కంటెంట్‌కు వెళ్లండి

circa 800–400 BC

The Hebrew Prophets

God speaks through Isaiah, Jeremiah, and the minor prophets—calling Israel to repentance and foretelling the coming Messiah.

3,706 వచనాలు · 14 గ్రంథాలు చేర్చబడ్డాయి

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. యెషయా 47:6సుమారు క్రీ.పూ. 712

    నా ప్రజల మీద నేను కోప్పడి నా స్వాస్థ్యాన్ని అపవిత్రపరిచాను; నేను వారిని నీ చేతికి అప్పగించాను, నీవు వారిమీద జాలి చూపలేదు. వృద్ధుల మీద కూడా నీవు చాలా బరువైన కాడిని ఉంచావు.

  2. యెషయా 47:7సుమారు క్రీ.పూ. 712

    నీవు ‘నేను ఎప్పటికీ నిత్య రాణిగా ఉంటాను!’ అని అనుకున్నావు. కాని వీటి గురించి ఆలోచించలేదు ఏమి జరగబోతుందో తెలుసుకోలేదు.

  3. యెషయా 47:8సుమారు క్రీ.పూ. 712

    “నీవు సుఖాన్ని ప్రేమిస్తూ క్షేమంగా జీవిస్తూ, ‘నేనే ఉన్నాను, నేను తప్ప వేరే ఎవరూ లేరు. నేను ఎప్పటికీ విధవరాలిని కాను బిడ్డల్ని పోగొట్టుకొని బాధపడను’ అని నీలో నీవు అనుకుంటున్నావు, కాని ఇప్పుడు ఈ మాట విను.

  4. యెషయా 47:9సుమారు క్రీ.పూ. 712

    ఒక్క క్షణంలోనే ఒక్క రోజులోనే ఈ రెండు నీకు సంభవిస్తాయి: బిడ్డల్ని పోగొట్టుకుంటావు విధవరాలిగా మారతావు. నీవు చాలా శకునాలు చూసినా, అనేక కర్ణపిశాచ తంత్రాల మీద ఆధారపడినా ఈ విషాదాలు నీ మీదికి పూర్తిగా వస్తాయి.

  5. యెషయా 47:10సుమారు క్రీ.పూ. 712

    నీ చెడుతనాన్ని నీవు నమ్ముకుని ‘ఎవరూ నన్ను చూడరు’ అని అనుకున్నావు. ‘నేనే, నేను తప్ప వేరే ఎవరూ లేరు’ అని నీకు నీవు అనుకున్నప్పుడు నీ జ్ఞానం నీ తెలివి నిన్ను తప్పుదారి పట్టించాయి.

  6. యెషయా 47:11సుమారు క్రీ.పూ. 712

    విపత్తు నీ మీదికి వస్తుంది, దానిని మాయాజాలంతో ఎలా పోగొట్టాలో నీవు తెలుసుకోలేవు. ఒక కీడు నీ మీద పడుతుంది దానిని నీవు డబ్బుతో నివారించలేవు; నీకు తెలియని నాశనం నీ మీదికి అకస్మాత్తుగా వస్తుంది.

  7. యెషయా 47:12సుమారు క్రీ.పూ. 712

    “నీ చిన్నప్పటి నుండి నీవు కష్టపడి నేర్చుకున్న నీ కర్ణపిశాచ తంత్రాలను నీ విస్తారమైన శకునాలను ప్రయోగించుకో బహుశ నీవు విజయం సాధిస్తావేమో, బహుశ నీవు భయం కలిగించగలవేమో.

  8. యెషయా 47:13సుమారు క్రీ.పూ. 712

    నీవు తీసుకున్న సలహాలన్నీ విని నీవు అలసిపోయావు. నీ జ్యోతిష్యులు, నెలలవారీగా రాశి ఫలాలను చెప్పేవారిని రమ్మను, నీ మీదికి వచ్చే వాటినుండి నిన్ను వారు రక్షించాలి.

  9. యెషయా 47:14సుమారు క్రీ.పూ. 712

    నిజంగా వారు గడ్డిపరకలా అవుతారు; అగ్ని వారిని కాల్చివేస్తుంది. అగ్ని జ్వాలల నుండి వారు తమను తాము కాపాడుకోలేరు. అవి చలికాచుకోవడానికి వాడే నిప్పులు కాదు; ఎదురుగా కూర్చుని కాచుకునే అగ్ని కూడా కాదు.

  10. యెషయా 47:15సుమారు క్రీ.పూ. 712

    నీ చిన్నప్పటి నుండి నీవు ఎవరి కోసం శ్రమపడ్డావో వారంతా నిన్ను నిరాశపరుస్తారు. వారంతా తమ తప్పుదారిలో వెళ్లిపోతారు. నిన్ను రక్షించగలిగే వారొక్కరూ ఉండడు.

  11. యెషయా 48:1సుమారు క్రీ.పూ. 712

    “యాకోబు వారసులారా, ఇశ్రాయేలు అనే పేరుతో పిలువబడి యూదా కుటుంబం నుండి వచ్చే వారలారా వినండి, యెహోవా పేరిట ప్రమాణం చేస్తూ ఇశ్రాయేలు దేవుని వేడుకుంటూ సత్యాన్ని గాని నీతి గాని అనుసరించని వారలారా వినండి.

  12. యెషయా 48:2సుమారు క్రీ.పూ. 712

    మీ గురించి మీరు పరిశుద్ధ పట్టణస్థులమని చెప్పుకుంటూ ఇశ్రాయేలు దేవుని మీద ఆధారపడుతున్నామని చెప్పుకుంటున్న మీరు వినండి, ఆయన పేరు సైన్యాల యెహోవా:

  13. యెషయా 48:3సుమారు క్రీ.పూ. 712

    గతంలో జరిగిన వాటి గురించి నేను చాలా కాలం క్రితమే చెప్పాను. నా నోరు వాటిని ప్రకటించింది నేను వాటిని తెలియజేశాను; తర్వాత నేను అకస్మాత్తుగా వాటిని చేయగా అవి జరిగాయి.

  14. యెషయా 48:4సుమారు క్రీ.పూ. 712

    ఎందుకంటే మీరు ఎంత మొండివారో నాకు తెలుసు; నీ మెడ నరాలు ఇనుపవని, నీ నుదురు ఇత్తడిదని నాకు తెలుసు.

  15. యెషయా 48:5సుమారు క్రీ.పూ. 712

    కాబట్టి వీటి గురించి నేను చాలా కాలం క్రితం చెప్పాను; ‘నా విగ్రహం ఈ పనులను జరిగించింది నేను చెక్కిన ప్రతిమ, నేను పోతపోసిన విగ్రహం వాటిని నియమించాయి’ అని నీవు ఎప్పుడూ చెప్పకుండా ఉండేలా అవి జరగకముందే నీకు వాటిని ప్రకటించాను.

  16. యెషయా 48:6సుమారు క్రీ.పూ. 712

    నీవు ఈ సంగతులను విన్నావు; వాటన్నిటిని చూడు. అవి నిజమని నీవు ఒప్పుకోవా? “నీకు తెలియకుండా దాచబడిన క్రొత్త విషయాలను ఇకపై నేను నీకు చెప్తాను.

  17. యెషయా 48:7సుమారు క్రీ.పూ. 712

    అవి ఇప్పుడే సృజించినవి, ఎప్పుడో చేసినవి కావు; ఈ రోజుకు ముందు నీవు వాటి గురించి వినలేదు. అప్పుడు, ‘అవును, వాటి గురించి నాకు తెలుసు’ అని నీవు చెప్పలేవు.

  18. యెషయా 48:8సుమారు క్రీ.పూ. 712

    నీవు వాటి గురించి వినలేదు, అవి నీకు తెలియదు; పూర్వం నుండి నీ చెవులు తెరవబడలేదు. నీవు ఎంత ద్రోహివో నాకు తెలుసు; నీ పుట్టుక నుండి తిరుగుబాటుదారుడవు.

  19. యెషయా 48:9సుమారు క్రీ.పూ. 712

    నేను నిన్ను పూర్తిగా నాశనం చేయకుండా నా నామాన్ని బట్టి నా కోపాన్ని ఆపుకున్నాను; నా కీర్తి కోసం నీ నుండి దానిని నేను నిగ్రహించుకున్నాను.

  20. యెషయా 48:10సుమారు క్రీ.పూ. 712

    చూడు, నేను నిన్ను శుద్ధి చేశాను, కాని వెండిని చేసినట్లు కాదు; బాధల కొలిమిలో నిన్ను పరీక్షించాను.

  21. యెషయా 48:11సుమారు క్రీ.పూ. 712

    నా కోసం, నా కొరకే, నేను ఇలా చేస్తాను. నా పేరును ఎలా అపవిత్రం చేయనిస్తాను? నేను నా మహిమను మరొకరికి ఇవ్వను.

  22. యెషయా 48:12సుమారు క్రీ.పూ. 712

    “యాకోబూ, నేను పిలిచిన ఇశ్రాయేలూ, నా మాట విను. నేనే ఆయనను; నేనే మొదటివాడను నేను చివరివాడను.

  23. యెషయా 48:13సుమారు క్రీ.పూ. 712

    నా సొంత చేయి భూమికి పునాదులను వేసింది, నా కుడిచేయి ఆకాశాలను విశాలపరిచింది; నేను వాటిని పిలిచినప్పుడు అవన్నీ కలసి నిలబడతాయి.

  24. యెషయా 48:14సుమారు క్రీ.పూ. 712

    “మీరందరూ కలసి వచ్చి వినండి: విగ్రహాలలో ఏది ఈ విషయాలను ముందే చెప్పింది? యెహోవా స్నేహితునిగా ఎంచుకున్నవాడు ఆయన ఉద్దేశాన్ని బబులోనుకు చేస్తాడు ఆయన చేయి బబులోనీయులకు వ్యతిరేకంగా ఉంటుంది.

  25. యెషయా 48:15సుమారు క్రీ.పూ. 712

    నేను, నేనే చెప్పాను; అవును, నేనే అతన్ని పిలిచాను. నేను అతన్ని రప్పిస్తాను అతడు తన పనిలో విజయం సాధిస్తాడు.