circa 800–400 BC
The Hebrew Prophets
God speaks through Isaiah, Jeremiah, and the minor prophets—calling Israel to repentance and foretelling the coming Messiah.
ఈ కాలపు వచనాలు
- యెషయా 60:9సుమారు క్రీ.పూ. 698
నిజంగా ద్వీపాలు నా వైపు చూస్తాయి; నీ దేవుడైన యెహోవాను ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని ఘనపరచడానికి, తర్షీషు ఓడలు మొదట వస్తున్నాయి, దూరము నుండి నీ పిల్లలను తమ వెండి బంగారాలను తీసుకువస్తున్నాయి, ఎందుకంటే ఆయన నిన్ను వైభవంతో అలంకరించారు.
- యెషయా 60:10సుమారు క్రీ.పూ. 698
“విదేశీయులు నీ గోడల్ని మరల కడతారు, వారి రాజులు నీకు సేవ చేస్తారు. నేను కోపంలో నిన్ను కొట్టాను కాని, నేను కరుణించి నీ మీద దయ చూపిస్తాను.
- యెషయా 60:11సుమారు క్రీ.పూ. 698
నీ దగ్గరకు దేశాల సంపద తీసుకురావడానికి, జయోత్సవంతో వారి రాజులను నడిపించడానికి, నీ ద్వారాలు రాత్రింబగళ్ళు మూసివేయకుండా నిత్యం తెరిచే ఉంటాయి.
- యెషయా 60:12సుమారు క్రీ.పూ. 698
నిన్ను సేవించని దేశమైనా రాజ్యమైనా నాశనమవుతుంది; అది పూర్తిగా నాశనమవుతుంది.
- యెషయా 60:13సుమారు క్రీ.పూ. 698
“నా పరిశుద్ధాలయాన్ని అలంకరించడానికి లెబానోను యొక్క వైభవమైన దేవదారు వృక్షాలు, సరళ వృక్షాలు, గొంజిచెట్లు నీ దగ్గరకు తీసుకువస్తారు. నేను నా పాదాలు పెట్టే స్థలాన్ని మహిమపరుస్తాను.
- యెషయా 60:14సుమారు క్రీ.పూ. 698
నిన్ను బాధించినవారి పిల్లలు నీ ఎదుటకు వచ్చి నమస్కరిస్తారు. నిన్ను తృణీకరించిన వారందరు వచ్చి నీ పాదాల దగ్గర మోకరిస్తారు, యెహోవా పట్టణమని, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని యొక్క సీయోనని వారు నిన్ను పిలుస్తారు.
- యెషయా 60:15సుమారు క్రీ.పూ. 698
“నీవు విడిచిపెట్టబడి, ద్వేషించబడి నీ మార్గంలో ఎవరూ ప్రయాణించకపోయినా, నేను నిన్ను శాశ్వత ఘనతగా అన్ని తరాలకు ఆనందంగా చేస్తాను.
- యెషయా 60:16సుమారు క్రీ.పూ. 698
నీవు దేశాల పాలు త్రాగుతావు రాజుల చనుపాలు త్రాగుతావు. అప్పుడు నీవు యెహోవానైన నేనే నీ రక్షకుడనని యాకోబు యొక్క బలవంతుడైన నీ విమోచకుడని తెలుసుకుంటావు.
- యెషయా 60:17సుమారు క్రీ.పూ. 698
నేను ఇత్తడికి బదులు బంగారాన్ని ఇనుముకు బదులు వెండిని నీకు తెస్తాను. నేను కర్రకు బదులు ఇత్తడిని రాళ్లకు బదులు ఇనుమును నీకు తెస్తాను. నేను సమాధానాన్ని నీకు అధిపతిగా నీతిని నీకు పాలకునిగా నియమిస్తాను.
- యెషయా 60:18సుమారు క్రీ.పూ. 698
ఇకపై నీ దేశంలో హింస అనేది వినబడదు, నీ సరిహద్దులలో నాశనం గాని విధ్వంసం గాని వినపడదు. అయితే నీవు నీ గోడలను రక్షణ అని నీ గుమ్మాలను స్తుతి అని పిలుస్తావు.
- యెషయా 60:19సుమారు క్రీ.పూ. 698
ఇకమీదట పగలు సూర్యుని వెలుగు నీకు ఉండదు, చంద్రుని వెన్నెల నీపై ప్రకాశించదు, యెహోవా నీకు నిత్యమైన వెలుగుగా ఉంటారు. నీ దేవుడు నీకు మహిమగా ఉంటారు.
- యెషయా 60:20సుమారు క్రీ.పూ. 698
నీ సూర్యుడికపై అస్తమించడు. నీ చంద్రుడు క్షీణించడు. యెహోవా నీకు నిత్యమైన వెలుగుగా ఉంటారు, నీ దుఃఖ దినాలు అంతమవుతాయి.
- యెషయా 60:21సుమారు క్రీ.పూ. 698
అప్పుడు నీ ప్రజలందరు నీతిమంతులుగా ఉంటారు; వారు దేశాన్ని శాశ్వతంగా స్వతంత్రించుకుంటారు. నా వైభవం కనుపరచడానికి వారు నేను నాటిన కొమ్మగా నా చేతుల పనిగా ఉంటారు.
- యెషయా 60:22సుమారు క్రీ.పూ. 698
నీలో చిన్నవాడు వేయిమంది అవుతాడు, కొద్దిగా ఉన్నది బలమైన దేశమవుతుంది. నేను యెహోవాను; సరియైన సమయంలో ఈ పనిని త్వరగా చేస్తాను.”
- యెషయా 61:1సుమారు క్రీ.పూ. 698
ప్రభువైన యెహోవా ఆత్మ నా మీద ఉన్నది. బీదలకు సువార్త ప్రకటించడానికి యెహోవా నన్ను అభిషేకించారు. విరిగిన హృదయం గలవారిని బలపరచడానికి బందీలకు విడుదలను ఖైదీలకు చీకటి నుండి విముక్తిని ప్రకటించడానికి,
- యెషయా 61:2సుమారు క్రీ.పూ. 698
యెహోవా హితవత్సరాన్ని, మన దేవుని ప్రతీకార దినాన్ని ప్రకటించడానికి దుఃఖిస్తున్న వారందరినీ ఓదార్చడానికి,
- యెషయా 61:3సుమారు క్రీ.పూ. 698
సీయోనులో దుఃఖిస్తున్న వారికి బూడిదకు బదులుగా అందమైన కిరీటాన్ని దుఃఖానికి బదులు ఆనంద తైలాన్ని భారమైన ఆత్మకు బదులు స్తుతి వస్త్రాన్ని అందించడానికి నన్ను పంపారు. యెహోవా తన వైభవాన్ని కనుపరచడానికి, నీతి అనే సింధూర చెట్లని యెహోవా నాటిన చెట్లని వారు పిలువబడతారు.
- యెషయా 61:4సుమారు క్రీ.పూ. 698
పురాతన శిథిలాలను వారు మరలా కడతారు గతంలో నాశనమైన స్థలాలను వారు పునరుద్ధరిస్తారు; పాడైపోయిన పట్టణాలను తరతరాల నుండి నాశనమైన ఉన్న స్థలాలను వారు నూతనపరుస్తారు.
- యెషయా 61:5సుమారు క్రీ.పూ. 698
అపరిచితులు మీ మందల్ని మేపుతారు; విదేశీయులు మీ పొలాల్లో ద్రాక్షతోటల్లో పని చేస్తారు.
- యెషయా 61:6సుమారు క్రీ.పూ. 698
మీరు యెహోవా యాజకులని పిలువబడతారు, మా దేవుని సేవకులు అని మీకు పేరు పెట్టబడుతుంది. దేశాల సంపదను మీరు అనుభవిస్తారు వారి ఐశ్వర్యాన్ని పొంది అతిశయిస్తారు.
- యెషయా 61:7సుమారు క్రీ.పూ. 698
మీ అవమానానికి బదులుగా రెట్టింపు ఘనత పొందుతారు. నిందకు బదులుగా మీ స్వాస్థ్యంలో మీరు సంతోషిస్తారు. మీరు మీ దేశంలో రెట్టింపు స్వాస్థ్యాన్ని పొందుతారు, శాశ్వతమైన ఆనందం మీకు కలుగుతుంది.
- యెషయా 61:8సుమారు క్రీ.పూ. 698
“ఎందుకంటే యెహోవానైన నాకు న్యాయమంటే ఇష్టము; దోపిడి చేయడం, చెడు చేయడం నాకు అసహ్యము. నా నమ్మకత్వాన్ని బట్టి నా ప్రజలకు ప్రతిఫలమిస్తాను వారితో శాశ్వతమైన నిబంధన చేస్తాను.
- యెషయా 61:9సుమారు క్రీ.పూ. 698
వారి వారసులు దేశాల మధ్య వారి సంతానం జనాంగాల మధ్య ప్రసిద్ధి పొందుతారు. వారు యెహోవా ఆశీర్వదించిన ప్రజలని వారిని చూసినవారందరు గుర్తిస్తారు.”
- యెషయా 61:10సుమారు క్రీ.పూ. 698
యాజకునిలా తలపాగా ధరించిన పెండ్లికుమారునిలా నగలతో అలంకరించుకున్న పెండ్లికుమార్తెలా ఆయన నాకు రక్షణ వస్త్రాలను ధరింపచేశారు ఆయన నీతి అనే పైబట్టను నాకు ధరింపచేశారు కాబట్టి యెహోవాలో నేను ఎంతో ఆనందిస్తున్నాను. నా దేవునిలో నా ఆత్మ సంతోషిస్తుంది.
- యెషయా 61:11సుమారు క్రీ.పూ. 698
భూమి మొలకను మొలిపించినట్లు, విత్తనాలు ఎదిగేలా చేసే తోటలా, అన్ని దేశాల ఎదుట ప్రభువైన యెహోవా నీతిని, స్తుతిని మొలకెత్తేలా చేస్తారు.