కంటెంట్‌కు వెళ్లండి

circa 1446 BC

Sinai & The Law

God meets Israel at Mount Sinai, reveals the Ten Commandments, and establishes the Tabernacle and the priestly covenant.

1,657 వచనాలు · 2 గ్రంథాలు చేర్చబడ్డాయి

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. నిర్గమకాండము 25:3సుమారు క్రీ.పూ. 1491

    “నీవు వారి దగ్గర నుండి తీసుకోవలసిన కానుకలు ఇవే: “బంగారం, వెండి, ఇత్తడి;

  2. నిర్గమకాండము 25:4సుమారు క్రీ.పూ. 1491

    నీలం ఊదా ఎరుపు రంగుల నూలు, సన్నని నారబట్ట; మేక వెంట్రుకలు;

  3. నిర్గమకాండము 25:5సుమారు క్రీ.పూ. 1491

    ఎరుపురంగు వేసిన పొట్టేళ్ల చర్మాలు, మన్నికైన తోలు; తుమ్మకర్ర;

  4. నిర్గమకాండము 25:6సుమారు క్రీ.పూ. 1491

    దీపాలకు ఒలీవనూనె; అభిషేక తైలానికి, సువాసనగల ధూపానికి సుగంధద్రవ్యాలు;

  5. నిర్గమకాండము 25:7సుమారు క్రీ.పూ. 1491

    ఏఫోదు మీద, రొమ్ము పతకం మీద పొదగడానికి లేతపచ్చ రాళ్లు, ఇతర రత్నాలు.

  6. నిర్గమకాండము 25:8సుమారు క్రీ.పూ. 1491

    “నేను వారి మధ్య నివసించేలా వారు నా కోసం పరిశుద్ధాలయాన్ని నిర్మించాలి.

  7. నిర్గమకాండము 25:9సుమారు క్రీ.పూ. 1491

    ఈ సమావేశ గుడారాన్ని, దాని అన్ని అలంకరణలను నేను మీకు చూపించే నమూనా వలె చేయండి.

  8. నిర్గమకాండము 25:10సుమారు క్రీ.పూ. 1491

    “వారు తుమ్మకర్రతో మందసం తయారుచేయాలి. దాని పొడవు రెండున్నర మూరలు, వెడల్పు ఒకటిన్నర మూర, ఎత్తు ఒకటిన్నర మూర ఉండాలి.

  9. నిర్గమకాండము 25:11సుమారు క్రీ.పూ. 1491

    లోపల, బయట స్వచ్ఛమైన బంగారంతో పొదిగించి దాని చుట్టూ బంగారు అంచును తయారుచేయాలి.

  10. నిర్గమకాండము 25:12సుమారు క్రీ.పూ. 1491

    నాలుగు బంగారు ఉంగరాలు పోతపోయించి ఒకవైపు రెండు మరోవైపు రెండు ఉండేలా దాని నాలుగు కాళ్లకు వాటిని తగిలించాలి.

  11. నిర్గమకాండము 25:13సుమారు క్రీ.పూ. 1491

    తర్వాత తుమ్మకర్రతో మోతకర్రలు చేసి వాటిని బంగారంతో పొదిగించాలి.

  12. నిర్గమకాండము 25:14సుమారు క్రీ.పూ. 1491

    మందసాన్ని మోయడానికి ఆ మోతకర్రలను మందసానికి ఇరుప్రక్కల ఉన్న ఉంగరాల్లో దూర్చాలి.

  13. నిర్గమకాండము 25:15సుమారు క్రీ.పూ. 1491

    ఈ మందసపు ఉంగరాల్లో మోతకర్రలు అలాగే ఉండాలి; వాటిని తీసివేయకూడదు.

  14. నిర్గమకాండము 25:16సుమారు క్రీ.పూ. 1491

    అప్పుడు నేను మీకు ఇచ్చే ఒడంబడిక పలకలను మందసంలో ఉంచండి.

  15. నిర్గమకాండము 25:17సుమారు క్రీ.పూ. 1491

    “స్వచ్ఛమైన బంగారంతో ప్రాయశ్చిత్త మూతను తయారుచేయాలి; దాని పొడవు రెండున్నర మూరలు, వెడల్పు ఒకటిన్నర మూర ఉండాలి.

  16. నిర్గమకాండము 25:18సుమారు క్రీ.పూ. 1491

    తర్వాత సాగగొట్టిన బంగారంతో మూత చివర్లలో రెండు కెరూబులను తయారుచేయాలి.

  17. నిర్గమకాండము 25:19సుమారు క్రీ.పూ. 1491

    ఒక చివర ఒక కెరూబును మరోచివర రెండవ కెరూబును చేయాలి; మూత మీద దాని రెండు చివర్లలో కెరూబులతో పాటు దానంతటిని ఒకే ముక్కలా చేయాలి.

  18. నిర్గమకాండము 25:20సుమారు క్రీ.పూ. 1491

    ఆ కెరూబులు తమ రెక్కలను పైకి చాపి వాటితో ప్రాయశ్చిత్త మూతను కప్పుతూ ఉండాలి. కెరూబుల ముఖాలు ఒకదానికొకటి ఎదురెదురుగా ఉండి ఆ కెరూబుల ముఖాలు ప్రాయశ్చిత్త మూతను చూస్తున్నట్లుగా ఉండాలి.

  19. నిర్గమకాండము 25:21సుమారు క్రీ.పూ. 1491

    ప్రాయశ్చిత్త మూతను పైకెత్తి మందసం మీద ఉంచి మందసంలో నేను మీకిచ్చే ఒడంబడిక పలకలను పెట్టాలి.

  20. నిర్గమకాండము 25:22సుమారు క్రీ.పూ. 1491

    అక్కడ, నిబంధన మందసం పైన ఉన్న ఆ ప్రాయశ్చిత్త మూత మీదుగా రెండు కెరూబుల మధ్యలో నుండి, నేను నిన్ను కలుసుకొని ఇశ్రాయేలీయుల కోసం నా ఆజ్ఞలన్నిటిని నీకు ఇస్తాను.

  21. నిర్గమకాండము 25:23సుమారు క్రీ.పూ. 1491

    “తుమ్మకర్రతో ఒక బల్లను చేయాలి. దాని పొడవు రెండు మూరలు, వెడల్పు ఒక మూర, ఎత్తు ఒకటిన్నర మూర ఉండాలి.

  22. నిర్గమకాండము 25:24సుమారు క్రీ.పూ. 1491

    దాన్ని స్వచ్ఛమైన బంగారంతో పొదిగించి దాని చుట్టూ బంగారు అంచును చేయించారు.

  23. నిర్గమకాండము 25:25సుమారు క్రీ.పూ. 1491

    అలాగే దాని చుట్టూ బెత్తెడు వెడల్పున చట్రం కూడా చేసి దానిపై బంగారంతో పోతపోయాలి.

  24. నిర్గమకాండము 25:26సుమారు క్రీ.పూ. 1491

    ఆ బల్లకు నాలుగు ఉంగరాలు చేసి వాటిని నాలుగు కాళ్లు ఉన్న నాలుగు మూలల్లో తగిలించాలి.

  25. నిర్గమకాండము 25:27సుమారు క్రీ.పూ. 1491

    బల్ల మోయడానికి ఉపయోగించే మోతకర్రలు ఉంచే ఉంగరాలు చట్రానికి దగ్గరగా పెట్టబడాలి.