- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa 1446 BC
Sinai & The Law
God meets Israel at Mount Sinai, reveals the Ten Commandments, and establishes the Tabernacle and the priestly covenant.
ఈ కాలపు వచనాలు
- నిర్గమకాండము 23:4సుమారు క్రీ.పూ. 1491
“ఒకవేళ నీ శత్రువు యొక్క ఎద్దు గాని గాడిద గాని తప్పిపోయి తిరుగుతూ నీకు కనబడితే, దానిని తప్పక తిరిగి అప్పగించాలి.
- నిర్గమకాండము 23:5సుమారు క్రీ.పూ. 1491
నిన్ను ద్వేషించేవారి గాడిద ఒకవేళ అది మోస్తున్న బరువు క్రింద పడివుండడం చూస్తే దానిని అలాగే వదిలేయవద్దు; దానిని లేపడానికి వానికి ఖచ్చితంగా సహాయం చేయాలి.
- నిర్గమకాండము 23:6సుమారు క్రీ.పూ. 1491
“న్యాయవిషయంలో పేదవారికి అన్యాయంగా తీర్పు తీర్చకూడదు.
- నిర్గమకాండము 23:7సుమారు క్రీ.పూ. 1491
తప్పుడు ఆరోపణలకు దూరంగా ఉండాలి, అమాయక లేదా నిజాయితీగల వ్యక్తిని చంపవద్దు, ఎందుకంటే నేను దోషులను నిర్దోషిగా ప్రకటించను.
- నిర్గమకాండము 23:8సుమారు క్రీ.పూ. 1491
“లంచం తీసుకోకూడదు, ఎందుకంటే లంచం చూసేవారికి గ్రుడ్డితనాన్ని కలిగిస్తుంది, నిర్దోషుల మాటలను వక్రీకరిస్తుంది.
- నిర్గమకాండము 23:9సుమారు క్రీ.పూ. 1491
“పరదేశిని అణగద్రొక్కకూడదు; మీరు ఈజిప్టులో విదేశీయులుగా ఉన్నారు కాబట్టి విదేశీయుల జీవితం ఎలా ఉంటుందో మీకే తెలుసు కదా!
- నిర్గమకాండము 23:10సుమారు క్రీ.పూ. 1491
“ఆరు సంవత్సరాలు మీరు పొలంలో విత్తనాలు విత్తి పంట కోయాలి,
- నిర్గమకాండము 23:11సుమారు క్రీ.పూ. 1491
ఏడవ సంవత్సరం ఆ భూమిని దున్నకుండా ఉపయోగించకుండా వదిలేయాలి. అప్పుడు మీ ప్రజల్లో పేదవారు దాని నుండి ఆహారం తీసుకోగా మిగిలింది అడవి జంతువులు తినవచ్చు. మీ ద్రాక్షతోటకు ఒలీవతోటకు ఇలాగే చేయాలి.
- నిర్గమకాండము 23:12సుమారు క్రీ.పూ. 1491
“ఆరు రోజులు మీ పని చేసుకోండి, కానీ ఏడవ రోజు పని చేయకండి, తద్వారా మీ ఎద్దు, మీ గాడిద విశ్రాంతి తీసుకోవచ్చు, మీ ఇంట్లో జన్మించిన దాసి కుమారుడు, మీ మధ్య నివసించే విదేశీయుడు సేదదీరుతారు.
- నిర్గమకాండము 23:13సుమారు క్రీ.పూ. 1491
“నేను మీతో చెప్పినవన్నీ జాగ్రత్తగా పాటించండి. మరొక దేవుళ్ళ పేరును ఉచ్చరించకూడదు. అవి మీ నోటి నుండి వినిపించకూడదు.
- నిర్గమకాండము 23:14సుమారు క్రీ.పూ. 1491
“సంవత్సరానికి మూడుసార్లు మీరు నాకు పండుగ జరపాలి.
- నిర్గమకాండము 23:15సుమారు క్రీ.పూ. 1491
“పులియని రొట్టెల పండుగ జరుపుకోండి; నేను మీకు ఆజ్ఞాపించినట్లు ఏడు రోజులు పులియని రొట్టెలు తినాలి. అబీబు నెలలో నిర్ణీత సమయంలో ఇలా తినండి, ఎందుకంటే ఆ నెలలో మీరు ఈజిప్టు నుండి వచ్చారు. “నా సన్నిధిలో ఎవరూ వట్టి చేతులతో కనిపించకూడదు.
- నిర్గమకాండము 23:16సుమారు క్రీ.పూ. 1491
“మీరు మీ పొలంలో విత్తి పండించిన ప్రథమ ఫలాలతో కోత కాల పండుగ చేయాలి. “పొలం నుండి మీ పంటలన్నిటిని కూర్చుకున్న తర్వాత సంవత్సరం చివరిలో పంటకూర్పు పండుగ చేయాలి.
- నిర్గమకాండము 23:17సుమారు క్రీ.పూ. 1491
“సంవత్సరానికి మూడుసార్లు మీ పురుషులందరు ప్రభువైన యెహోవా సన్నిధిలో కనబడాలి.
- నిర్గమకాండము 23:18సుమారు క్రీ.పూ. 1491
“పులిసిన దానితో కలిపి నాకు బలి యొక్క రక్తాన్ని అర్పించకూడదు. “నా పండుగ అర్పణల క్రొవ్వును ఉదయం వరకు ఉంచవద్దు.
- నిర్గమకాండము 23:19సుమారు క్రీ.పూ. 1491
“మీ పొలంలో పండిన ప్రథమ ఫలాల్లో శ్రేష్ఠమైన వాటిని మీ దేవుడైన యెహోవా మందిరానికి తీసుకురావాలి. “మేకపిల్లను దాని తల్లిపాలతో వండకూడదు.
- నిర్గమకాండము 23:20సుమారు క్రీ.పూ. 1491
“ఇదిగో, మార్గమంతటిలో మిమ్మల్ని కాపాడి నేను సిద్ధం చేసి ఉంచిన చోటికి మిమ్మల్ని తీసుకురావడానికి ఒక దేవదూతను మీకు ముందుగా పంపుతున్నాను.
- నిర్గమకాండము 23:21సుమారు క్రీ.పూ. 1491
ఆయన పట్ల శ్రద్ధ వహించండి, ఆయన చెప్పేది వినండి. ఆయనకు ఎదురు తిరుగవద్దు; నా నామం ఆయనలో ఉంది, కాబట్టి ఆయన మీ తిరుగుబాటును క్షమించరు.
- నిర్గమకాండము 23:22సుమారు క్రీ.పూ. 1491
మీరు ఆయన చెప్పేది జాగ్రత్తగా విని నేను చెప్పేవాటన్నిటిని చేస్తే, నేను మీ శత్రువులకు శత్రువుగా ఉంటాను, మిమ్మల్ని వ్యతిరేకించే వారిని వ్యతిరేకిస్తాను.
- నిర్గమకాండము 23:23సుమారు క్రీ.పూ. 1491
నా దూత మీకు ముందుగా వెళ్తూ, అమోరీయుల హిత్తీయుల పెరిజ్జీయుల కనానీయుల హివ్వీయుల యెబూసీయుల దేశానికి మిమ్మల్ని తీసుకువస్తాడు, నేను వారిని నిర్మూలం చేస్తాను.
- నిర్గమకాండము 23:24సుమారు క్రీ.పూ. 1491
మీరు వారి దేవుళ్ళ ముందు సాష్టాంగపడకూడదు వాటిని పూజించకూడదు, వారి ఆచారాలను పాటించకూడదు. మీరు వాటిని కూల్చివేసి వారి పవిత్ర రాళ్లను ముక్కలు చేయాలి.
- నిర్గమకాండము 23:25సుమారు క్రీ.పూ. 1491
మీ దేవుడైన యెహోవాను ఆరాధించండి, ఆయన ఆశీర్వాదం మీ ఆహారం మీద నీటి మీద ఉంటుంది. నేను మీ మధ్య నుండి రోగాన్ని తీసివేస్తాను,
- నిర్గమకాండము 23:26సుమారు క్రీ.పూ. 1491
మీ దేశంలో ఏ స్త్రీకి గర్భస్రావం కలుగదు లేదా గొడ్రాలిగా ఉండదు. నేను మీకు సంపూర్ణ జీవితకాలాన్ని ఇస్తాను.
- నిర్గమకాండము 23:27సుమారు క్రీ.పూ. 1491
“మీకు ఎదురయ్యే ప్రతి దేశానికి మీకు ముందుగా నా భయాన్ని పంపించి వారిని గందరగోళంలో పడవేస్తాను. నేను మీ శత్రువులందరిని వెనుతిరిగి పారిపోయేలా చేస్తాను.
- నిర్గమకాండము 23:28సుమారు క్రీ.పూ. 1491
మీ మార్గంలో నుండి హివ్వీయులను కనానీయులను హిత్తీయులను వెళ్లగొట్టడానికి మీకు ముందుగా కందిరీగలను పంపిస్తాను.