కంటెంట్‌కు వెళ్లండి

circa 1446 BC

Sinai & The Law

God meets Israel at Mount Sinai, reveals the Ten Commandments, and establishes the Tabernacle and the priestly covenant.

1,657 వచనాలు · 2 గ్రంథాలు చేర్చబడ్డాయి

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. నిర్గమకాండము 22:10సుమారు క్రీ.పూ. 1491

    “ఒకరు తన గాడిదనైన ఎద్దునైన గొర్రెనైన కాపాడమని తన పొరుగువానికి ఇచ్చినప్పుడు అది చనిపోయినా లేదా గాయపడినా లేదా ఎవరూ చూడనప్పుడు దాన్ని ఎవరైనా తీసుకెళ్లినా,

  2. నిర్గమకాండము 22:11సుమారు క్రీ.పూ. 1491

    పొరుగువాడు ఆ వ్యక్తి ఆస్తి మీద చేతులు వేయలేదని యెహోవా ఎదుట ప్రమాణం చేయడం ద్వారా వారిద్దరి మధ్య సమస్య పరిష్కరించబడుతుంది. యజమాని దానికి అంగీకరించాలి; నష్టపరిహారం అవసరం లేదు.

  3. నిర్గమకాండము 22:12సుమారు క్రీ.పూ. 1491

    అతని దగ్గర నుండి ఆ జంతువు దొంగతనం చేయబడితే అతడు దాని యజమానికి నష్టపరిహారం చెల్లించాలి.

  4. నిర్గమకాండము 22:13సుమారు క్రీ.పూ. 1491

    దానిని ఏ మృగమేదైనా చీల్చివేస్తే, సాక్ష్యంగా దాని మిగిలిన భాగాలను తీసుకురావాలి, చీల్చబడినదానికి నష్టపరిహారం అవసరం లేదు.

  5. నిర్గమకాండము 22:14సుమారు క్రీ.పూ. 1491

    “ఎవరైనా తమ పొరుగువాని దగ్గర నుండి ఒక జంతువును బదులు తీసుకున్నప్పుడు దాని యజమాని దాని దగ్గర లేనప్పుడు, అది గాయపడినా లేదా చచ్చినా, బదులు తీసుకున్నవాడు నష్టపరిహారం చెల్లించాలి.

  6. నిర్గమకాండము 22:15సుమారు క్రీ.పూ. 1491

    దాని యజమాని దాని దగ్గరే ఉంటే, బదులు తీసుకున్నవాడు నష్టపరిహారం చెల్లించనవసరం లేదు. ఒకవేళ ఆ జంతువు అద్దెకు తెచ్చినదైతే, దాని అద్దె లోనే నష్టం సరిపెట్టబడుతుంది.

  7. నిర్గమకాండము 22:16సుమారు క్రీ.పూ. 1491

    “ఒకడు పెళ్ళి నిశ్చయించబడని కన్యను లోబరచుకొని ఆమెతో పడుకుంటే అతడు ఆమెకు కట్నం చెల్లించి ఆమెను తన భార్యగా చేసుకోవాలి.

  8. నిర్గమకాండము 22:17సుమారు క్రీ.పూ. 1491

    ఆమె తండ్రి ఆమెను అతనికి ఇవ్వడానికి అస్సలు ఒప్పుకోకపోతే అతడు కన్యకల కట్నం ప్రకారం డబ్బు చెల్లించాలి.

  9. నిర్గమకాండము 22:18సుమారు క్రీ.పూ. 1491

    “మంత్రగత్తెలను బ్రతకనివ్వకూడదు.

  10. నిర్గమకాండము 22:19సుమారు క్రీ.పూ. 1491

    “జంతు సంపర్కం చేసినవారికి మరణశిక్ష విధించాలి.

  11. నిర్గమకాండము 22:20సుమారు క్రీ.పూ. 1491

    “యెహోవాకు మాత్రమే కాకుండా మరొక దేవునికి బలి అర్పించేవారు పూర్తిగా నాశనం చేయబడతారు.

  12. నిర్గమకాండము 22:21సుమారు క్రీ.పూ. 1491

    “మీరు ఈజిప్టు దేశంలో విదేశీయులుగా ఉన్నారు; కాబట్టి విదేశీయులను బాధించకూడదు, అణగద్రొక్కకూడదు.

  13. నిర్గమకాండము 22:22సుమారు క్రీ.పూ. 1491

    “విధవరాలిని గాని తండ్రిలేనివారిని గాని బాధపెట్టకూడదు.

  14. నిర్గమకాండము 22:23సుమారు క్రీ.పూ. 1491

    మీరు వారిని వేధించడం వలన వారు నాకు మొరపెడితే, నేను ఖచ్చితంగా వారి మొర వింటాను.

  15. నిర్గమకాండము 22:24సుమారు క్రీ.పూ. 1491

    నా కోపం రగులుకొని నేను మిమ్మల్ని కత్తితో చంపుతాను; అప్పుడు మీ భార్యలు విధవరాళ్లు అవుతారు మీ పిల్లలు తండ్రిలేనివారవుతారు.

  16. నిర్గమకాండము 22:25సుమారు క్రీ.పూ. 1491

    “మీ మధ్య ఉన్న నా ప్రజల్లో ఎవరైనా అవసరంలో ఉంటే, మీరు వారికి డబ్బు అప్పు ఇస్తే, అప్పులు ఇచ్చేవారిలా ప్రవర్తించకూడదు; వడ్డీ తీసుకోకూడదు.

  17. నిర్గమకాండము 22:26సుమారు క్రీ.పూ. 1491

    నీ పొరుగువారి పైవస్త్రాన్ని తాకట్టుగా తీసుకుంటే, సూర్యాస్తమయానికి తిరిగి ఇచ్చేయాలి.

  18. నిర్గమకాండము 22:27సుమారు క్రీ.పూ. 1491

    ఎందుకంటే రాత్రివేళ కప్పుకోడానికి మీ పొరుగువారికి ఉన్నది అదొక్కటే. అది లేకుండా వారు ఎలా నిద్రపోగలరు? నేను కనికరం గలవాన్ని, కాబట్టి వారు నాకు మొరపెడితే నేను వింటాను.

  19. నిర్గమకాండము 22:28సుమారు క్రీ.పూ. 1491

    “మీరు దేవుని దూషించకూడదు; మీ ప్రజల అధికారిని శపించకూడదు.

  20. నిర్గమకాండము 22:29సుమారు క్రీ.పూ. 1491

    “మీ ధాన్యాగారాల నుండి, తొట్టెల నుండి అర్పణలు చెల్లించడం ఆలస్యం చేయకూడదు. “ఖచ్చితంగా మీ కుమారులలో మొదటి సంతానాన్ని నాకు అర్పించాలి.

  21. నిర్గమకాండము 22:30సుమారు క్రీ.పూ. 1491

    మీ పశువులు గొర్రెల విషయంలో కూడా అలాగే చేయాలి. వాటిని తల్లి దగ్గర ఏడు రోజుల వరకు ఉంచాలి. ఎనిమిదవ రోజున వాటిని నాకు ఇవ్వాలి.

  22. నిర్గమకాండము 22:31సుమారు క్రీ.పూ. 1491

    “మీరు నా పరిశుద్ధ ప్రజలుగా ఉండాలి కాబట్టి అడవి మృగాలు చీల్చిన జంతు మాంసాన్ని తినకూడదు; దానిని కుక్కలకు పారవేయాలి.

  23. నిర్గమకాండము 23:1సుమారు క్రీ.పూ. 1491

    “పుకార్లు ప్రచారం చేయకూడదు. అన్యాయపు సాక్షిగా ఉండి దుర్మార్గులకు సహాయం చేయకూడదు.

  24. నిర్గమకాండము 23:2సుమారు క్రీ.పూ. 1491

    “తప్పు చేయడంలో జనాన్ని అనుసరించవద్దు. మీరు ఒక దావాలో సాక్ష్యం ఇచ్చినప్పుడు, జనంతో కలిసి న్యాయాన్ని వక్రీకరించవద్దు.

  25. నిర్గమకాండము 23:3సుమారు క్రీ.పూ. 1491

    న్యాయం చేసేటప్పుడు పేదవారైనా సరే వారిపట్ల పక్షపాతం చూపకూడదు.