- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa 1446 BC
Sinai & The Law
God meets Israel at Mount Sinai, reveals the Ten Commandments, and establishes the Tabernacle and the priestly covenant.
ఈ కాలపు వచనాలు
- నిర్గమకాండము 29:37సుమారు క్రీ.పూ. 1491
ఏడు రోజులు బలిపీఠం కోసం ప్రాయశ్చిత్తం చేసి దానిని ప్రతిష్ఠించండి. అప్పుడు బలిపీఠం అత్యంత పరిశుద్ధమవుతుంది; దానికి తగిలినవన్ని పరిశుద్ధమవుతాయి.
- నిర్గమకాండము 29:38సుమారు క్రీ.పూ. 1491
“నీవు క్రమం తప్పకుండా ప్రతిరోజు బలిపీఠం మీద ఏడాది గొర్రెపిల్లలు రెండు అర్పించాలి.
- నిర్గమకాండము 29:39సుమారు క్రీ.పూ. 1491
ఒక గొర్రెపిల్లను ఉదయాన, మరొకదాన్ని సూర్యాస్తమయ వేళ అర్పించాలి.
- నిర్గమకాండము 29:40సుమారు క్రీ.పూ. 1491
దంచి తీసిన ఒక పావు హిన్ ఒలీవనూనెతో కలిపిన ఒక ఓమెరు నాణ్యమైన పిండిని, ఒక పావు హిన్ ద్రాక్షారసాన్ని పానార్పణగా మొదటి గొర్రెపిల్లతో పాటు అర్పించాలి.
- నిర్గమకాండము 29:41సుమారు క్రీ.పూ. 1491
సాయంకాలం మరొక గొర్రెపిల్లతో కలిపి ఉదయకాలం అర్పించినట్లే భోజనార్పణ, పానార్పణ అర్పించాలి. ఇది యెహోవాకు ఇష్టమైన సువాసనగల హోమబలి.
- నిర్గమకాండము 29:42సుమారు క్రీ.పూ. 1491
“యెహోవా ఎదుట సమావేశ గుడారపు ద్వారం దగ్గర రాబోయే తరాలన్ని క్రమంగా నిత్యం ఈ దహనబలిని అర్పించాలి. అక్కడే నేను మిమ్మల్ని కలుసుకొని మీతో మాట్లాడతాను.
- నిర్గమకాండము 29:43సుమారు క్రీ.పూ. 1491
అక్కడే నేను ఇశ్రాయేలీయులను కలుసుకుంటాను; ఆ స్థలం నా మహిమచేత పవిత్రం చేయబడుతుంది.
- నిర్గమకాండము 29:44సుమారు క్రీ.పూ. 1491
“కాబట్టి నేను సన్నిధి గుడారాన్ని, బలిపీఠాన్ని ప్రతిష్ఠ చేస్తాను, నాకు యాజకులుగా సేవ చేసేందుకు అహరోనును అతని కుమారులను ప్రతిష్ఠ చేస్తాను.
- నిర్గమకాండము 29:45సుమారు క్రీ.పూ. 1491
అప్పుడు నేను ఇశ్రాయేలీయుల మధ్య నివసించి వారికి దేవునిగా ఉంటాను.
- నిర్గమకాండము 29:46సుమారు క్రీ.పూ. 1491
నేను వారి మధ్య నివసించేలా, వారిని ఈజిప్టు నుండి బయటకు తీసుకువచ్చిన వారి దేవుడనైన యెహోవాను నేనేనని వారు తెలుసుకుంటారు. నేను వారి దేవుడనైన యెహోవాను.
- నిర్గమకాండము 30:1సుమారు క్రీ.పూ. 1491
“ధూపం వేయడానికి నీవు తుమ్మకర్రతో ఒక వేదిక తయారుచేయాలి.
- నిర్గమకాండము 30:2సుమారు క్రీ.పూ. 1491
అది చతురస్రంగా, ఒక మూర పొడవు ఒక మూర వెడల్పు రెండు మూరల ఎత్తు ఉండాలి. దాని కొమ్ములను దానితో ఒకే ఖండంగా ఉండేలా చేయాలి.
- నిర్గమకాండము 30:3సుమారు క్రీ.పూ. 1491
దాని పైభాగానికి, అన్ని ప్రక్కలకు, కొమ్ములకు స్వచ్ఛమైన బంగారు రేకుతో పొదిగించి దాని చుట్టూ బంగారు కడ్డీ చేయించాలి.
- నిర్గమకాండము 30:4సుమారు క్రీ.పూ. 1491
ఆ కడ్డీ క్రింద ఉన్న బలిపీఠాన్ని మోయడానికి ఉపయోగించే మోతకర్రలను పెట్టడానికి, ఒకదానికొకటి ఎదురుగా ఉండేలా రెండు బంగారు ఉంగరాలు తయారుచేయాలి.
- నిర్గమకాండము 30:5సుమారు క్రీ.పూ. 1491
తుమ్మకర్రతో మోతకర్రలు చేసి వాటిని బంగారంతో పొదిగించాలి.
- నిర్గమకాండము 30:6సుమారు క్రీ.పూ. 1491
ధూపవేదికను నిబంధన మందసాన్ని కాపాడే తెర ముందు పెట్టాలి, ఒడంబడిక పలకల మీద ఉన్న ప్రాయశ్చిత్త మూత ఎదుట దాన్ని ఉంచాలి. అక్కడే నేను నిన్ను కలుసుకుంటాను.
- నిర్గమకాండము 30:7సుమారు క్రీ.పూ. 1491
“అహరోను ప్రతిరోజు ఉదయం దీపాలు పెట్టినప్పుడు బలిపీఠం మీద పరిమళ వాసనతో కూడిన ధూపం వేయాలి.
- నిర్గమకాండము 30:8సుమారు క్రీ.పూ. 1491
సాయంకాలం అహరోను దీపాలను వెలిగించేటప్పుడు దాని మీద మరలా ధూపం వేయాలి. రాబోయే తరాల వరకు యెహోవా ఎదుట నిత్యం ధూపం వేయాలి.
- నిర్గమకాండము 30:9సుమారు క్రీ.పూ. 1491
నీవు దాని మీద ఇతర ధూపాలను గాని దహనబలిని గాని భోజనార్పణ గాని అర్పించకూడదు, దాని మీద పానార్పణ పోయకూడదు.
- నిర్గమకాండము 30:10సుమారు క్రీ.పూ. 1491
సంవత్సరానికి ఒకసారి అహరోను దాని కొమ్ముల మీద ప్రాయశ్చిత్తం చేయాలి. ఈ వార్షిక ప్రాయశ్చిత్తం రాబోయే తరాల కోసం ప్రాయశ్చిత్త పాపపరిహారబలి రక్తంతో చేయాలి. అది యెహోవాకు అతిపరిశుద్ధమైనది.”
- నిర్గమకాండము 30:11సుమారు క్రీ.పూ. 1491
తర్వాత యెహోవా మోషేతో ఇలా అన్నారు:
- నిర్గమకాండము 30:12సుమారు క్రీ.పూ. 1491
“నీవు ఇశ్రాయేలీయుల జనాభా లెక్కించేటప్పుడు, వారు లెక్కించబడుతున్న సమయంలో ప్రతి ఒక్కరు యెహోవాకు తమ జీవితానికి విమోచన క్రయధనం చెల్లించాలి. అలా చేస్తే నీవు వారిని లెక్కించినప్పుడు ఏ తెగులు వారి మీదికి రాదు.
- నిర్గమకాండము 30:13సుమారు క్రీ.పూ. 1491
లెక్కించబడినవారిలో చేరే ప్రతి ఒక్కరు పరిశుద్ధాలయం యొక్క షెకెల్ ప్రకారం అర షెకెల్ ఇవ్వాలి, దాని బరువు ఇరవై గెరాలు ఉంటుంది. ఈ అర షెకెల్ యెహోవాకు కానుక.
- నిర్గమకాండము 30:14సుమారు క్రీ.పూ. 1491
ఇరవై సంవత్సరాలు లేదా అంతకన్నా ఎక్కువ వయస్సు కలిగి లెక్కించబడేవారిలో చేరే వారు యెహోవాకు కానుక ఇవ్వాలి.
- నిర్గమకాండము 30:15సుమారు క్రీ.పూ. 1491
మీ ప్రాణాలకు ప్రాయశ్చిత్తం కలగడానికి మీరు యెహోవాకు అర్పణ ఇచ్చినప్పుడు ధనవంతులు అర షెకెల్ కన్నా ఎక్కువ ఇవ్వకూడదు, పేదవారు అర షెకెల్ కన్నా తక్కువ ఇవ్వకూడదు.