కంటెంట్‌కు వెళ్లండి

circa 800–400 BC

The Hebrew Prophets

God speaks through Isaiah, Jeremiah, and the minor prophets—calling Israel to repentance and foretelling the coming Messiah.

3,706 వచనాలు · 14 గ్రంథాలు చేర్చబడ్డాయి

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. యెషయా 56:2సుమారు క్రీ.పూ. 712

    ఎవరైతే సబ్బాతును అపవిత్రం చేయకుండ దానిని పట్టుదలతో ఆచరించేవారు, ఏ కీడు చేయకుండ, తమ చేతిని బిగబట్టుకునేవారు ధన్యులు.”

  2. యెషయా 56:3సుమారు క్రీ.పూ. 712

    యెహోవాను వెంబడించే ఏ విదేశీయుడైనా, “యెహోవా తన ప్రజల్లో నుండి నన్ను వెలివేస్తారు” అని అనకూడదు. ఏ నపుంసకుడైనా, “నేను కేవలం ఎండిన చెట్టును” అని అనకూడదు.

  3. యెషయా 56:4సుమారు క్రీ.పూ. 712

    ఎందుకంటే యెహోవా చెప్పే మాట ఇదే: “నేను నియమించిన సబ్బాతును పాటిస్తూ నాకిష్టమైన వాటిని కోరుకుంటూ నా నిబంధనకు నమ్మకంగా ఉండే నపుంసకులకు,

  4. యెషయా 56:5సుమారు క్రీ.పూ. 712

    నా మందిరంలో, నా గోడలలో, కుమారులు, కుమార్తెలు కలిగి ఉన్న దానికన్న శ్రేష్ఠమైన జ్ఞాపకార్థాన్ని, పేరును ఇస్తాను. ఎప్పటికీ నిలిచివుండే నిత్యమైన పేరు వారికి నేను ఇస్తాను.

  5. యెషయా 56:6సుమారు క్రీ.పూ. 712

    యెహోవాకు కట్టుబడి ఉంటూ ఆయనకు సేవ చేస్తూ, యెహోవా నామాన్ని ప్రేమిస్తూ, ఆయన సేవకులుగా ఉంటూ సబ్బాతును అపవిత్రపరచకుండా పాటిస్తూ, నా నిబంధన నమ్మకంగా పాటిస్తున్న విదేశీయులందరిని

  6. యెషయా 56:7సుమారు క్రీ.పూ. 712

    నా పరిశుద్ధ పర్వతం దగ్గరకు తీసుకువస్తాను, నా ప్రార్థన మందిరంలో వారికి ఆనందాన్ని ఇస్తాను. నా బలిపీఠం మీద వారు అర్పించే దహనబలులు అర్పణలు అంగీకరించబడతాయి; నా మందిరం అన్ని దేశాలకు ప్రార్థన మందిరం అని పిలువబడుతుంది.”

  7. యెషయా 56:8సుమారు క్రీ.పూ. 712

    ఇశ్రాయేలీయులలో బందీగా కొనిపోబడినవారిని సమకూర్చే ప్రభువైన యెహోవా ఇలా తెలియజేస్తున్నారు: “నేను సమకూర్చిన వారే కాకుండా వారితో పాటు ఇతరులను సమకూర్చుతాను.”

  8. యెషయా 56:9సుమారు క్రీ.పూ. 712

    పొలం లోని సమస్త జంతువులారా, రండి, అడవిలోని సమస్త మృగాల్లారా, వచ్చి తినండి!

  9. యెషయా 56:10సుమారు క్రీ.పూ. 712

    ఇశ్రాయేలు కావలివారు గ్రుడ్డివారు. వారందరికి తెలివిలేదు; వారందరు మూగ కుక్కలు, వారు మొరగలేరు; వారు పడుకుని కలలు కంటారు, నిద్రంటే వారికి ఇష్టము.

  10. యెషయా 56:11సుమారు క్రీ.పూ. 712

    వారు తిండి కోసం ఆరాటపడే కుక్కల వంటి వారు. ఎంత తిన్నా వారికి తృప్తి ఉండదు. వారు వివేచనలేని కాపరులుగా ఉన్నారు; వారందరు తమకిష్టమైన దారుల్లో పోతారు, తమ సొంత ప్రయోజనం చూసుకుంటారు.

  11. యెషయా 56:12సుమారు క్రీ.పూ. 712

    వారు, “రండి, నేను ద్రాక్షరసం తెప్పిస్తాను మనం తృప్తిగా మద్యం త్రాగుదాం! ఈ రోజులానే రేపు ఉంటుంది, ఇంకా మంచిగా ఉంటుంది” అంటారు.

  12. యెషయా 57:1సుమారు క్రీ.పూ. 698

    నీతిమంతులు నశిస్తారు, ఎవరూ ఆ విషయాన్ని పట్టించుకోరు; భక్తులు మాయమైపోతారు, కీడు చూడకుండ నీతిమంతులు కొనిపోబడడం ఎవరూ గ్రహించరు.

  13. యెషయా 57:2సుమారు క్రీ.పూ. 698

    యథార్థంగా జీవించేవారు సమాధానంలో ప్రవేశిస్తారు; వారు చనిపోయినప్పుడు వారికి విశ్రాంతి కలుగుతుంది.

  14. యెషయా 57:3సుమారు క్రీ.పూ. 698

    “అయితే మంత్రగత్తె పిల్లలారా! వ్యభిచారసంతానమా! వేశ్యసంతానమా! ఇక్కడకు రండి.

  15. యెషయా 57:4సుమారు క్రీ.పూ. 698

    మీరు ఎవరిని ఎగతాళి చేస్తున్నారు? ఎవరిని చూసి వెక్కిరిస్తూ మీ నాలుక చాపుతున్నారు మీరు తిరుగుబాటుదారులు, అబద్ధికుల సంతానం కాదా?

  16. యెషయా 57:5సుమారు క్రీ.పూ. 698

    మీరు సింధూర వృక్షాల క్రింద పచ్చని ప్రతి చెట్టు క్రింద కామంతో రగిలిపోతున్నారు; మీరు కనుమలలో, రాతిసందుల క్రింద మీ పిల్లలను బలి ఇస్తారు.

  17. యెషయా 57:6సుమారు క్రీ.పూ. 698

    కనుమలలోని నున్నని రాళ్ల మధ్యలో ఉన్న విగ్రహాలు మీ భాగము; నిజంగా అవే మీకు భాగము. అవును వాటికి మీ పానార్పణలు పోశారు, భోజనార్పణలు చెల్లించారు. ఇదంతా చూసి నేను క్షమించాలా?

  18. యెషయా 57:7సుమారు క్రీ.పూ. 698

    చాలా ఎత్తైన పర్వతం మీద మీరు మీ పరుపు వేసుకున్నారు; బలులు అర్పించడానికి అక్కడికి ఎక్కి వెళ్లారు.

  19. యెషయా 57:8సుమారు క్రీ.పూ. 698

    తలుపుల వెనుక ద్వారబంధాల వెనుక మీ యూదేతర గుర్తులు పెట్టారు. నన్ను విడిచిపెట్టి మీ పరుపును పరిచారు దాని మీదకు ఎక్కి దానిని వెడల్పు చేశారు; మీరు వారి మంచాలను ప్రేమించి వారితో నిబంధన చేసుకున్నారు. వారి నగ్న శరీరాలను కామంతో చూశారు.

  20. యెషయా 57:9సుమారు క్రీ.పూ. 698

    మీరు ఒలీవనూనె తీసుకుని మోలెకు దగ్గరకు వెళ్లారు ఎన్నో సుగంధ ద్రవ్యాలను తీసుకెళ్లారు. మీరు మీ రాయబారులను దూరప్రాంతానికి పంపించారు; మీరు పాతాళమంత లోతుగా దిగబడిపోయారు!

  21. యెషయా 57:10సుమారు క్రీ.పూ. 698

    మీరు దూర ప్రయాణాలు చేసి అలసిపోయారు, అయినా ‘అది సాధ్యం కాదు’ అని మీరు అనుకోలేదు. మీరు మీ తిరిగి బలం పొందుకున్నారు కాబట్టి మీరు సొమ్మసిల్లలేదు.

  22. యెషయా 57:11సుమారు క్రీ.పూ. 698

    “మీరు ఎవరికి జడిసి భయపడి నా పట్ల నిజాయితీగా లేకుండా, నన్ను జ్ఞాపకం చేసుకోకుండా దీనిని పట్టించుకోకుండా ఉన్నారు? చాలా కాలం నేను మౌనంగా ఉన్నానని మీరు నాకు భయపడడం లేదు కదా?

  23. యెషయా 57:12సుమారు క్రీ.పూ. 698

    నీ నీతిని పనులను నేను బయటపెడతాను అవి మీకు ప్రయోజనకరంగా ఉండవు.

  24. యెషయా 57:13సుమారు క్రీ.పూ. 698

    మీరు సహాయం కోసం మొరపెట్టినప్పుడు మీరు సేకరించిన మీ విగ్రహాలే మిమ్మల్ని రక్షించాలి! గాలి వాటన్నిటిని తీసుకెళ్తుంది, కేవలం ఒకని ఊపిరి వాటిని చెదరగొడుతుంది. అయితే నన్ను ఆశ్రయించినవారు దేశాన్ని స్వతంత్రించుకుంటారు నా పరిశుద్ధ పర్వతాన్ని స్వాధీనం చేసుకుంటారు.”

  25. యెషయా 57:14సుమారు క్రీ.పూ. 698

    ఇలా చెప్పబడుతుంది: “కట్టండి, కట్టండి, దారిని సిద్ధపరచండి! నా ప్రజల మార్గంలో నుండి అడ్డుగా ఉన్నవాటిని తీసివేయండి.”