- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa 1446 BC
Sinai & The Law
God meets Israel at Mount Sinai, reveals the Ten Commandments, and establishes the Tabernacle and the priestly covenant.
ఈ కాలపు వచనాలు
- నిర్గమకాండము 31:3సుమారు క్రీ.పూ. 1491
నేను అతన్ని దేవుని ఆత్మతో జ్ఞానంతో సామర్థ్యంతో అన్ని రకాల నైపుణ్యతలతో నింపాను.
- నిర్గమకాండము 31:4సుమారు క్రీ.పూ. 1491
అతడు బంగారం వెండి ఇత్తడితో కళాత్మక నమూనాలను తయారుచేస్తాడు.
- నిర్గమకాండము 31:5సుమారు క్రీ.పూ. 1491
ఇంకా అతడు రాళ్లను చెక్కి అమర్చడం, చెక్క పని చేయడం, అలా అన్ని రకాల చేతిపనులు చేస్తాడు.
- నిర్గమకాండము 31:6సుమారు క్రీ.పూ. 1491
అంతేకాక అతనికి సహాయం చేయడానికి దాను గోత్రానికి చెందిన అహీసామాకు కుమారుడైన ఒహోలీయాబును నేను నియమించాను.
- నిర్గమకాండము 31:7సుమారు క్రీ.పూ. 1491
“ప్రత్యక్ష గుడారం, నిబంధన మందసం, దాని మీద ఉండే ప్రాయశ్చిత్త మూత, గుడారంలోని ఇతర ఉపకరణాలు
- నిర్గమకాండము 31:8సుమారు క్రీ.పూ. 1491
బల్ల, దానిమీది ఉపకరణాలు, స్వచ్ఛమైన బంగారపు దీపస్తంభం, దాని ఉపకరణాలు, ధూపవేదిక,
- నిర్గమకాండము 31:9సుమారు క్రీ.పూ. 1491
దహనబలిపీఠం దాని పాత్రలు, ఇత్తడి గంగాళం దాని ఇత్తడి పీట;
- నిర్గమకాండము 31:10సుమారు క్రీ.పూ. 1491
అంతేకాక యాజక సేవ చేసేటప్పుడు ధరించడానికి నేసిన వస్త్రాలు, యాజకుడైన అహరోనుకు పవిత్ర వస్త్రాలు, అలాగే అతని కుమారులకు వస్త్రాలు వారు యాజకులుగా పరిచర్య చేస్తున్నప్పుడు వేసుకోడానికి,
- నిర్గమకాండము 31:11సుమారు క్రీ.పూ. 1491
పరిశుద్ధస్థలం కోసం అభిషేక తైలం, పరిమళ వాసనగల ధూపము.
- నిర్గమకాండము 31:12సుమారు క్రీ.పూ. 1491
ఇంకా యెహోవా మోషేతో ఇలా అన్నారు,
- నిర్గమకాండము 31:13సుమారు క్రీ.పూ. 1491
“నీవు ఇశ్రాయేలీయులతో ఇలా చెప్పు, ‘మీరు నా సబ్బాతులు ఖచ్చితంగా ఆచరించాలి. నేను మిమ్మల్ని పరిశుద్ధపరచే యెహోవానై యున్నాను అని మీరు తెలుసుకునేలా అది రాబోయే తరాలకు నాకు మీకు మధ్య ఒక గుర్తుగా ఉంటుంది.
- నిర్గమకాండము 31:14సుమారు క్రీ.పూ. 1491
“ ‘మీరు సబ్బాతును ఆచరించాలి, ఎందుకంటే అది మీకు పరిశుద్ధమైనది. దానిని అపవిత్రం చేసినవారికి ఖచ్చితంగా మరణశిక్ష విధించాలి; ఆ రోజు ఏ పనైనా చేస్తే చేసినవారు తమ ప్రజల్లో నుండి కొట్టివేయబడాలి.
- నిర్గమకాండము 31:15సుమారు క్రీ.పూ. 1491
ఆరు రోజులు పని చేయాలి, కాని ఏడవ రోజు యెహోవాకు సబ్బాతు విశ్రాంతి దినం, యెహోవాకు పరిశుద్ధమైనది. సబ్బాతు దినాన ఎవరైనా ఏ పనైనా చేస్తే చేసినవారికి ఖచ్చితంగా మరణశిక్ష విధించాలి.
- నిర్గమకాండము 31:16సుమారు క్రీ.పూ. 1491
రాబోయే తరాలకు నిత్యమైన ఒడంబడికగా ఇశ్రాయేలీయులు సబ్బాతును ఆచరించాలి.
- నిర్గమకాండము 31:17సుమారు క్రీ.పూ. 1491
ఇది నాకు, ఇశ్రాయేలీయులకు మధ్య ఎప్పటికీ ఒక గుర్తులా ఉంటుంది, ఎందుకంటే ఆరు రోజుల్లో యెహోవా ఆకాశాలను భూమిని చేశారు, ఏడవ రోజున ఆయన విశ్రాంతి తీసుకుని సేదదీరారు.’ ”
- నిర్గమకాండము 31:18సుమారు క్రీ.పూ. 1491
యెహోవా సీనాయి పర్వతం మీద మోషేతో మాట్లాడడం పూర్తి చేసిన తర్వాత, ఆయన ఒడంబడిక పలకలను అనగా దేవుని వ్రేలితో వ్రాయబడిన రాతిపలకలను అతనికి ఇచ్చారు.
- నిర్గమకాండము 32:1సుమారు క్రీ.పూ. 1491
మోషే పర్వతం దిగిరావడానికి ఆలస్యం చేయడం చూసిన ప్రజలు అహరోను చుట్టూ గుమికూడి, అతనితో, “ఈజిప్టులో నుండి మమ్మల్ని బయటకు తీసుకువచ్చిన ఈ మోషే అనే వానికి ఏమి జరిగిందో మాకు తెలియదు కాబట్టి నీవు వచ్చి మాకు ముందు నడవడానికి మాకు దేవుళ్ళను తయారుచేయి” అని అన్నారు.
- నిర్గమకాండము 32:2సుమారు క్రీ.పూ. 1491
అందుకు అహరోను, “అయితే మీ భార్యలు మీ కుమారులు మీ కుమార్తెలు ధరించిన బంగారు చెవికమ్మలు తీసి నా దగ్గరకు తీసుకురండి” అని చెప్పాడు.
- నిర్గమకాండము 32:3సుమారు క్రీ.పూ. 1491
కాబట్టి ప్రజలందరు తమ చెవికమ్మలు తీసి అహరోను దగ్గరకు తెచ్చారు.
- నిర్గమకాండము 32:4సుమారు క్రీ.పూ. 1491
అతడు వారు తనకు ఇచ్చిన వాటిని తీసుకుని ఒక సాధనంతో దూడ రూపంలో పోతపోసి ఒక విగ్రహం తయారుచేశాడు. అప్పుడు వారు, “ఓ ఇశ్రాయేలూ, ఈజిప్టులో నుండి మిమ్మల్ని బయటకు రప్పించిన మీ దేవుళ్ళు వీరే” అని అన్నారు.
- నిర్గమకాండము 32:5సుమారు క్రీ.పూ. 1491
అహరోను ఇది చూసి ఆ దూడ ఎదుట ఒక బలిపీఠం కట్టించి, “రేపు యెహోవాకు పండుగ జరుగుతుంది” అని ప్రకటించాడు.
- నిర్గమకాండము 32:6సుమారు క్రీ.పూ. 1491
కాబట్టి మరునాడు ప్రజలు ఉదయాన్నే లేచి దహనబలులు సమాధానబలులు అర్పించారు. ఆ తర్వాత ప్రజలు తినడానికి త్రాగడానికి కూర్చుని ఆడడానికి లేచారు.
- నిర్గమకాండము 32:7సుమారు క్రీ.పూ. 1491
అప్పుడు యెహోవా మోషేతో ఇలా అన్నారు, “నీవు క్రిందికి వెళ్లు, ఈజిప్టులో నుండి నీవు తీసుకువచ్చిన నీ ప్రజలు చెడిపోయారు.
- నిర్గమకాండము 32:8సుమారు క్రీ.పూ. 1491
నేను వారికి ఆజ్ఞాపించిన మార్గం నుండి చాలా త్వరగా తప్పిపోయి ఒక దూడ రూపంలో పోతపోసిన విగ్రహాన్ని తమ కోసం తయారుచేసుకుని దానికి సాష్టాంగపడి బలి అర్పించి, ‘ఇశ్రాయేలూ, ఈజిప్టులో నుండి నిన్ను రప్పించిన నీ దేవుళ్ళు వీరే’ అని అన్నారు.
- నిర్గమకాండము 32:9సుమారు క్రీ.పూ. 1491
“నేను ఈ ప్రజలను చూశాను” అని అంటూ యెహోవా మోషేతో ఇలా అన్నారు, “వారు మొండి ప్రజలు,