- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa 1446 BC
Sinai & The Law
God meets Israel at Mount Sinai, reveals the Ten Commandments, and establishes the Tabernacle and the priestly covenant.
ఈ కాలపు వచనాలు
- నిర్గమకాండము 26:13సుమారు క్రీ.పూ. 1491
గుడారపు తెరలు ఒక ప్రక్క ఒక మూర మరో ప్రక్క ఒక మూర పొడవు ఉండి, మిగిలిన భాగం సమావేశ గుడారాన్ని కప్పి ఉంచేలా దాని ప్రక్కల మీద వ్రేలాడదీయాలి.
- నిర్గమకాండము 26:14సుమారు క్రీ.పూ. 1491
గుడారం కోసం ఎరుపురంగు వేసిన పొట్టేళ్ల చర్మంతో పైకప్పును, దానిపైన మన్నికైన తోళ్లతో పైకప్పు తయారుచేయాలి.
- నిర్గమకాండము 26:15సుమారు క్రీ.పూ. 1491
“సమావేశ గుడారానికి తుమ్మకర్రతో నిలువు పలకలు తయారుచేయాలి.
- నిర్గమకాండము 26:16సుమారు క్రీ.పూ. 1491
ప్రతి చట్రం పొడవు పది మూరలు, వెడల్పు ఒకటిన్నర మూర ఉండాలి.
- నిర్గమకాండము 26:17సుమారు క్రీ.పూ. 1491
రెండు కొయ్యమేకులు ఒకదానికొకటి సమాంతరంగా అమర్చాలి. సమావేశ గుడారపు చట్రాలన్నిటిని ఈ విధంగా తయారుచేయాలి.
- నిర్గమకాండము 26:18సుమారు క్రీ.పూ. 1491
సమావేశ గుడారపు దక్షిణ వైపుకు ఇరవై చట్రాలు తయారుచేయాలి.
- నిర్గమకాండము 26:19సుమారు క్రీ.పూ. 1491
ప్రతి చట్రానికి క్రింద రెండు కొయ్య మేకులకు రెండు దిమ్మల చొప్పున ఇరవై చట్రాలకు నలభై వెండి దిమ్మలు తయారుచేయాలి.
- నిర్గమకాండము 26:20సుమారు క్రీ.పూ. 1491
మరోవైపుకు, అంటే సమావేశ గుడారానికి ఉత్తర వైపుకు, ప్రతి చట్రం క్రింద రెండు చొప్పున, ఇరవై చట్రాలు తయారుచేయాలి.
- నిర్గమకాండము 26:21సుమారు క్రీ.పూ. 1491
నలభై వెండి దిమ్మలు తయారుచేయాలి.
- నిర్గమకాండము 26:22సుమారు క్రీ.పూ. 1491
పడమర వైపు అంటే సమావేశ గుడారం యొక్క వెనుక వైపు ఆరు చట్రాలు తయారుచేయాలి,
- నిర్గమకాండము 26:23సుమారు క్రీ.పూ. 1491
మూలల కోసం రెండు చట్రాలు తయారుచేయాలి.
- నిర్గమకాండము 26:24సుమారు క్రీ.పూ. 1491
ఈ రెండు మూలల వద్ద అవి క్రింది నుండి పై వరకు రెండింతలు ఉండి ఒకే ఉంగరంలోకి అమర్చబడాలి; రెండూ ఒకేలా ఉండాలి.
- నిర్గమకాండము 26:25సుమారు క్రీ.పూ. 1491
అక్కడ ఎనిమిది చట్రాలు, ప్రతి చట్రం క్రింద రెండేసి చొప్పున పదహారు వెండి దిమ్మలు ఉంటాయి.
- నిర్గమకాండము 26:26సుమారు క్రీ.పూ. 1491
“అలాగే తుమ్మకర్రతో అడ్డకర్రలు తయారుచేయాలి: సమావేశ గుడారానికి ఒక ప్రక్కన ఉన్న చట్రాలకు అయిదు అడ్డకర్రలు,
- నిర్గమకాండము 26:27సుమారు క్రీ.పూ. 1491
రెండవ వైపున ఉన్నవాటికి అయిదు, సమావేశ గుడారానికి వెనుక వైపున పడమర వైపున ఉన్న చట్రాలకు అయిదు అడ్డకర్రలు చేయాలి.
- నిర్గమకాండము 26:28సుమారు క్రీ.పూ. 1491
మధ్య అడ్డకర్ర, చట్రాల మధ్యలో ఈ చివరి నుండి ఆ చివరి వరకు విస్తరించాలి.
- నిర్గమకాండము 26:29సుమారు క్రీ.పూ. 1491
ఆ చట్రాలను బంగారంతో పొదిగించి, అడ్డకర్రలు ఉంచడానికి బంగారు ఉంగరాలు చేయాలి. అలాగే అడ్డకర్రలను కూడా బంగారంతో పొదిగించాలి.
- నిర్గమకాండము 26:30సుమారు క్రీ.పూ. 1491
“కొండమీద నీకు చూపించిన నమూనా ప్రకారమే సమావేశ గుడారాన్ని నిలబెట్టాలి.
- నిర్గమకాండము 26:31సుమారు క్రీ.పూ. 1491
“నీలం ఊదా ఎరుపు రంగుల్లో పేనిన సన్నని నారతో ఒక తెరను చేయించి, నిపుణుడైన పనివానితో దానిమీద కెరూబులను అల్లించాలి.
- నిర్గమకాండము 26:32సుమారు క్రీ.పూ. 1491
తుమ్మ చెక్కతో నాలుగు స్తంభాలు చేసి బంగారంతో పొదిగించి నాలుగు వెండి దిమ్మలపై నిలబెట్టిన నాలుగు స్తంభాలకు బంగారు కొక్కేలతో దానిని వ్రేలాడదీయాలి.
- నిర్గమకాండము 26:33సుమారు క్రీ.పూ. 1491
ఆ తెరను కొలుకుల క్రింద తగిలించి నిబంధన మందసాన్ని ఆ తెర వెనుక ఉంచాలి. ఈ తెర పరిశుద్ధ స్థలాన్ని, అతి పరిశుద్ధ స్థలాన్ని వేరు చేస్తుంది.
- నిర్గమకాండము 26:34సుమారు క్రీ.పూ. 1491
అతి పరిశుద్ధ స్థలంలో నిబంధన మందసం మీద ప్రాయశ్చిత్త మూతను ఉంచాలి.
- నిర్గమకాండము 26:35సుమారు క్రీ.పూ. 1491
తెర బయట సమావేశ గుడారానికి ఉత్తరం వైపు బల్ల ఉంచి దానికి ఎదురుగా దక్షిణం వైపు దీపస్తంభాన్ని ఉంచాలి.
- నిర్గమకాండము 26:36సుమారు క్రీ.పూ. 1491
“గుడారపు ప్రవేశ ద్వారానికి నీలం, ఊదా ఎరుపు రంగులతో పేనిన సన్నని నారతో బుటా పనితో ఒక తెర తయారుచేయాలి.
- నిర్గమకాండము 26:37సుమారు క్రీ.పూ. 1491
ఈ తెర కోసం తుమ్మ చెక్కతో అయిదు స్తంభాలు చేసి వాటిని బంగారంతో పొదిగించాలి, అలాగే బంగారు కొక్కేలు చేయాలి. తర్వాత వాటికి అయిదు ఇత్తడి దిమ్మలు చేయాలి.