- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa 1446 BC
Sinai & The Law
God meets Israel at Mount Sinai, reveals the Ten Commandments, and establishes the Tabernacle and the priestly covenant.
ఈ కాలపు వచనాలు
- నిర్గమకాండము 25:28సుమారు క్రీ.పూ. 1491
తుమ్మకర్రతో మోతకర్రలు చేసి, వాటికి బంగారు పోతపోసి వాటితో ఆ బల్లను మోయాలి.
- నిర్గమకాండము 25:29సుమారు క్రీ.పూ. 1491
దాని పళ్లెములు పాత్రలు, పానార్పణలు పోయడానికి ఉపయోగించే బానలు గిన్నెలను స్వచ్ఛమైన బంగారంతో తయారుచేయాలి.
- నిర్గమకాండము 25:30సుమారు క్రీ.పూ. 1491
అన్ని వేళలా నా ఎదుట సన్నిధి రొట్టెలను ఈ బల్లమీద ఉంచాలి.
- నిర్గమకాండము 25:31సుమారు క్రీ.పూ. 1491
“స్వచ్ఛమైన బంగారంతో దీపస్తంభం చేయాలి. దాని అడుగు పీఠాన్ని నడిమి భాగాన్ని సుత్తెతో సాగగొట్టాలి, దాని కలశాలు దాని మొగ్గలు దాని పువ్వులు తయారుచేసి వాటితో ఒకే ఖండంలా చేయాలి.
- నిర్గమకాండము 25:32సుమారు క్రీ.పూ. 1491
దీపస్తంభానికి రెండు వైపుల నుండి ఆరు కొమ్మలు; ఒక ప్రక్క మూడు మరొక ప్రక్క మూడు కొమ్మలు విస్తరించి ఉండాలి.
- నిర్గమకాండము 25:33సుమారు క్రీ.పూ. 1491
ఒక కొమ్మకు మొగ్గలు పువ్వులు ఉన్న బాదం పువ్వును పోలిన మూడు కలశాలు, తర్వాతి కొమ్మకు కూడా అలాగే మూడు కలశాల చొప్పున దీపస్తంభం నుండి విస్తరించివున్న ఆరు కొమ్మలకు అదే విధంగా ఉండాలి.
- నిర్గమకాండము 25:34సుమారు క్రీ.పూ. 1491
దీపస్తంభం మీద మొగ్గలు పువ్వులు ఉన్న బాదం పువ్వును పోలిన నాలుగు కలశాలు ఉండాలి.
- నిర్గమకాండము 25:35సుమారు క్రీ.పూ. 1491
దీపస్తంభం నుండి విస్తరించి ఉన్న మొదటి జత కొమ్మల క్రింద మొదటి మొగ్గ, రెండవ జత కొమ్మల క్రింద రెండవ మొగ్గ, మూడవ జత కొమ్మల క్రింద మూడవ మొగ్గ చొప్పున ఆరు కొమ్మలకు అమర్చాలి.
- నిర్గమకాండము 25:36సుమారు క్రీ.పూ. 1491
సాగగొట్టబడిన స్వచ్ఛమైన బంగారంతో మొగ్గలు కొమ్మలు దీపస్తంభంతో ఒకే ఖండంగా చేయాలి.
- నిర్గమకాండము 25:37సుమారు క్రీ.పూ. 1491
“తర్వాత దాని ఏడు దీపాలు తయారుచేసి దాని ఎదుట భాగం ప్రకాశించేలా వాటిని వెలిగించాలి.
- నిర్గమకాండము 25:38సుమారు క్రీ.పూ. 1491
దాని వత్తులు కత్తిరించే కత్తెరలు, పళ్ళాలను స్వచ్ఛమైన బంగారంతో చేయాలి.
- నిర్గమకాండము 25:39సుమారు క్రీ.పూ. 1491
దీపస్తంభాన్ని దాని ఉపకరణాలను తయారుచేయడానికి ఒక తలాంతు స్వచ్ఛమైన బంగారం ఉపయోగించాలి.
- నిర్గమకాండము 25:40సుమారు క్రీ.పూ. 1491
పర్వతం మీద నేను నీకు చూపించిన నమూనా ప్రకారమే నీవు వాటిని చేసేలా చూడాలి.
- నిర్గమకాండము 26:1సుమారు క్రీ.పూ. 1491
“పది తెరలతో సమావేశ గుడారాన్ని తయారుచేయాలి. వాటిని నీలం ఊదా ఎరుపు రంగులతో పేనిన సన్నని నారతో చేసి, వాటిపై చేయితిరిగిన పనివానితో కెరూబులను అల్లాలి.
- నిర్గమకాండము 26:2సుమారు క్రీ.పూ. 1491
తెరలన్నీ ఇరవై ఎనిమిది మూరల పొడవు నాలుగు మూరల వెడల్పు కలిగి ఒకే కొలతతో ఉండాలి.
- నిర్గమకాండము 26:3సుమారు క్రీ.పూ. 1491
అయిదు తెరలను ఒక దానితో ఒకటి కలిపి ఒక్కటిగా చేయాలి; మిగిలిన అయిదింటిని కూడా అలాగే చేయాలి.
- నిర్గమకాండము 26:4సుమారు క్రీ.పూ. 1491
ఒక కూర్పులోని తెరల చివర మొదటి తెర అంచుకు నీలి నూలుతో ఉచ్చులు చేయాలి. రెండవ కూర్పులోని బయటి తెర చివర కూడా అలాగే చేయాలి.
- నిర్గమకాండము 26:5సుమారు క్రీ.పూ. 1491
ఒక తెరకు యాభై ఉచ్చులు చేసి, ఉచ్చులు ఒకదానికొకటి ఎదురెదురుగా ఉండేలా మరొకదాని తెర అంచుకు యాభై ఉచ్చులు చేయాలి.
- నిర్గమకాండము 26:6సుమారు క్రీ.పూ. 1491
తర్వాత యాభై బంగారు గుండీలు తయారుచేసి ఆ గుండీలతో ఆ తెరలను ఒక దానితో ఒకటి కలిపినప్పుడు అది ఒకే సమావేశ గుడారంగా ఉంటుంది.
- నిర్గమకాండము 26:7సుమారు క్రీ.పూ. 1491
“సమావేశ గుడారం పైకప్పుగా ఉండే గుడారం కోసం మేక వెంట్రుకలతో మొత్తం పదకొండు తెరలు తయారుచేయాలి.
- నిర్గమకాండము 26:8సుమారు క్రీ.పూ. 1491
పదకొండు తెరలన్నీ పొడవు ముప్పై మూరలు, వెడల్పు నాలుగు మూరలు కలిగి ఒకే కొలతతో ఉండాలి.
- నిర్గమకాండము 26:9సుమారు క్రీ.పూ. 1491
అయిదు తెరలను ఒకటిగా మిగతా ఆరు తెరలను ఒకటిగా కలపాలి. ఆరవ తెరను గుడారం ముందు భాగంలో మడతపెట్టాలి.
- నిర్గమకాండము 26:10సుమారు క్రీ.పూ. 1491
మొదటి కూర్పులోని చివరి తెర అంచున, అలాగే రెండవ కూర్పులోని చివరి తెర అంచున యాభై ఉచ్చులు చేయాలి.
- నిర్గమకాండము 26:11సుమారు క్రీ.పూ. 1491
యాభై ఇత్తడి గుండీలు తయారుచేసి ఒకటే గుడారమయ్యేలా ఆ గుండీలను ఆ ఉచ్చులకు తగిలించి కూర్చాలి.
- నిర్గమకాండము 26:12సుమారు క్రీ.పూ. 1491
గుడారపు తెరల అధనపు పొడవు విషయానికొస్తే, మిగిలిన సగం తెర సమావేశ గుడారం వెనుక భాగం దగ్గర క్రిందకు వ్రేలాడి ఉండాలి.