కంటెంట్‌కు వెళ్లండి

circa AD 48–96

Letters to the Churches

Paul and other apostles write to strengthen, correct, and encourage the scattered churches across the Roman world.

2,767 వచనాలు · 21 గ్రంథాలు చేర్చబడ్డాయి

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. 1 థెస్సలొనీకయులకు 4:3సుమారు క్రీ.శ. 54

    మీరు లైంగిక దుర్నీతికి దూరంగా ఉంటూ పరిశుద్ధులుగా ఉండడమే దేవునికి ఇష్టం;

  2. 1 థెస్సలొనీకయులకు 4:4సుమారు క్రీ.శ. 54

    మీలో ప్రతివారు మీ సొంత శరీరమనే పాత్రను పరిశుద్ధంగా, ఘనత కలిగినదిగా ఉండేలా దానిపై నియంత్రణ కలిగి జీవించాలి.

  3. 1 థెస్సలొనీకయులకు 4:5సుమారు క్రీ.శ. 54

    దేవుని ఎరుగనివారి కామోద్రేకాన్ని కలిగి ఉండవద్దు.

  4. 1 థెస్సలొనీకయులకు 4:6సుమారు క్రీ.శ. 54

    ఈ విషయంలో తన సహోదర సహోదరీలను అలుసుగా తీసుకుని మోసం చేయకూడదు. ఎందుకంటే, మేము ముందుగానే మీకు చెప్పి హెచ్చరించిన ప్రకారం అలాంటి పాపాలను చేసిన వారందరిని ఈ క్రియల విషయాల్లో ప్రభువు శిక్షిస్తారు.

  5. 1 థెస్సలొనీకయులకు 4:7సుమారు క్రీ.శ. 54

    పరిశుద్ధ జీవితాన్ని జీవించడానికే దేవుడు మనల్ని పిలిచాడు గాని అపవిత్రులుగా ఉండడానికి పిలువలేదు.

  6. 1 థెస్సలొనీకయులకు 4:8సుమారు క్రీ.శ. 54

    కాబట్టి ఈ నియమాన్ని నిర్లక్ష్యం చేసినవారు మనుష్యులను నిర్లక్ష్యం చేయడమే కాకుండా, మీకు తన పరిశుద్ధాత్మను ఇచ్చిన దేవున్నే నిర్లక్ష్యం చేస్తున్నారు.

  7. 1 థెస్సలొనీకయులకు 4:9సుమారు క్రీ.శ. 54

    ఒకరిని ఒకరు ప్రేమించుకోవడం మీరు దేవుని నుండి నేర్చుకున్నారు కాబట్టి మీలో ఒకరిపట్ల ఒకరికి గల ప్రేమ గురించి మీకు వ్రాయాల్సిన అవసరం లేదు.

  8. 1 థెస్సలొనీకయులకు 4:10సుమారు క్రీ.శ. 54

    నిజానికి, మాసిదోనియ అంతటా ఉన్న దేవుని కుటుంబమంతటికి ప్రేమ చూపిస్తున్నారు. అయినా సహోదరీ సహోదరులారా, మీరు ఇంకా అధికంగా ప్రేమించాలని చెప్తున్నాము.

  9. 1 థెస్సలొనీకయులకు 4:11సుమారు క్రీ.శ. 54

    ఆ ప్రేమ ద్వారా సమాధానకరమైన జీవితాన్ని గడపడమే మీ ధ్యేయంగా పెట్టుకొని, మేము మీకు చెప్పిన విధంగా ఇతరుల జోలికి పోకుండా మీ సొంత విషయాలనే చూసుకుంటూ మీ చేతులతో కష్టపడి పని చేయండని మిమ్మల్ని వేడుకొంటున్నాము.

  10. 1 థెస్సలొనీకయులకు 4:12సుమారు క్రీ.శ. 54

    అప్పుడు మీ అనుదిన జీవితం బయటి వారి గౌరవాన్ని గెలుచుకుంటుంది, మీరు ఎవరిపైనా ఆధారపడేవారిగా ఉండరు.

  11. 1 థెస్సలొనీకయులకు 4:13సుమారు క్రీ.శ. 54

    సహోదరీ సహోదరులారా, చనిపోయినవారి గురించి మీకు తెలియకుండా ఉండడం మాకిష్టం లేదు. మీరు నిరీక్షణలేని ఇతరుల్లా దుఃఖించకండి.

  12. 1 థెస్సలొనీకయులకు 4:14సుమారు క్రీ.శ. 54

    యేసు చనిపోయి తిరిగి లేచారని మనం నమ్ముతున్నాం కాబట్టి, ఆయనలో నిద్రించినవారిని దేవుడు యేసుతో పాటు తీసుకువస్తారని నమ్ముతున్నాము.

  13. 1 థెస్సలొనీకయులకు 4:15సుమారు క్రీ.శ. 54

    ప్రభువు చెప్పిన మాటను బట్టి మేము మీతో చెప్పేది ఏంటంటే, ప్రభువు తిరిగి వచ్చేవరకు బ్రతికి ఉండే మనం చనిపోయినవారికంటె ముందుగా ఆయన సన్నిధికి చేరము.

  14. 1 థెస్సలొనీకయులకు 4:16సుమారు క్రీ.శ. 54

    ప్రభువే స్వయంగా పరలోకం నుండి గొప్ప అధికార శబ్దంతో మాట్లాడడాన్ని వింటారు, అలాగే ప్రధానదూత మాట్లాడే శబ్దాన్ని వింటారు, బూర ధ్వనితో ఆయన దిగి వస్తారు, అప్పుడు క్రీస్తులో చనిపోయినవారు మొదట లేస్తారు.

  15. 1 థెస్సలొనీకయులకు 4:17సుమారు క్రీ.శ. 54

    ఆ తర్వాత మిగతా బ్రతికి ఉన్న మనం వారితో పాటు కలసి, ప్రభువును కలుసుకోడానికి ఆకాశమండలానికి మేఘాల మీద కొనిపోబడతాము. అప్పుడు మనం సదాకాలం ప్రభువుతో కూడా ఉంటాము.

  16. 1 థెస్సలొనీకయులకు 4:18సుమారు క్రీ.శ. 54

    ఆ కారణాన్ని బట్టి, మీరు ఈ మాటల చేత ఒకరిని ఒకరు ప్రోత్సహించుకోండి.

  17. 1 థెస్సలొనీకయులకు 5:1సుమారు క్రీ.శ. 54

    సహోదరీ సహోదరులారా, యేసు క్రీస్తు రాకడ ఎప్పుడు సంభవిస్తుందో ఆ కాలాలు, సమయాల గురించి మేము మీకు వ్రాయాల్సిన అవసరం లేదు,

  18. 1 థెస్సలొనీకయులకు 5:2సుమారు క్రీ.శ. 54

    ప్రభువు దినం రాత్రి దొంగలా వస్తుందని మీకు బాగా తెలుసు.

  19. 1 థెస్సలొనీకయులకు 5:3సుమారు క్రీ.శ. 54

    ప్రజలు, మేము, “నెమ్మది కలిగి సురక్షితంగా ఉన్నాం” అని అనుకుంటున్నప్పుడు, ఒక గర్భిణి స్త్రీకి పురుటినొప్పులు వచ్చునట్లు వారి పైకి నాశనం అకస్మాత్తుగా వస్తుంది, కాబట్టి వారు దాని నుండి తప్పించుకోలేరు.

  20. 1 థెస్సలొనీకయులకు 5:4సుమారు క్రీ.శ. 54

    అయితే సహోదరీ సహోదరులారా, ఆ దినం దొంగలా మిమ్మల్ని ఆశ్చర్యపరచడానికి మీరు చీకటిలో లేరు.

  21. 1 థెస్సలొనీకయులకు 5:5సుమారు క్రీ.శ. 54

    మీరంతా వెలుగు సంతానం పగటి సంతానము. మనం చీకటికి లేదా రాత్రికి చెందినవారం కాదు.

  22. 1 థెస్సలొనీకయులకు 5:6సుమారు క్రీ.శ. 54

    కాబట్టి మనం నిద్రపోతున్న ఇతరుల్లా ఉండకుండా, మెలకువ కలిగి తెలివిగా ఉందాము.

  23. 1 థెస్సలొనీకయులకు 5:7సుమారు క్రీ.శ. 54

    నిద్రపోయేవారు రాత్రివేళ నిద్రపోతారు, మత్తులుగా ఉండేవారా రాత్రివేళ మత్తులై ఉంటారు.

  24. 1 థెస్సలొనీకయులకు 5:8సుమారు క్రీ.శ. 54

    అయితే మనం పగటికి చెందినవారం కాబట్టి తెలివి కలిగి, విశ్వాసం ప్రేమ అనే కవచాన్ని, రక్షణ పొందాలనే ఆ ఆశాభావాన్ని శిరస్త్రాణంగా ధరించుకొంటాము.

  25. 1 థెస్సలొనీకయులకు 5:9సుమారు క్రీ.శ. 54

    ఎందుకంటే దేవుడు మనల్ని ఉగ్రతను అనుభవించడానికి నియమించలేదు కాని, మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా రక్షణ పొందడానికే నియమించారు.