కంటెంట్‌కు వెళ్లండి

circa 1446 BC

Sinai & The Law

God meets Israel at Mount Sinai, reveals the Ten Commandments, and establishes the Tabernacle and the priestly covenant.

1,657 వచనాలు · 2 గ్రంథాలు చేర్చబడ్డాయి

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. నిర్గమకాండము 28:30సుమారు క్రీ.పూ. 1491

    రొమ్ము పతకంలో ఊరీము తుమ్మీము అనే వాటిని ఉంచాలి. అప్పుడు అహరోను యెహోవా సన్నిధికి వెళ్లినప్పుడు అవి అతని రొమ్ము మీద ఉంటాయి. అహరోను యెహోవా సన్నిధిలో తన హృదయం మీద ఇశ్రాయేలీయుల న్యాయవిధానాలను నిత్యం మోస్తాడు.

  2. నిర్గమకాండము 28:31సుమారు క్రీ.పూ. 1491

    “ఏఫోదు నిలువుటంగీని పూర్తిగా నీలి బట్టతో తయారుచేయాలి.

  3. నిర్గమకాండము 28:32సుమారు క్రీ.పూ. 1491

    దాని మధ్యలో తల దూర్చడానికి రంధ్రం ఉండాలి. అది చిరిగిపోకుండా మెడపట్టీలా దాని అంచుల చుట్టూ అల్లికపని చేయాలి.

  4. నిర్గమకాండము 28:33సుమారు క్రీ.పూ. 1491

    ఆ వస్త్రం అంచు చుట్టూ నీలం ఊదా ఎరుపు రంగుల నూలుతో దానిమ్మపండ్లు తయారుచేసి, వాటి మధ్య బంగారంతో తయారుచేసిన గంటలను తగిలించాలి.

  5. నిర్గమకాండము 28:34సుమారు క్రీ.పూ. 1491

    బంగారు గంటలు దానిమ్మపండ్లు ఒకదాని ప్రక్కన ఒకటిగా వస్త్రం అంచు చుట్టూ ఉండాలి.

  6. నిర్గమకాండము 28:35సుమారు క్రీ.పూ. 1491

    అహరోను సేవ చేస్తున్నప్పుడు అతడు దీనిని ఖచ్చితంగా ధరించాలి. అతడు యెహోవా సన్నిధికి పరిశుద్ధాలయంలోకి వెళ్లినప్పుడు బయటకు వచ్చినప్పుడు అతడు చనిపోలేదు అని గ్రహించేలా ఆ గంటల శబ్దం తెలియజేస్తుంది.

  7. నిర్గమకాండము 28:36సుమారు క్రీ.పూ. 1491

    “స్వచ్ఛమైన బంగారంతో ఒక కిరీటం తయారుచేసి దాని మీద ముద్రలా ఈ మాటలు చెక్కాలి: పరిశుద్ధత యెహోవాకే.

  8. నిర్గమకాండము 28:37సుమారు క్రీ.పూ. 1491

    దాన్ని తలపాగాకు అతకడానికి దానిని నీలి దారంతో కట్టాలి. అది తలపాగా ముందు భాగంలో ఉండాలి.

  9. నిర్గమకాండము 28:38సుమారు క్రీ.పూ. 1491

    అది అహరోను నుదిటిపై ఉంటుంది, ఇశ్రాయేలీయులు ప్రతిష్ఠించే పవిత్ర బహుమతులలో, ఆ బహుమతులు ఏవైనా సరే, వాటిలో ఉన్న అపరాధాన్ని అతడు భరిస్తాడు, అది అహరోను నుదుటిపై నిరంతరం ఉంటుంది, తద్వారా వారు యెహోవాకు అంగీకారంగా ఉంటారు.

  10. నిర్గమకాండము 28:39సుమారు క్రీ.పూ. 1491

    “సన్నని నారబట్టతో చొక్కా నేయాలి. సన్నని నారబట్టతో తలపాగా తయారుచేయాలి. బుటా పనిగా నడికట్టు చేయాలి.

  11. నిర్గమకాండము 28:40సుమారు క్రీ.పూ. 1491

    అహరోను కుమారులకు గౌరవం ఘనతా కలిగేలా చొక్కా నడికట్టు టోపీలను తయారుచేయాలి.

  12. నిర్గమకాండము 28:41సుమారు క్రీ.పూ. 1491

    నీవు నీ సోదరుడైన అహరోనుకు అతని కుమారులకు ఈ వస్త్రాలను తొడిగించిన తర్వాత వారిని అభిషేకించి ప్రతిష్ఠించాలి. వారు నాకు యాజకులుగా సేవ చేయడానికి వారిని పవిత్రపరచాలి.

  13. నిర్గమకాండము 28:42సుమారు క్రీ.పూ. 1491

    “వారి నగ్నత్వాన్ని కప్పుకోడానికి నడుము నుండి తొడల వరకు నారతో లోదుస్తులు తయారుచేయాలి.

  14. నిర్గమకాండము 28:43సుమారు క్రీ.పూ. 1491

    అహరోను అతని కుమారులు సమావేశ గుడారంలోకి ఎప్పుడు వెళ్లినా లేదా పరిశుద్ధ స్థలంలో సేవ చేయడానికి ఎప్పుడు బలిపీఠాన్ని సమీపించినా వారు దోషశిక్షను భరించి చావకూడదంటే వారు ఖచ్చితంగా ఆ దుస్తులు ధరించాలి. “ఇది అహరోనుకు అతని కుమారులకు ఇవ్వబడిన నిత్య కట్టుబాటుగా ఉంటుంది.

  15. నిర్గమకాండము 29:1సుమారు క్రీ.పూ. 1491

    “వారు నాకు యాజకులుగా సేవ చేసేలా వారిని ప్రతిష్ఠించడానికి నీవు చేయవలసినది ఏంటంటే, ఏ లోపం లేని ఒక కోడెను రెండు పొట్టేళ్లను తీసుకోవాలి.

  16. నిర్గమకాండము 29:2సుమారు క్రీ.పూ. 1491

    మెత్తని గోధుమపిండితో పులియని గుండ్రని రొట్టెలు, నూనెతో కలిపిన పులియని పిండితో మందమైన రొట్టెలు, నూనె పూసిన పులియని రొట్టెలు చేయాలి.

  17. నిర్గమకాండము 29:3సుమారు క్రీ.పూ. 1491

    వాటిని గంపలో పెట్టి ఆ కోడెను రెండు పొట్టేళ్లతో పాటు సమర్పించాలి.

  18. నిర్గమకాండము 29:4సుమారు క్రీ.పూ. 1491

    తర్వాత అహరోనును అతని కుమారులను సమావేశ గుడారపు ద్వారం దగ్గరకు తీసుకువచ్చి నీటితో వారిని కడగాలి.

  19. నిర్గమకాండము 29:5సుమారు క్రీ.పూ. 1491

    ఆ వస్త్రాలను తీసుకుని అహరోను మీద పైవస్త్రం వేసి, ఏఫోదు వస్త్రాన్ని, ఏఫోదును, రొమ్ము పతకాన్ని ధరింపచేయాలి. ఏఫోదును నైపుణ్యంగా అల్లబడిన నడికట్టుతో అతనికి కట్టాలి.

  20. నిర్గమకాండము 29:6సుమారు క్రీ.పూ. 1491

    అతని తలమీద తలపాగాను పెట్టి పవిత్ర చిహ్నాన్ని తలపాగాకు తగిలించాలి.

  21. నిర్గమకాండము 29:7సుమారు క్రీ.పూ. 1491

    అభిషేక తైలాన్ని తీసుకుని అతని తలపై పోసి అతన్ని అభిషేకించాలి.

  22. నిర్గమకాండము 29:8సుమారు క్రీ.పూ. 1491

    అతని కుమారులను తీసుకువచ్చి చొక్కాలు తొడిగించి

  23. నిర్గమకాండము 29:9సుమారు క్రీ.పూ. 1491

    వారిపై టోపీలు పెట్టాలి. తర్వాత అహరోనుకు, అతని కుమారులకు నడికట్టు కట్టాలి. నిత్య కట్టుబాటు ద్వారా యాజకత్వం వారిదవుతుంది. “ఈ విధంగా అహరోనును అతని కుమారులను ప్రతిష్ఠించాలి.

  24. నిర్గమకాండము 29:10సుమారు క్రీ.పూ. 1491

    “నీవు సమావేశ గుడారం ఎదుటకు ఎద్దును తీసుకురావాలి, దాని తలపై అహరోను అతని కుమారులు తమ చేతులుంచాలి.

  25. నిర్గమకాండము 29:11సుమారు క్రీ.పూ. 1491

    సమావేశ గుడారపు ద్వారం దగ్గర యెహోవా సన్నిధిలో ఆ ఎద్దును వధించాలి.