కంటెంట్‌కు వెళ్లండి

circa 800–400 BC

The Hebrew Prophets

God speaks through Isaiah, Jeremiah, and the minor prophets—calling Israel to repentance and foretelling the coming Messiah.

3,706 వచనాలు · 14 గ్రంథాలు చేర్చబడ్డాయి

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. యెషయా 44:22సుమారు క్రీ.పూ. 712

    మేఘం విడిపోవునట్లు నీ దోషాలను ఉదయకాలపు మంచు మబ్బు తొలగిపోయేలా నీ పాపాలను, తుడిచివేశాను. నేను నిన్ను విడిపించాను. నా దగ్గరకు తిరిగి రా.”

  2. యెషయా 44:23సుమారు క్రీ.పూ. 712

    యెహోవా దీనిని చేశారు కాబట్టి ఆకాశాల్లారా, ఆనందంతో పాడండి; భూమి లోతుల్లారా, బిగ్గరగా అరవండి. పర్వతాల్లారా, అరణ్యమా, నీలో ఉన్న ప్రతి చెట్టు సంగీత నాదం చేయండి. యెహోవా యాకోబును విడిపించారు ఆయన ఇశ్రాయేలులో తన మహిమను చూపిస్తారు.

  3. యెషయా 44:24సుమారు క్రీ.పూ. 712

    “నిన్ను గర్భంలో రూపించిన నీ విమోచకుడైన యెహోవా చెప్పే మాట ఇదే: “యెహోవాను నేనే అన్నిటిని సృష్టించాను, నేనే ఆకాశాలను విశాలపరిచాను నేను నేనే భూమికి ఆకారమిచ్చాను.

  4. యెషయా 44:25సుమారు క్రీ.పూ. 712

    నేనే అబద్ధ ప్రవక్తల సూచనలను భంగం చేస్తాను, సోదె చెప్పేవారిని వెర్రివారిగా చేస్తాను. జ్ఞానులను వెనుకకు త్రిప్పి వారి చదువును వ్యర్థం చేసేది నేనే.

  5. యెషయా 44:26సుమారు క్రీ.పూ. 712

    నా సేవకుని మాటలను స్థిరపరచి నా దూతల ఆలోచనను నెరవేర్చేది నేనే. “యెరూషలేము నివాస స్థలంగా అవుతుందని యూదా పట్టణాలు మరలా కట్టబడతాయని వాటిలో పాడైన స్థలాలను బాగుచేయబడతాయని చెప్పాను.

  6. యెషయా 44:27సుమారు క్రీ.పూ. 712

    నేను నీటి లోతులతో, ‘ఎండిపో, నీ ప్రవాహాలను ఎండిపోయేటట్లు చేస్తాను’ అని చెప్పాను.

  7. యెషయా 44:28సుమారు క్రీ.పూ. 712

    నేను కోరెషు గురించి, ‘అతడు నా కాపరి, నా ఇష్టాన్నంతటిని నెరవేరుస్తాడు’ అని చెప్పాను. అతడు, ‘యెరూషలేము తిరిగి కట్టబడాలి’ అని ‘మందిరం పునాదులు వేయబడాలి’ అని చెప్తాడు.”

  8. యెషయా 45:1సుమారు క్రీ.పూ. 712

    కోరెషు పక్షంగా దేశాలను జయించడానికి రాజులను నిరాయుధులుగా చేయడానికి అతని ఎదుట ద్వారాలు మూయబడకుండా తలుపులు తీయడానికి నేను అతని కుడిచేతిని పట్టుకున్నాను. తన అభిషిక్తుడైన ఈ కోరెషుతో యెహోవా చెప్పే మాట ఇదే:

  9. యెషయా 45:2సుమారు క్రీ.పూ. 712

    నేను నీకు ముందుగా వెళ్లి పర్వతాలను చదును చేస్తాను; ఇత్తడి తలుపుల్ని పగలగొట్టి, ఇనుప గడియలను విరగ్గొడతాను.

  10. యెషయా 45:3సుమారు క్రీ.పూ. 712

    పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడనైన యెహోవాను నేనేనని నీవు తెలుసుకునేలా రహస్య స్థలాల్లో ఉంచిన నిధులను దాచబడిన ధనాన్ని నీకిస్తాను.

  11. యెషయా 45:4సుమారు క్రీ.పూ. 712

    నా సేవకుడైన యాకోబు కోసం నేను ఏర్పరచుకున్న ఇశ్రాయేలు కోసం నేను పేరు పెట్టి నిన్ను పిలిచాను. నీవు నన్ను గుర్తించకపోయినా నీకు గౌరవ బిరుదు ఇచ్చాను.

  12. యెషయా 45:5సుమారు క్రీ.పూ. 712

    నేను యెహోవాను, వేరే ఏ దేవుడు లేడు; నేను తప్ప ఏ దేవుడు లేడు. నీవు నన్ను గుర్తించకపోయినా నేను నిన్ను బలపరుస్తాను.

  13. యెషయా 45:6సుమారు క్రీ.పూ. 712

    అప్పుడు సూర్యోదయ దిక్కునుండి సూర్యాస్తమయ స్థలం వరకు నేను తప్ప ఏ దేవుడు లేడని ప్రజలు తెలుసుకుంటారు. యెహోవాను నేనే; నేను తప్ప వేరే ఎవరూ లేడు.

  14. యెషయా 45:7సుమారు క్రీ.పూ. 712

    నేను వెలుగును రూపిస్తాను, చీకటిని కలుగజేస్తాను, నేను వృద్ధిని తెస్తాను, విపత్తును కలుగజేస్తాను. యెహోవానైన నేను వీటన్నిటిని చేస్తాను.

  15. యెషయా 45:8సుమారు క్రీ.పూ. 712

    “పైనున్న ఆకాశాల్లారా, నా నీతిని వర్షింపనివ్వండి; మేఘాలు వాటిని క్రిందికి కురిపించాలి. భూమి విశాలంగా తెరవాలి, రక్షణ మొలవాలి, నీతి దానితో కలిసి వర్ధిల్లాలి; యెహోవానైన నేను దానిని సృష్టించాను.

  16. యెషయా 45:9సుమారు క్రీ.పూ. 712

    “మట్టి కుండ పెంకులలో ఒక పెంకుగా ఉండి తనను చేసినవానితో వాదించే వారికి శ్రమ. జిగటమన్ను కుమ్మరితో, ‘నీవు ఏం తయారుచేస్తున్నావు?’ అని అంటుందా? అతని పని అతనితో, ‘కుమ్మరికి నైపుణ్యం లేదు’ అని అంటుందా?

  17. యెషయా 45:10సుమారు క్రీ.పూ. 712

    ‘నీవు కన్నది ఏంటి?’ అని తండ్రితో అనే వానికి, ‘నీ గర్భంలో పుట్టింది ఏంటి?’ అని తల్లితో అనే వానికి శ్రమ.

  18. యెషయా 45:11సుమారు క్రీ.పూ. 712

    “ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు దానిని సృష్టించిన యెహోవా చెప్పే మాట ఇదే: జరుగబోయే వాటి గురించి, నా కుమారుల గురించి నన్ను అడుగుతారా? నా చేతిపనుల గురించి నన్నే ఆజ్ఞాపిస్తారా?

  19. యెషయా 45:12సుమారు క్రీ.పూ. 712

    భూమిని కలుగచేసింది దాని మీద ఉన్న నరులను సృష్టించింది నేనే. నా సొంత చేతులు ఆకాశాలను విశాలపరిచాయి; నేను వాటి నక్షత్ర సమూహాలను నడిపిస్తాను.

  20. యెషయా 45:13సుమారు క్రీ.పూ. 712

    నేను నీతిని బట్టి కోరెషును పురికొల్పుతాను: అతని మార్గాలన్నీ తిన్నగా చేస్తాను. అతడు నా పట్టణాన్ని మరలా కడతాడు ఏ వెల ఏ బహుమానం తీసుకోకుండ బందీలుగా ఉన్నవారిని అతడు విడిపిస్తాడు అని సైన్యాల యెహోవా అన్నారు.”

  21. యెషయా 45:14సుమారు క్రీ.పూ. 712

    యెహోవా చెప్పే మాట ఇదే: “ఈజిప్టు సంపాదన, కూషు వ్యాపార లాభాలు, పొడవైన సెబాయీయులు; నీ దగ్గరకు వచ్చి నీవారవుతారు; సంకెళ్ళతో నీ దగ్గరకు వచ్చి నీ ఎదుట మోకరిస్తారు. ‘నిజంగా దేవుడు నీతో ఉన్నారు, వేరే ఎవరూ లేరు; వేరే ఏ దేవుడు లేడు’ అని నీ ఎదుట నమస్కారం చేసి మనవి చేస్తారు.”

  22. యెషయా 45:15సుమారు క్రీ.పూ. 712

    ఇశ్రాయేలు దేవా, రక్షకా, నిశ్చయంగా మీరు కనబడకుండా చేసుకున్న దేవుడవు.

  23. యెషయా 45:16సుమారు క్రీ.పూ. 712

    విగ్రహాలను చేసే వారందరు సిగ్గుపడి అవమానపడతారు. వారందరు కలిసి అవమానానికి గురవుతారు.

  24. యెషయా 45:17సుమారు క్రీ.పూ. 712

    అయితే యెహోవా వలన ఇశ్రాయేలు నిత్యమైన రక్షణ పొందుతుంది; మీరు మరలా ఎప్పటికీ సిగ్గుపరచబడరు, అవమానం పొందరు.

  25. యెషయా 45:18సుమారు క్రీ.పూ. 712

    యెహోవా చెప్పే మాట ఇదే: ఆకాశాలను సృష్టించిన యెహోవాయే దేవుడు. ఆయన భూమికి ఆకారమిచ్చి దానిని స్థిరపరిచారు: దానిని శూన్యంగా సృష్టించలేదు కాని, నివాస స్థలంగా దానిని చేశారు. ఆయన అంటున్నారు: “యెహోవాను నేనే మరి వేరే ఎవరూ లేరు.