్టి నీవెవరో తెలియని దేశాలు నీ దగ్గరకు పరుగెత్తుకొని వస్తాయి.

  17. యెషయా 55:6సుమారు క్రీ.పూ. 712

    యెహోవా మీకు దొరికే సమయంలో ఆయనను వెదకండి; ఆయన సమీపంలో ఉండగానే ఆయనను వేడుకోండి.

  18. యెషయా 55:7సుమారు క్రీ.పూ. 712

    దుష్టులు తమ మార్గాలను అవినీతిపరులు తమ ఆలోచనలు విడిచిపెట్టాలి. వారు యెహోవా వైపు తిరిగితే ఆయన వారిపై జాలి పడతారు. మన దేవుడు వారిని ఉచితంగా క్షమిస్తారు.

  19. యెషయా 55:8సుమారు క్రీ.పూ. 712

    “నా ఆలోచనలు మీ ఆలోచనల వంటివి కావు, మీ మార్గాలు నా మార్గాల వంటివి కావు” అని యెహోవా చెప్తున్నారు.

  20. యెషయా 55:9సుమారు క్రీ.పూ. 712

    “ఆకాశాలు భూమి కన్నా ఎంత ఎత్తుగా ఉన్నాయో, మీ మార్గాల కన్నా నా మార్గాలు మీ ఆలోచనల కన్నా నా ఆలోచనలు అంత ఎత్తుగా ఉన్నాయి.

  21. యెషయా 55:10సుమారు క్రీ.పూ. 712

    వర్షం మంచు ఆకాశం నుండి క్రిందికి వచ్చి ఎలా తిరిగి వెళ్లకుండా భూమిని తడిపి విత్తువానికి విత్తనాన్ని తినేవానికి ఆహారాన్ని ఇవ్వడానికి భూమిని తడిపి విత్తువానికి విత్తనాన్ని తినేవానికి ఆహారాన్ని ఇవ్వడానికి అది చిగురించి ఫలించేలా చేస్తాయో,

  22. యెషయా 55:11సుమారు క్రీ.పూ. 712

    అలాగే నా నోటి నుండి వచ్చిన నా మాట ఉంటుంది: అది వట్టిగా నా దగ్గరకు తిరిగి రాకుండా నేను కోరుకున్న ప్రకారం చేసి నేను దానిని పంపిన ఉద్దేశాన్ని నెరవేరుస్తుంది.

  23. యెషయా 55:12సుమారు క్రీ.పూ. 712

    మీరు సంతోషంగా బయటకు వెళ్తారు, మీరు సమాధానంగా తీసుకెళ్తారు. మీ ఎదుట పర్వతాలు కొండలు పాటలు పాడడం ప్రారంభిస్తాయి, పొలం లోని చెట్లన్నీ తమ చేతులతో చప్పట్లు కొడతాయి.

  24. యెషయా 55:13సుమారు క్రీ.పూ. 712

    ముండ్ల చెట్లకు బదులు సరళ వృక్షాలు పెరుగుతాయి, దురదగొండి చెట్లకు బదులు గొంజిచెట్లు ఎదుగుతాయి. ఇది యెహోవా కీర్తిగా నిత్యమైన గుర్తుగా ఎప్పటికీ నిలిచి ఉంటుంది.”

  25. యెషయా 56:1సుమారు క్రీ.పూ. 712

    యెహోవా చెప్పే మాట ఇదే: “నా రక్షణ రావడానికి సిద్ధంగా ఉంది, నా నీతి త్వరలో వెల్లడవుతుంది, కాబట్టి న్యాయంగా ఉండండి సరియైనది చేయండి.