circa AD 48–96
Letters to the Churches
Paul and other apostles write to strengthen, correct, and encourage the scattered churches across the Roman world.
ఈ కాలపు వచనాలు
- 1 థెస్సలొనీకయులకు 5:10సుమారు క్రీ.శ. 54
ఆయన తిరిగి వచ్చినప్పుడు మనం లోకంలో జీవించి ఉన్నా లేదా మరణించినా ఆయనతో పాటు మనం జీవించాలని క్రీస్తు మన కోసం చనిపోయారు.
- 1 థెస్సలొనీకయులకు 5:11సుమారు క్రీ.శ. 54
కాబట్టి మీరిప్పుడు చేస్తున్నట్లుగానే ఒకరిని ఒకరు ప్రోత్సహించుకొంటూ ఒకరిని ఒకరు బలపరచుకోండి.
- 1 థెస్సలొనీకయులకు 5:12సుమారు క్రీ.శ. 54
సహోదరీ సహోదరులారా, మీ మధ్యలో ప్రయాసపడుతున్నవారిని, ప్రభువులో మీ కోసం శ్రద్ధ చూపించేవారిని, మిమ్మల్ని హెచ్చరించేవారిని గౌరవించాలని మేము మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాము.
- 1 థెస్సలొనీకయులకు 5:13సుమారు క్రీ.శ. 54
వారి పనిని బట్టి వారిని ప్రేమతో అధికంగా గౌరవించండి. ఒకరితో ఒకరు సమాధానం కలిగి ఉండండి.
- 1 థెస్సలొనీకయులకు 5:14సుమారు క్రీ.శ. 54
సహోదరీ సహోదరులారా, సోమరులను హెచ్చరించమని, క్రుంగిపోయినవారిని ప్రోత్సహించమని, బలహీనులకు సహాయం చేయమని, అందరితో సహనం కలిగి ఉండమని మేము మిమ్మల్ని వేడుకుంటున్నాము.
- 1 థెస్సలొనీకయులకు 5:15సుమారు క్రీ.శ. 54
మీలో ఎవరూ కీడుకు ప్రతిగా కీడు చేయకుండ చూసుకోండి, అలాగే అందరికి మంచి చేయడానికే ఎల్లప్పుడూ ప్రయత్నించండి.
- 1 థెస్సలొనీకయులకు 5:16సుమారు క్రీ.శ. 54
ఎల్లప్పుడు ఆనందించండి;
- 1 థెస్సలొనీకయులకు 5:17సుమారు క్రీ.శ. 54
విడువక ప్రార్థించండి,
- 1 థెస్సలొనీకయులకు 5:18సుమారు క్రీ.శ. 54
మీరు ప్రతి విషయం కోసం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని క్రీస్తు యేసులో మీ పట్ల దేవుని ఉద్దేశము.
- 1 థెస్సలొనీకయులకు 5:19సుమారు క్రీ.శ. 54
ఆత్మ ప్రేరణను ఆర్పకండి.
- 1 థెస్సలొనీకయులకు 5:20సుమారు క్రీ.శ. 54
ప్రవచనాలను తిరస్కరించకండి.
- 1 థెస్సలొనీకయులకు 5:21సుమారు క్రీ.శ. 54
అన్నిటిని పరీక్షిస్తూ మంచి వాటిని గట్టిగా పట్టుకోండి,
- 1 థెస్సలొనీకయులకు 5:22సుమారు క్రీ.శ. 54
ప్రతీ కీడును తిరస్కరించండి.
- 1 థెస్సలొనీకయులకు 5:23సుమారు క్రీ.శ. 54
సమాధానకర్తయైన దేవుడు తానే స్వయంగా మిమ్మల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరచును గాక. మీ పూర్ణాత్మను, మనస్సును దేహాన్ని మన ప్రభువైన యేసు క్రీస్తు రాకడలో నిందారహితంగా కాపాడును గాక.
- 1 థెస్సలొనీకయులకు 5:24సుమారు క్రీ.శ. 54
మిమ్మల్ని పిలిచేవాడు నమ్మకమైనవాడు, కాబట్టి ఆయన ఖచ్చితంగా చేస్తారు.
- 1 థెస్సలొనీకయులకు 5:25సుమారు క్రీ.శ. 54
సహోదరీ సహోదరులారా, మాకోసం ప్రార్థించండి.
- 1 థెస్సలొనీకయులకు 5:26సుమారు క్రీ.శ. 54
దేవుని ప్రజలందరికి పవిత్ర ముద్దుతో వందనాలు.
- 1 థెస్సలొనీకయులకు 5:27సుమారు క్రీ.శ. 54
సహోదరీ సహోదరులందరికి ఈ పత్రికను చదివి వినిపించాలని ప్రభువు పేరట మిమ్మల్ని ఆదేశిస్తున్నాను.
- 1 థెస్సలొనీకయులకు 5:28సుమారు క్రీ.శ. 54
మన ప్రభువైన యేసు క్రీస్తు కృప మీతో ఉండును గాక.
- 2 థెస్సలొనీకయులకు 1:1సుమారు క్రీ.శ. 54
తండ్రియైన దేవునికి యేసు క్రీస్తు ప్రభువుకు చెందిన థెస్సలొనీకయ సంఘానికి,
- 2 థెస్సలొనీకయులకు 1:2సుమారు క్రీ.శ. 54
తండ్రియైన దేవుని నుండి ప్రభువైన యేసు క్రీస్తు నుండి కృపా సమాధానాలు మీకు కలుగును గాక.
- 2 థెస్సలొనీకయులకు 1:3సుమారు క్రీ.శ. 54
సహోదరీ సహోదరులారా, మేము మీ గురించి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతలు చెల్లించ వలసిందే ఎందుకంటే, మీ విశ్వాసం అంతకంతకు పెరుగుతుంది, మీ అందరికి ఒకరిపట్ల ఒకరికి ఉన్న ప్రేమ మరింత అధికమవుతూ ఉంది.
- 2 థెస్సలొనీకయులకు 1:4సుమారు క్రీ.శ. 54
కాబట్టి మీరు పొందుతున్న హింసలలో శ్రమలలో మీరు చూపుతున్న ఓర్పు విశ్వాసం గురించి దేవుని సంఘాల్లో మేము గొప్పగా చెప్తున్నాము.
- 2 థెస్సలొనీకయులకు 1:5సుమారు క్రీ.శ. 54
దీన్ని బట్టి దేవుడు ఇచ్చిన తీర్పు న్యాయమైనదని తెలియజేయడానికి రుజువుగా, మీరు అనుభవించిన శ్రమల వలన మీరు దేవుని రాజ్యానికి అర్హులు అవుతారు.
- 2 థెస్సలొనీకయులకు 1:6సుమారు క్రీ.శ. 54
దేవుడు న్యాయవంతుడు కాబట్టి మిమ్మల్ని హింసించినవారిని తగిన విధంగా శిక్షిస్తారు,