కంటెంట్‌కు వెళ్లండి

circa 1446 BC

Sinai & The Law

God meets Israel at Mount Sinai, reveals the Ten Commandments, and establishes the Tabernacle and the priestly covenant.

1,657 వచనాలు · 2 గ్రంథాలు చేర్చబడ్డాయి

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. నిర్గమకాండము 29:12సుమారు క్రీ.పూ. 1491

    ఆ ఎద్దు రక్తంలో కొంత తీసుకుని నీ వ్రేలితో బలిపీఠపు కొమ్ముల మీద పూసి మిగిలిన రక్తాన్ని బలిపీఠం అడుగున పోయాలి.

  2. నిర్గమకాండము 29:13సుమారు క్రీ.పూ. 1491

    కోడె లోపలి అవయవాల మీద ఉన్న క్రొవ్వునంతటిని, కాలేయం మీది క్రొవ్వు, రెండు మూత్రపిండాలు వాటి క్రొవ్వును తీసుకుని బలిపీఠం మీద కాల్చాలి.

  3. నిర్గమకాండము 29:14సుమారు క్రీ.పూ. 1491

    అయితే కోడెను, దాని చర్మాన్ని దాని మాంసాన్ని, దాని పేడను శిబిరం బయట కాల్చివేయాలి. అది పాపపరిహారబలి.

  4. నిర్గమకాండము 29:15సుమారు క్రీ.పూ. 1491

    “నీవు పొట్టేళ్లలో ఒకదాని తీసుకురావాలి, దాని తలపై అహరోను అతని కుమారులు తమ చేతులుంచాలి.

  5. నిర్గమకాండము 29:16సుమారు క్రీ.పూ. 1491

    నీవు పొట్టేలును వధించి దాని రక్తాన్ని బలిపీఠం చుట్టూ చల్లాలి.

  6. నిర్గమకాండము 29:17సుమారు క్రీ.పూ. 1491

    పొట్టేలును ముక్కలు చేసి, దాని లోపలి అవయవాలను కాళ్లను కడిగి, వాటిని తల ఇతర ముక్కలతో ఉంచి,

  7. నిర్గమకాండము 29:18సుమారు క్రీ.పూ. 1491

    ఆ పొట్టేలంతటిని బలిపీఠం మీద కాల్చాలి. అది యెహోవాకు దహనబలి, యెహోవాకు సమర్పించబడిన ఇష్టమైన సువాసనగల హోమబలి.

  8. నిర్గమకాండము 29:19సుమారు క్రీ.పూ. 1491

    “మరొక పొట్టేలును తీసుకురావాలి, దాని తలమీద అహరోను అతని కుమారులు వారి చేతులుంచాలి.

  9. నిర్గమకాండము 29:20సుమారు క్రీ.పూ. 1491

    నీవు ఆ పొట్టేలును వధించి, దాని రక్తం కొంత తీసుకుని అహరోను అతని కుమారుల కుడిచెవి అంచుకు, వారి కుడిచేతి బొటన వ్రేలి మీద, కుడికాలు బొటన వ్రేలి మీద పూసి మిగిలిన రక్తాన్ని బలిపీఠం చుట్టూ చల్లాలి.

  10. నిర్గమకాండము 29:21సుమారు క్రీ.పూ. 1491

    బలిపీఠం మీద నుండి కొంచెం రక్తాన్ని కొంచెం అభిషేక తైలాన్ని తీసుకుని అహరోను మీద అతని వస్త్రాల మీద, అతని కుమారుల మీద వారి వస్త్రాల మీద చిలకరించాలి. అప్పుడు అతడు అతని కుమారులు వారి వస్త్రాలు కూడా పవిత్రం చేయబడతాయి.

  11. నిర్గమకాండము 29:22సుమారు క్రీ.పూ. 1491

    “ఆ పొట్టేలు ప్రతిష్ఠితమైనది కాబట్టి దాని క్రొవ్వును క్రొవ్విన దాని తోకను, లోపలి అవయవాలను కాలేయాన్ని క్రొవ్వుతో ఉన్న రెండు మూత్రపిండాలను, కుడి తొడను తీసుకోవాలి.

  12. నిర్గమకాండము 29:23సుమారు క్రీ.పూ. 1491

    యెహోవా ఎదుట ఉన్న పులియని రొట్టెల గంపలో నుండి ఒక గుండ్రని రొట్టెను, ఒలీవనూనె కలిపి చేసిన ఒక మందమైన రొట్టెను, పల్చని రొట్టెను తీసుకుని,

  13. నిర్గమకాండము 29:24సుమారు క్రీ.పూ. 1491

    వాటిని అహరోను అతని కుమారుల చేతుల్లో ఉంచాలి. వారు యెహోవా ఎదుట వాటిని పైకెత్తి ప్రత్యేక అర్పణగా అర్పించాలి.

  14. నిర్గమకాండము 29:25సుమారు క్రీ.పూ. 1491

    తర్వాత నీవు వారి చేతుల్లో నుండి వాటిని తీసుకుని బలిపీఠం మీద దహనబలితో కలిపి యెహోవాకు ఇష్టమైన సువాసనగల హోమంగా దహించాలి, ఇది యెహోవాకు సమర్పించబడిన హోమబలి.

  15. నిర్గమకాండము 29:26సుమారు క్రీ.పూ. 1491

    అహరోనును ప్రతిష్ఠించడానికి పొట్టేలు రొమ్ము తీసుకుని యెహోవా ఎదుట పైకెత్తి దానిని ప్రత్యేక అర్పణగా అర్పించాలి. అది నీ వాటా అవుతుంది.

  16. నిర్గమకాండము 29:27సుమారు క్రీ.పూ. 1491

    “అహరోనుకు అతని కుమారులకు చెందిన ప్రతిష్ఠార్పణకు చెందిన పొట్టేలులోని ఆ భాగాలను ప్రతిష్ఠించాలి: ఆడించిన రొమ్ము, సమర్పించబడిన తొడ.

  17. నిర్గమకాండము 29:28సుమారు క్రీ.పూ. 1491

    ఇది ఇశ్రాయేలీయుల నుండి అహరోనుకు అతని కుమారులకు చెందవలసిన శాశ్వత వాటా. ఇది ఇశ్రాయేలీయులు అర్పించే సమాధానబలులలో నుండి వారు యెహోవాకు అర్పించే ప్రత్యేక కానుక.

  18. నిర్గమకాండము 29:29సుమారు క్రీ.పూ. 1491

    “అహరోను పవిత్ర వస్త్రాలు అతని తర్వాత అతని కుమారులకు చెందుతాయి; వారు అభిషేకించబడడానికి, ప్రతిష్ఠించబడడానికి వాటిని ధరించాలి.

  19. నిర్గమకాండము 29:30సుమారు క్రీ.పూ. 1491

    అతని తర్వాత యాజకుడయ్యే అతని కుమారుడు పరిశుద్ధ స్థలంలో సేవ చేయడానికి సమావేశ గుడారంలోకి వెళ్లేటప్పుడు ఏడు రోజులు వాటిని ధరించాలి.

  20. నిర్గమకాండము 29:31సుమారు క్రీ.పూ. 1491

    “ప్రతిష్ఠితమైన పొట్టేలును తీసుకుని పవిత్ర స్థలంలో దాని మాంసాన్ని వండాలి.

  21. నిర్గమకాండము 29:32సుమారు క్రీ.పూ. 1491

    సమావేశ గుడారపు ద్వారం దగ్గర అహరోను, అతని కుమారులు ఆ పొట్టేలు మాంసాన్ని గంపలోని రొట్టెలతో తినాలి.

  22. నిర్గమకాండము 29:33సుమారు క్రీ.పూ. 1491

    వారిని ప్రతిష్ఠించడానికి, పరిశుద్ధపరచడానికి ప్రాయశ్చిత్తంగా వేటిని అర్పించారో వాటిని వారు తినాలి. అవి పవిత్రమైనవి కాబట్టి వారు తప్ప ఇతరులెవరు వాటిని తినకూడదు.

  23. నిర్గమకాండము 29:34సుమారు క్రీ.పూ. 1491

    ఒకవేళ ప్రతిష్ఠితమైన పొట్టేలు మాంసం గాని రొట్టెలు గాని ఉదయం వరకు మిగిలి ఉంటే వాటిని కాల్చివేయాలి. అవి పవిత్రమైనవి కాబట్టి వాటిని తినకూడదు.

  24. నిర్గమకాండము 29:35సుమారు క్రీ.పూ. 1491

    “నేను నీకు ఆజ్ఞాపించిన వాటన్నిటిని అహరోను అతని కుమారుల పట్ల జరిగించాలి; ఏడు రోజులు నీవు వారిని ప్రతిష్ఠించాలి.

  25. నిర్గమకాండము 29:36సుమారు క్రీ.పూ. 1491

    ప్రాయశ్చిత్తం చేయడానికి ప్రతిరోజు ఒక ఎద్దును పాపపరిహారబలిగా అర్పించాలి. బలిపీఠం కోసం ప్రాయశ్చిత్తం జరిగించి బలిపీఠాన్ని శుద్ధి చేయాలి, అలాగే దాన్ని ప్రతిష్ఠించడానికి అభిషేకం చేయాలి.