circa 800–400 BC
The Hebrew Prophets
God speaks through Isaiah, Jeremiah, and the minor prophets—calling Israel to repentance and foretelling the coming Messiah.
ఈ కాలపు వచనాలు
- యెషయా 59:5సుమారు క్రీ.పూ. 698
వారు మిడునాగుల గుడ్లను పొదుగుతారు సాలెగూడు నేస్తారు. వారి గుడ్లు తిన్నవారు చనిపోతారు, ఒక గుడ్డు పగిలితే విషపాము పుడుతుంది.
- యెషయా 59:6సుమారు క్రీ.పూ. 698
వారి సాలెగూళ్లు దుస్తులకు పనికిరావు వారు తయారుచేసిన వాటితో తమను తాము కప్పుకోలేరు. వారి పనులు చెడుపనులు. వారి చేతులతో హింసాత్మక క్రియలు ఉన్నాయి.
- యెషయా 59:7సుమారు క్రీ.పూ. 698
వారి కాళ్లు పాపంలోకి పరుగెత్తుతాయి; నిరపరాధుల రక్తాన్ని చిందించడానికి వారు త్వరపడతారు. వారు దుష్ట పథకాలు అనుసరిస్తారు. హింస క్రియలు వారి మార్గాల్లో ఉన్నాయి.
- యెషయా 59:8సుమారు క్రీ.పూ. 698
సమాధాన మార్గం వారికి తెలియదు; వారి మార్గాల్లో న్యాయం ఉండదు. వాటిని వారు వంకర దారులుగా చేశారు; వాటిలో నడిచే వారెవరికి సమాధానం ఉండదు.
- యెషయా 59:9సుమారు క్రీ.పూ. 698
కాబట్టి న్యాయం మనకు దూరంగా ఉంది, నీతి మనకు అందడం లేదు. మేము వెలుగు కోసం చూస్తున్నాం కాని అంతా చీకటే ఉంది; ప్రకాశం కోసం చూస్తున్నాం కాని కటిక చీకటిలోనే నడుస్తున్నాము.
- యెషయా 59:10సుమారు క్రీ.పూ. 698
గ్రుడ్డివారిలా గోడ కోసం తడుముకుంటున్నాము, కళ్లులేని వారిలా తడుముకుంటున్నాము. సంధ్య చీకటి అన్నట్టు మధ్యాహ్నం కాలుజారి పడుతున్నాము. బలవంతుల మధ్యలో చచ్చిన వారిలా ఉన్నాము.
- యెషయా 59:11సుమారు క్రీ.పూ. 698
మేమంతా ఎలుగుబంట్లలా కేకలు వేస్తున్నాము; పావురాల్లా దుఃఖంతో మూలుగుతున్నాము. మేము న్యాయం కోసం చూస్తున్నాం కాని అది దొరకడం లేదు. రక్షణ కోసం చూస్తున్నాం కాని అది మాకు దూరంగా ఉంది.
- యెషయా 59:12సుమారు క్రీ.పూ. 698
మా అపరాధాలన్నీ మా ఎదుట ఉన్నాయి మా పాపాలు మామీద సాక్ష్యం ఇస్తున్నాయి. మా అపరాధాలన్నీ ఎల్లప్పుడు మాతో ఉన్నాయి, మా దోషాలు మాకు తెలుసు.
- యెషయా 59:13సుమారు క్రీ.పూ. 698
తిరుగుబాటు చేసి యెహోవాకు ద్రోహం చేశాం, మా దేవునికి విరుద్ధంగా ఉంటూ, తిరుగుబాటును ప్రేరేపించడం బాధపెట్టడం, మా హృదయంలో ఆలోచించుకుని, అబద్ధాలు చెప్పడము.
- యెషయా 59:14సుమారు క్రీ.పూ. 698
కాబట్టి న్యాయం వెనుకకు నెట్టబడింది, నీతి దూరంగా నిలబడింది. సత్యం వీధుల్లో పడి ఉంది. నిజాయితీ లోపలికి రాలేకపోతుంది.
- యెషయా 59:15సుమారు క్రీ.పూ. 698
సత్యం ఎక్కడా కనిపించడం లేదు, చెడును విడిచిపెట్టేవాడు దోచుకోబడుతున్నాడు. న్యాయం జరగకపోవడం చూసి యెహోవా అసంతృప్తి చెందారు.
- యెషయా 59:16సుమారు క్రీ.పూ. 698
ఎవరూ లేరని ఆయన చూశారు, మధ్యవర్తి ఎవరూ లేకపోవడం చూసి ఆయన ఆశ్చర్యపోయారు; కాబట్టి ఆయన చేయి ఆయనకు సహాయం చేసింది, ఆయన నీతి ఆయనను నిలబెట్టింది.
- యెషయా 59:17సుమారు క్రీ.పూ. 698
ఆయన నీతిని తన కవచంగా ధరించారు, రక్షణను తన తలమీద శిరస్త్రాణంగా ధరించారు; ఆయన ప్రతీకార వస్త్రాలను ధరించారు పై వస్త్రం ధరించినట్లు ఆయన తనను తాను ఆసక్తితో చుట్టుకున్నారు.
- యెషయా 59:18సుమారు క్రీ.పూ. 698
వారు చేసిన దానిని బట్టి ఆయన ప్రతిఫలం ఇస్తారు తన శత్రువులకు కోపం చూపిస్తారు తన విరోధులకు ప్రతీకారం చేస్తారు; ఆయన ద్వీపాలకు తగిన ప్రతిఫలాన్ని చెల్లిస్తారు.
- యెషయా 59:19సుమారు క్రీ.పూ. 698
పశ్చిమలో ఉన్నవారు యెహోవా నామానికి భయపడతారు. సూర్యోదయ దిక్కున ఉన్నవారు ఆయన మహిమను గౌరవిస్తారు. యెహోవా ఊపిరి తీసుకువచ్చే ఉధృతమైన వరదలా ఆయన వస్తారు.
- యెషయా 59:20సుమారు క్రీ.పూ. 698
“సీయోను దగ్గరకు, యాకోబులో తమ పాపాలకు పశ్చాత్తాపం చెందినవారి దగ్గరకు విమోచకుడు వస్తాడు,” అని యెహోవా తెలియజేస్తున్నారు.
- యెషయా 59:21సుమారు క్రీ.పూ. 698
“నేను వారితో చేసే నా నిబంధన ఇదే” అని యెహోవా చెప్తున్నారు. “మీమీద ఉన్న నా ఆత్మ మీ నుండి తొలిగిపోదు, నేను మీ నోటిలో ఉంచిన నా మాటలు, మీ పెదవుల నుండి, మీ పిల్లల పెదవుల నుండి, వారి వారసుల పెదవుల నుండి, ఇప్పటినుండి ఎప్పటికీ తొలగిపోవు” అని యెహోవా తెలియజేస్తున్నారు.
- యెషయా 60:1సుమారు క్రీ.పూ. 698
“లేచి ప్రకాశించు, నీ వెలుగు వచ్చింది, యెహోవా మహిమ నీ మీద ఉదయించింది.
- యెషయా 60:2సుమారు క్రీ.పూ. 698
చూడు, భూమిని చీకటి కమ్ముతుంది కటిక చీకటి జనాంగాలను కమ్ముకుంటుంది. కాని యెహోవా నీ మీద ఉదయిస్తున్నారు. ఆయన మహిమ నీ మీద కనబడుతుంది.
- యెషయా 60:3సుమారు క్రీ.పూ. 698
దేశాలు నీ వెలుగు దగ్గరకు వస్తాయి, రాజులు నీ ఉదయకాంతి దగ్గరకు వస్తారు.
- యెషయా 60:4సుమారు క్రీ.పూ. 698
“నీ కళ్లు పైకెత్తి చూడు: అందరు కలిసి నీ దగ్గరకు వస్తున్నారు; నీ కుమారులు దూరం నుండి వస్తున్నారు, నీ కుమార్తెలు చంకనెక్కి వస్తున్నారు.
- యెషయా 60:5సుమారు క్రీ.పూ. 698
అప్పుడు నీవు చూసి ప్రకాశిస్తావు. నీ గుండె కొట్టుకొంటూ ఆనందంతో పొంగుతుంది; సముద్ర సంపద నీ దగ్గరకు త్రిప్పబడుతుంది, దేశాల సంపద నీ దగ్గరకు వస్తుంది.
- యెషయా 60:6సుమారు క్రీ.పూ. 698
ఒంటెల మందలు, మిద్యాను ఏఫాల ఒంటె పిల్లలతో నీ దేశం నిండిపోతుంది. వారందరు షేబ నుండి వస్తారు, బంగారం ధూపద్రవ్యాలను తీసుకువస్తారు, యెహోవా స్తుతిని ప్రకటిస్తారు.
- యెషయా 60:7సుమారు క్రీ.పూ. 698
నీ దగ్గర కేదారు గొర్రె మందలన్నీ సమకూడతాయి. నెబాయోతు పొట్టేళ్లు నీకు సేవ చేస్తాయి; అవి నా బలిపీఠం మీద అర్పణలుగా అంగీకరించబడతాయి. నేను నా మహిమగల మందిరాన్ని అలంకరిస్తాను.
- యెషయా 60:8సుమారు క్రీ.పూ. 698
“మేఘాల్లా, తమ గూళ్లకు ఎగిరిపోయే పావురాల్లా ఎగిరే వీరెవరు?