- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa 1446 BC
Sinai & The Law
God meets Israel at Mount Sinai, reveals the Ten Commandments, and establishes the Tabernacle and the priestly covenant.
ఈ కాలపు వచనాలు
- నిర్గమకాండము 28:5సుమారు క్రీ.పూ. 1491
వారికి బంగారంతో నీలం ఊదా ఎరుపు రంగుల నూలు పేనిన సన్నని నారబట్టను ఉపయోగించమని చెప్పండి.
- నిర్గమకాండము 28:6సుమారు క్రీ.పూ. 1491
“బంగారం నీలం ఊదా ఎరుపు రంగుల నూలు పేనిన సన్నని నారతో ఏఫోదును తయారుచేయాలి.
- నిర్గమకాండము 28:7సుమారు క్రీ.పూ. 1491
అది కదలకుండా ఉండేలా దాని రెండు భుజాల ముక్కలు రెండు మూలల్లో కూర్చబడాలి.
- నిర్గమకాండము 28:8సుమారు క్రీ.పూ. 1491
నైపుణ్యంగా అల్లబడిన దాని నడికట్టు ఏఫోదుతో ఒకే ముక్కగా బంగారం నీలం ఊదా ఎరుపు రంగుల నూలు పేనిన సన్నని నారతో చేయబడినదై ఉండాలి.
- నిర్గమకాండము 28:9సుమారు క్రీ.పూ. 1491
“రెండు లేతపచ్చ రాళ్లు తీసుకుని వాటిపై ఇశ్రాయేలు కుమారుల పేర్లు, వారు పుట్టిన క్రమం ప్రకారం ఒక రాయి మీద ఆరు పేర్లు మరొకదాని మీద మిగిలిన ఆరు పేర్లు చెక్కాలి.
- నిర్గమకాండము 28:10సుమారు క్రీ.పూ. 1491
Six of their names on one stone, and the other six names of the rest on the other stone, according to their birth.
- నిర్గమకాండము 28:11సుమారు క్రీ.పూ. 1491
ముత్యాలు చెక్కేవారు ముద్రను చెక్కినట్లు ఆ రెండు లేతపచ్చ రాళ్లమీద ఇశ్రాయేలు కుమారుల పేర్లు చెక్కాలి. తర్వాత ఆ రాళ్లను బంగారు జరీ చట్రంలోకి ఎక్కించాలి.
- నిర్గమకాండము 28:12సుమారు క్రీ.పూ. 1491
తర్వాత వాటిని ఇశ్రాయేలు కుమారుల జ్ఞాపకార్థ రాళ్లుగా ఏఫోదు భుజాలపై బిగించాలి. యెహోవా ఎదుట జ్ఞాపకంగా అహరోను తన భుజాలమీద ఆ పేర్లను మోయాలి.
- నిర్గమకాండము 28:13సుమారు క్రీ.పూ. 1491
బంగారు జవలను తయారుచేయాలి
- నిర్గమకాండము 28:14సుమారు క్రీ.పూ. 1491
స్వచ్ఛమైన బంగారంతో ఒక తాడులా రెండు అల్లిన గొలుసులు చేసి, ఆ గొలుసులను జవలకు తగిలించాలి.
- నిర్గమకాండము 28:15సుమారు క్రీ.పూ. 1491
“నిర్ణయాలు తీసుకోవటానికి హస్త నైపుణ్యంతో కూడిన రొమ్ము పతకం చేయాలి. ఏఫోదును చేసినట్లు దీనిని బంగారం నీలం ఊదా ఎరుపురంగు నూలు పేనిన సన్నని నారతో తయారుచేయాలి.
- నిర్గమకాండము 28:16సుమారు క్రీ.పూ. 1491
అది చతురస్రంగా జానెడు పొడవు జానెడు వెడల్పుతో రెండుగా మడత పెట్టబడి ఉండాలి.
- నిర్గమకాండము 28:17సుమారు క్రీ.పూ. 1491
దానిపై నాలుగు వరుసల ప్రశస్తమైన రాళ్లు పొదగాలి. మొదటి వరుసలో మాణిక్యం, గోమేధికం, మరకతం;
- నిర్గమకాండము 28:18సుమారు క్రీ.పూ. 1491
రెండవ వరుసలో పద్మరాగం, నీలమణి, సూర్యకాంతం;
- నిర్గమకాండము 28:19సుమారు క్రీ.పూ. 1491
మూడవ వరుసలో గారుత్మతం, యష్మురాయి, ఇంద్రనీలం;
- నిర్గమకాండము 28:20సుమారు క్రీ.పూ. 1491
నాలుగవ వరుసలో పుష్యరాగం, లేతపచ్చ రాళ్లు, సూర్యకాంతమణి ఉండాలి. వాటిని బంగారు చట్రంలో అమర్చాలి.
- నిర్గమకాండము 28:21సుమారు క్రీ.పూ. 1491
ఇశ్రాయేలు కుమారుల పేర్లకు ఒక్కొక్కటి చొప్పున పన్నెండు రాళ్లు ఉండాలి, ప్రతిదీ వారిలో ఒక్కొక్క పేరు చొప్పున పన్నెండు గోత్రాల పేర్లు ముద్రలా చెక్కబడి ఉండాలి.
- నిర్గమకాండము 28:22సుమారు క్రీ.పూ. 1491
“రొమ్ము పతకానికి స్వచ్ఛమైన బంగారంతో ఒక తాడులా అల్లికపనితో గొలుసులు చేయాలి.
- నిర్గమకాండము 28:23సుమారు క్రీ.పూ. 1491
రెండు బంగారు ఉంగరాలను చేసి వాటిని రొమ్ము పతకానికి రెండు చివర్లకు తగిలించాలి.
- నిర్గమకాండము 28:24సుమారు క్రీ.పూ. 1491
రొమ్ము పతకం చివరిలో ఉన్న ఉంగరాలకు రెండు బంగారు గొలుసులు బిగించి,
- నిర్గమకాండము 28:25సుమారు క్రీ.పూ. 1491
గొలుసుల యొక్క ఇతర చివరలను రెండు జవలకు, ముందు భాగంలో ఉన్న ఏఫోదు యొక్క భుజాలకు జోడించాలి.
- నిర్గమకాండము 28:26సుమారు క్రీ.పూ. 1491
రెండు బంగారు ఉంగరాలను తయారుచేసి, వాటిని ఏఫోదు ముందు భాగంలో రొమ్ము పతకానికి లోపలి అంచున ఉన్న రెండు చివర్లకు జోడించాలి.
- నిర్గమకాండము 28:27సుమారు క్రీ.పూ. 1491
మరో రెండు బంగారు ఉంగరాలను తయారుచేసి వాటిని ఏఫోదు నడికట్టుకు కొంచెం పైన దాని అతుకు దగ్గరగా ఏఫోదు ముందు భాగంలో రెండు భుజభాగాలకు క్రింది వైపున జోడించాలి.
- నిర్గమకాండము 28:28సుమారు క్రీ.పూ. 1491
అప్పుడు రొమ్ము పతకం ఏఫోదు నుండి బయటకు వ్రేలాడకుండా నడికట్టును అంటిపెట్టుకుని ఉండేలా రొమ్ము పతకం యొక్క ఉంగరాలను ఏఫోదు ఉంగరాలకు నీలిరంగు దారంతో కట్టాలి.
- నిర్గమకాండము 28:29సుమారు క్రీ.పూ. 1491
“అహరోను పరిశుద్ధ స్థలంలోకి వెళ్లినప్పుడు అతడు తన హృదయం మీద న్యాయవిధాన పతకంలోని ఇశ్రాయేలు కుమారుల పేర్లను నిత్యం యెహోవా సన్నిధిలో జ్ఞాపకంగా మోయాలి.