కంటెంట్‌కు వెళ్లండి

circa 800–400 BC

The Hebrew Prophets

God speaks through Isaiah, Jeremiah, and the minor prophets—calling Israel to repentance and foretelling the coming Messiah.

3,706 వచనాలు · 14 గ్రంథాలు చేర్చబడ్డాయి

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. యెషయా 45:19సుమారు క్రీ.పూ. 712

    నేను ఎక్కడో చీకటి దేశంలో నుండి రహస్యంగా మాట్లాడలేదు; ‘వ్యర్థంగా నన్ను వెదకండి’ అని యాకోబు సంతానంతో నేను చెప్పలేదు. యెహోవానైన నేను సత్యం మాట్లాడతాను; నేను యథార్థమైనవే తెలియజేస్తాను.

  2. యెషయా 45:20సుమారు క్రీ.పూ. 712

    “అంతా కలిసి రండి; దేశాల నుండి తప్పించుకు పారిపోయినవారలారా రండి. చెక్క విగ్రహాలను మోస్తూ, రక్షించలేని దేవుళ్ళకు మొరపెట్టే వారికి తెలివిలేదు.

  3. యెషయా 45:21సుమారు క్రీ.పూ. 712

    నా సన్నిధిలోకి వచ్చి సంగతులు తెలియజేయండి, వారు కలిసి ఆలోచన చేయాలి. పూర్వకాలం నుండి దీనిని తెలియజేసింది ఎవరు? చాలా కాలం క్రితం దానిని ప్రకటించింది ఎవరు? యెహోవానైన నేను కాదా? నేను తప్ప వేరొక దేవుడు లేడు. నేను నీతిగల దేవుడను, రక్షకుడను; నేను తప్ప వేరే ఎవరూ లేరు.

  4. యెషయా 45:22సుమారు క్రీ.పూ. 712

    “భూమి అంచుల్లో నివసించే మీరందరు నా వైపు తిరిగి రక్షణ పొందండి; నేనే దేవుడను, వేరే ఎవరూ లేరు.

  5. యెషయా 45:23సుమారు క్రీ.పూ. 712

    నా ఎదుట ప్రతి మోకాలు వంగుతుందని ప్రతి నాలుక నాతోడని ప్రమాణం చేస్తుందని నేను నా పేరిట ప్రమాణం చేశాను. నీతిగల నా నోటి నుండి వచ్చిన మాట ఏదీ వ్యర్థం కాదు.

  6. యెషయా 45:24సుమారు క్రీ.పూ. 712

    ‘యెహోవాలోనే నీతి, బలము’ అని ప్రజలు నా గురించి చెప్తారు.” ఆయన మీద కోప్పడిన వారందరు ఆయన దగ్గరకు వస్తారు, వారు సిగ్గుపరచబడతారు.

  7. యెషయా 45:25సుమారు క్రీ.పూ. 712

    అయితే ఇశ్రాయేలు సంతతివారందరు యెహోవాలోనే నీతిమంతులుగా తీర్చబడతారు, వారు ఆయనలోనే అతిశయిస్తారు.

  8. యెషయా 46:1సుమారు క్రీ.పూ. 712

    బేలు మోకరిస్తుంది, నెబో క్రిందికి వంగుతుంది. వాటి విగ్రహాలను బరువులు మోసే జంతువులు మోస్తాయి. ఆ బరువైన ప్రతిమలను మోయడం కష్టం, అలసిపోయిన పశువులకు భారము.

  9. యెషయా 46:2సుమారు క్రీ.పూ. 712

    అవన్నీ కలిసి వంగి మోకరిస్తాయి; ఆ బరువును తప్పించుకోలేక అవి కూడా బందీలుగా పట్టుబడతాయి.

  10. యెషయా 46:3సుమారు క్రీ.పూ. 712

    “యాకోబు వారసులారా, నా మాట వినండి, ఇశ్రాయేలు ప్రజల్లో మిగిలిన వారలారా, నా మాట వినండి, మీ పుట్టుక నుండి నేను మిమ్మల్ని నిలబెట్టాను, మీరు పుట్టినప్పటి నుండి నేను మిమ్మల్ని మోసాను.

  11. యెషయా 46:4సుమారు క్రీ.పూ. 712

    మీ వృద్ధాప్యం వరకు, వెంట్రుకలు తెల్లగా అయ్యేవరకు నేను, నేనే మిమ్మల్ని నిలబెడతాను. నేనే మిమ్మల్ని చేశాను, నేనే మిమ్మల్ని మోస్తాను. నేనే మిమ్మల్ని నిలబెడతాను, నేనే మిమ్మల్ని రక్షిస్తాను.

  12. యెషయా 46:5సుమారు క్రీ.పూ. 712

    “మీరు నన్ను ఎవరితో పోలుస్తారు, ఎవరితో సమానంగా ఎంచుతారు? నాతో సమానమని ఎవరిని మీరు నాకు పోటీగా ఉంచుతారు?

  13. యెషయా 46:6సుమారు క్రీ.పూ. 712

    కొంతమంది తమ సంచుల నుండి బంగారం కుమ్మరించి వెండిని తీసుకువచ్చి బరువు తూచి, తమకు దేవున్ని తయారుచేయడానికి కంసాలిని నియమిస్తారు, తర్వాత దానికి నమస్కరించి పూజిస్తారు.

  14. యెషయా 46:7సుమారు క్రీ.పూ. 712

    వారు దానిని తమ భుజాలపై ఎత్తుకుని మోస్తారు; దాని చోటులో దానిని నిలబెడతారు, ఆ చోటు నుండి అది కదల్లేదు. ఎవరైనా దానికి మొరపెట్టినా, అది జవాబివ్వలేదు; వారి కష్టాల నుండి వారిని రక్షించలేదు.

  15. యెషయా 46:8సుమారు క్రీ.పూ. 712

    “దీనిని జ్ఞాపకం ఉంచుకోండి, మనస్సులో పెట్టుకోండి, తిరుగుబాటు చేసే మీరు మీ హృదయంలో పెట్టుకోండి,

  16. యెషయా 46:9సుమారు క్రీ.పూ. 712

    చాలా కాలం క్రితం జరిగిన వాటిని జ్ఞాపకం చేసుకోండి; నేనే దేవుడను, వేరే ఎవరూ లేరు; నేను దేవుడును, నాలా ఎవరూ లేరు.

  17. యెషయా 46:10సుమారు క్రీ.పూ. 712

    నేనే మొదటి నుండి చివర కలుగబోయే వాటిని ప్రకటిస్తాను. పూర్వకాలం నుండి రాబోయే వాటిని తెలియజేస్తాను. ‘నా ఉద్దేశం నిలబడుతుంది నాకు ఏది ఇష్టమో, అదంతా చేస్తాను’ అని నేను చెప్తున్నాను.

  18. యెషయా 46:11సుమారు క్రీ.పూ. 712

    తూర్పు నుండి క్రూరపక్షిని రప్పిస్తాను; దూరదేశం నుండి నా ఉద్దేశాన్ని నెరవేర్చే వానిని పిలుస్తాను. నేను చెప్పిన దానిని నెరవేరుస్తాను; నా ప్రణాళిక ప్రకారం నేను చేస్తాను.

  19. యెషయా 46:12సుమారు క్రీ.పూ. 712

    మొండి హృదయంతో నా నీతికి దూరంగా ఉన్నవారలారా, నా మాట వినండి.

  20. యెషయా 46:13సుమారు క్రీ.పూ. 712

    నా నీతిని దగ్గరకు తెస్తున్నాను. అది దూరంగా లేదు; నా రక్షణ ఆలస్యం కాదు. నేను సీయోనుకు రక్షణను ఇశ్రాయేలుకు నా వైభవాన్ని ఇస్తున్నాను.

  21. యెషయా 47:1సుమారు క్రీ.పూ. 712

    “కన్యయైన బబులోను కుమార్తె, క్రిందికి దిగి ధూళిలో కూర్చో; బబులోనీయుల రాణి పట్టణమా, సింహాసనం లేకుండా నేల మీద కూర్చో. నీవు సున్నితమైన దానవని సుకుమారివని ఇకపై పిలువబడవు.

  22. యెషయా 47:2సుమారు క్రీ.పూ. 712

    తిరగలి తీసుకుని పిండి విసురు; నీ ముసుగు తీసివేయి. లంగాలు పైకెత్తి కాలిమీద బట్ట తీసి నదులు దాటు.

  23. యెషయా 47:3సుమారు క్రీ.పూ. 712

    నీ నగ్నత్వం బయటపడుతుంది నీ సిగ్గు కనబడుతుంది. నేను ప్రతీకారం తీసుకుంటాను; నేను ఎవరిని క్షమించను.”

  24. యెషయా 47:4సుమారు క్రీ.పూ. 712

    మన విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు ఆయన పేరు సైన్యాల యెహోవా.

  25. యెషయా 47:5సుమారు క్రీ.పూ. 712

    “బబులోనీయుల రాణి పట్టణమా, మౌనంగా కూర్చో, చీకటిలోనికి వెళ్లిపో; రాజ్యాలకు రాణివని ఇకపై నీవు పిలువబడవు.