- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa 1446 BC
Sinai & The Law
God meets Israel at Mount Sinai, reveals the Ten Commandments, and establishes the Tabernacle and the priestly covenant.
ఈ కాలపు వచనాలు
- నిర్గమకాండము 32:10సుమారు క్రీ.పూ. 1491
నా కోపం వారి మీద రగులుకొని, నేను వారిని నాశనం చేస్తాను, నీవు నన్ను వదిలేయి. తర్వాత నేను నిన్ను గొప్ప జనంగా చేస్తాను.”
- నిర్గమకాండము 32:11సుమారు క్రీ.పూ. 1491
అయితే మోషే తన దేవుడైన యెహోవా దయ కోసం మొరపెడుతూ, “యెహోవా, మీరు గొప్ప బలముతో బలమైన చేతితో ఈజిప్టులో నుండి రప్పించిన మీ ప్రజల మీద ఎందుకంత కోపం?
- నిర్గమకాండము 32:12సుమారు క్రీ.పూ. 1491
‘వారిని పర్వతాల మధ్య చంపాలని భూమి మీద ఉండకుండా వారిని నాశనం అయ్యేలా కీడు చేయడానికే ఆయన వారిని బయటకు రప్పించారని ఈజిప్టువారు ఎందుకు చెప్పుకోవాలి?’ రగులుతున్న నీ కోపాన్ని విడిచిపెట్టండి; మనస్సు మార్చుకోండి, మీ ప్రజలపై విపత్తును తీసుకురావద్దు.
- నిర్గమకాండము 32:13సుమారు క్రీ.పూ. 1491
మీ సేవకులైన అబ్రాహాము ఇస్సాకు ఇశ్రాయేలును జ్ఞాపకం చేసుకోండి, వారికి మీరే స్వయంగా ఇలా ప్రమాణం చేశారు: ‘నేను మీ సంతానాన్ని ఆకాశ నక్షత్రాల్లా అసంఖ్యాకంగా చేసి వారికి ఇస్తానని నేను వాగ్దానం చేసిన ఈ దేశాన్నంతా మీ సంతానానికి ఇస్తాను, అది వారి వారసత్వంగా నిరంతరం ఉంటుంది.’ ”
- నిర్గమకాండము 32:14సుమారు క్రీ.పూ. 1491
అప్పుడు యెహోవా మనస్సు మార్చుకొని తన ప్రజలకు తాను తెస్తానని చెప్పిన విపత్తును వారి మీదికి తేలేదు.
- నిర్గమకాండము 32:15సుమారు క్రీ.పూ. 1491
మోషే తన చేతులతో రెండు నిబంధన పలకలు పట్టుకుని పర్వతం దిగి వెళ్లాడు. ఆ పలకలకు రెండు వైపులా ముందు వెనుక వ్రాసి ఉంది.
- నిర్గమకాండము 32:16సుమారు క్రీ.పూ. 1491
ఆ పలకలు దేవుని పని; ఆ పలకల మీద చెక్కబడిన వ్రాత దేవుని చేతివ్రాత.
- నిర్గమకాండము 32:17సుమారు క్రీ.పూ. 1491
ప్రజలు కేకలు వేస్తున్న శబ్దం యెహోషువ విని మోషేతో, “శిబిరంలో యుద్ధధ్వని వినబడుతుంది” అన్నాడు.
- నిర్గమకాండము 32:18సుమారు క్రీ.పూ. 1491
మోషే ఇలా జవాబిచ్చాడు: “అది విజయధ్వని కాదు, అపజయధ్వని కాదు; నేను వింటుంది పాడుతున్న ధ్వని.”
- నిర్గమకాండము 32:19సుమారు క్రీ.పూ. 1491
మోషే శిబిరాన్ని సమీపించి ఆ దూడ విగ్రహాన్ని, వారు నాట్యం చేయడాన్ని చూసినప్పుడు అతనికి చాలా కోపం వచ్చి, అతడు తన చేతుల్లో ఉన్న రెండు పలకలను విసిరి, పర్వత అడుగు భాగాన వాటిని ముక్కలు చేశాడు.
- నిర్గమకాండము 32:20సుమారు క్రీ.పూ. 1491
అతడు ఆ ప్రజలు చేసిన దూడ విగ్రహాన్ని తీసుకుని అగ్నిలో కాల్చివేశాడు; తర్వాత అతడు దానిని పొడిచేసి, నీళ్ల మీద చల్లి, ఆ నీళ్లను ఇశ్రాయేలీయులతో త్రాగించాడు.
- నిర్గమకాండము 32:21సుమారు క్రీ.పూ. 1491
అప్పుడు మోషే అహరోనును, “నీవు వారిని ఇలాంటి ఘోరమైన పాపం చేసేలా నడిపించడానికి ఈ ప్రజలు నిన్ను ఎలా ప్రేరేపించారు?” అని అడిగాడు.
- నిర్గమకాండము 32:22సుమారు క్రీ.పూ. 1491
అందుకు అహరోను, “నా ప్రభువా, కోప్పడకు, ఈ ప్రజలు చెడుకు ఎంతగా అలవాటుపడ్డారో నీకు తెలుసు.
- నిర్గమకాండము 32:23సుమారు క్రీ.పూ. 1491
వీరు నన్ను, ‘ఈజిప్టులో నుండి మమ్మల్ని బయటకు తీసుకువచ్చిన ఈ మోషే అనే వానికి ఏమి జరిగిందో మాకు తెలియదు కాబట్టి నీవు వచ్చి మాకు ముందు నడవడానికి మాకు దేవుళ్ళను తయారుచేయి’ అని అన్నారు.
- నిర్గమకాండము 32:24సుమారు క్రీ.పూ. 1491
అందుకు నేను, ‘ఎవరి దగ్గర బంగారు ఆభరణాలు ఉంటే వారు తీసుకురండి’ అని చెప్పాను. అప్పుడు వారు నాకు బంగారం ఇచ్చారు, నేను దాన్ని అగ్నిలో పడేస్తే, ఈ దూడ అయ్యింది!” అని చెప్పాడు.
- నిర్గమకాండము 32:25సుమారు క్రీ.పూ. 1491
ప్రజలు విచ్చలవిడిగా తిరగడం మోషే చూశాడు. వారి శత్రువుల ముందు నవ్వులపాలయ్యేలా అహరోను వారిని వదిలేశాడు.
- నిర్గమకాండము 32:26సుమారు క్రీ.పూ. 1491
కాబట్టి మోషే శిబిరం ద్వారం దగ్గర నిలబడి, “యెహోవా పక్షం ఉన్నవారందరు నా దగ్గరకు రండి” అని అన్నాడు. అప్పుడు లేవీయులందరు అతని దగ్గరకు వచ్చారు.
- నిర్గమకాండము 32:27సుమారు క్రీ.పూ. 1491
అతడు వారితో ఇలా చెప్పాడు, “ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా చెప్పే మాట ఇదే: ‘ప్రతి ఒక్కరు తన కత్తిని తన నడుముకు కట్టుకుని, శిబిరం ఒక ద్వారం నుండి ఇంకొక ద్వారం వరకు వెళ్తూ ప్రతివారు తన సోదరులను స్నేహితులను పొరుగువారిని చంపాలి.’ ”
- నిర్గమకాండము 32:28సుమారు క్రీ.పూ. 1491
లేవీయులు మోషే ఆజ్ఞాపించిన ప్రకారం చేశారు; ఆ రోజు సుమారు మూడువేలమంది చనిపోయారు.
- నిర్గమకాండము 32:29సుమారు క్రీ.పూ. 1491
అప్పుడు మోషే, “ఈ రోజు, మీరు మీ సొంత కుమారులకు సోదరులకు వ్యతిరేకంగా మిమ్మల్ని మీరు యెహోవా కోసం ప్రత్యేకించుకున్నారు, కాబట్టి ఆయన మిమ్మల్ని ఆశీర్వదించారు” అని అన్నాడు.
- నిర్గమకాండము 32:30సుమారు క్రీ.పూ. 1491
ఆ మరునాడు మోషే ప్రజలతో, “మీరు ఘోరమైన పాపం చేశారు. కాని నేను యెహోవా దగ్గరకు ఎక్కి వెళ్తాను; బహుశ మీ పాపాల కోసం నేనేమైనా ప్రాయశ్చిత్తం చేయగలనేమో” అని అన్నాడు.
- నిర్గమకాండము 32:31సుమారు క్రీ.పూ. 1491
అప్పుడు మోషే యెహోవా దగ్గరకు తిరిగివెళ్లి, “అయ్యో, ఈ ప్రజలు ఎంతో ఘోరమైన పాపం చేశారు! తమ కోసం బంగారంతో దేవుళ్ళను తయారుచేసుకున్నారు.
- నిర్గమకాండము 32:32సుమారు క్రీ.పూ. 1491
కాని ఇప్పుడు, దయచేసి వారి పాపాలను క్షమించండి, వారిని మీరు క్షమించకపోతే మీరు వ్రాసిన గ్రంథంలో నుండి నా పేరు తుడిచివేయండి” అని అడిగాడు.
- నిర్గమకాండము 32:33సుమారు క్రీ.పూ. 1491
అందుకు యెహోవా మోషేకు, “నాకు వ్యతిరేకంగా ఎవరు పాపం చేశారో వారి పేరును నా గ్రంథంలో నుండి కొట్టివేస్తాను.
- నిర్గమకాండము 32:34సుమారు క్రీ.పూ. 1491
నీవు వెళ్లి, నేను నీకు చెప్పిన చోటికి ప్రజలను నడిపించు, నా దూత మీకు ముందుగా వెళ్తాడు. అయితే నేను శిక్ష విధించవలసిన సమయం వచ్చినప్పుడు వారి పాపాలకు వారికి శిక్ష విధిస్తాను” అని సమాధానం ఇచ్చారు.