circa AD 48–96
Letters to the Churches
Paul and other apostles write to strengthen, correct, and encourage the scattered churches across the Roman world.
ఈ కాలపు వచనాలు
- 2 థెస్సలొనీకయులకు 3:3సుమారు క్రీ.శ. 54
అయితే ప్రభువు నమ్మదగినవాడు కాబట్టి ఆయన మిమ్మల్ని బలపరచి దుష్టుని నుండి కాపాడును.
- 2 థెస్సలొనీకయులకు 3:4సుమారు క్రీ.శ. 54
మేము మీకు ఆజ్ఞాపించిన వాటిని మీరు చేస్తున్నారని, వాటిని చేయడం కొనసాగిస్తారని ప్రభువులో మేము నమ్ముతున్నాము.
- 2 థెస్సలొనీకయులకు 3:5సుమారు క్రీ.శ. 54
ప్రభువు మీ హృదయాలను దేవుడు మీ పట్ల చూపిన ప్రేమ, క్రీస్తు చూపిన సహనం వైపు నడిపించును గాక.
- 2 థెస్సలొనీకయులకు 3:6సుమారు క్రీ.శ. 54
సహోదరీ సహోదరులారా, మీరు మా నుండి పొందిన బోధల ప్రకారం జీవించక, తమ పనులను చూసుకోక సోమరులుగా బ్రతుకుతున్న ప్రతి విశ్వాసికి మీరు దూరంగా ఉండాలని మన ప్రభువైన యేసు క్రీస్తు నామంలో మేము మిమ్మల్ని ఆజ్ఞాపిస్తున్నాము.
- 2 థెస్సలొనీకయులకు 3:7సుమారు క్రీ.శ. 54
మా మాదిరిని మీరు ఎలా అనుసరించాలో అది మీకు తెలుసు. అంటే మేము మీ మధ్యన ఉన్నప్పుడు వట్టి చేతులతో సోమరులుగా కూర్చోలేదు,
- 2 థెస్సలొనీకయులకు 3:8సుమారు క్రీ.శ. 54
మేము ఎవరి దగ్గర ఉచితంగా ఆహారాన్ని తినలేదు. దానికి బదులు, మేము మీలో ఎవరికీ భారంగా ఉండకూడదని రాత్రింబవళ్ళు కష్టపడి శ్రమించి పని చేశాము.
- 2 థెస్సలొనీకయులకు 3:9సుమారు క్రీ.శ. 54
అలాంటి సహాయాన్ని పొందే హక్కు లేదని అలా చేయలేదు కాని, మీరు మాలా ప్రవర్తించేలా మీకు ఒక ఆదర్శంగా ఉండాలని మేము అలా చేశాము.
- 2 థెస్సలొనీకయులకు 3:10సుమారు క్రీ.శ. 54
మేము మీతో ఉన్నప్పుడు, “పని చేయనివాడు ఆహారం తినడానికి పాత్రుడు కాడు” అనే నియమాన్ని కూడా మీకు ఇచ్చాము.
- 2 థెస్సలొనీకయులకు 3:11సుమారు క్రీ.శ. 54
మీలో కొందరు సోమరులుగా ఏ పని చేసుకోకుండా ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకుంటూ ఉన్నారని మేము విన్నాము.
- 2 థెస్సలొనీకయులకు 3:12సుమారు క్రీ.శ. 54
అలాంటివారు స్థిరపడి, వారు తినే ఆహారాన్ని వారే సంపాదించుకోవాలని మన ప్రభువైన యేసు క్రీస్తు నామంలో మేము వారిని హెచ్చరిస్తున్నాము, వేడుకుంటున్నాము.
- 2 థెస్సలొనీకయులకు 3:13సుమారు క్రీ.శ. 54
సహోదరీ సహోదరులారా, మంచి చేయడంలో మీరు ఎన్నడూ అలసి పోవద్దు.
- 2 థెస్సలొనీకయులకు 3:14సుమారు క్రీ.శ. 54
ఈ ఉత్తరంలో మేము వ్రాసిన సూచనలను పాటించని వారిని గమనించి వారు సిగ్గుపడేలా మీరు వారితో కలవకండి.
- 2 థెస్సలొనీకయులకు 3:15సుమారు క్రీ.శ. 54
అయితే వారిని శత్రువులుగా చూడవద్దు కాని, మీ తోటి విశ్వాసులుగా వారిని హెచ్చరించండి.
- 2 థెస్సలొనీకయులకు 3:16సుమారు క్రీ.శ. 54
సమాధానానికి కర్తయైన దేవుడు అన్ని సమయాల్లో అన్ని విధాలుగా మీకు సమాధానం కలుగజేయును. ప్రభువు మీ అందరికి తోడై ఉండును గాక!
- 2 థెస్సలొనీకయులకు 3:17సుమారు క్రీ.శ. 54
పౌలు అనే నేను నా స్వహస్తంతో ఈ శుభములు వ్రాస్తున్నాను, నేను వ్రాసిన ఉత్తరాలన్నింటిలో నేను వ్రాశాను అనడానికి ప్రత్యేకమైన గుర్తు ఇదే.
- 2 థెస్సలొనీకయులకు 3:18సుమారు క్రీ.శ. 54
మన ప్రభువైన యేసు క్రీస్తు కృప మీ అందరితో ఉండును గాక.
- 1 తిమోతి 1:1సుమారు క్రీ.శ. 65
మన రక్షకుడైన దేవుని, మన నిరీక్షణయైన క్రీస్తు యేసు ఆజ్ఞ వలన క్రీస్తు యేసు యొక్క అపొస్తలుడైన పౌలు,
- 1 తిమోతి 1:2సుమారు క్రీ.శ. 65
విశ్వాసంలో నాకు నిజ కుమారుడైన తిమోతికి వ్రాయునది:
- 1 తిమోతి 1:3సుమారు క్రీ.శ. 65
నేను మాసిదోనియా ప్రాంతానికి వెళ్తూ, నేను నిన్ను కోరిన విధంగా, నీవు ఎఫెసు పట్టణంలోనే ఉండి, అక్కడ సత్యానికి విరుద్ధమైన బోధలు చేస్తున్నవారిని అలా బోధించవద్దని,
- 1 తిమోతి 1:4సుమారు క్రీ.శ. 65
కట్టుకథలపై అంతులేని వంశచరిత్రలపై శ్రద్ధ చూపవద్దని ఆజ్ఞాపించు. వీటన్నిటి వలన విశ్వాసంతో జరిగే దేవుని పని ముందుకు కొనసాగే బదులు వాగ్వివాదాలకు దారి తీస్తాయి.
- 1 తిమోతి 1:5సుమారు క్రీ.శ. 65
ఈ ఆజ్ఞ యొక్క లక్ష్యం ప్రేమ; అది స్వచ్ఛమైన హృదయం నుండి, మంచి మనస్సాక్షి నుండి, యథార్థమైన విశ్వాసం నుండి కలుగుతుంది.
- 1 తిమోతి 1:6సుమారు క్రీ.శ. 65
కొందరు వీటిని విడిచిపెట్టి, అర్థంలేని మాటల్లో పడ్డారు.
- 1 తిమోతి 1:7సుమారు క్రీ.శ. 65
వారు దేవుని ధర్మశాస్త్ర ఉపదేశకులుగా ఉండాలని అనుకుంటారు, కాని తాము మాట్లాడే వాటి గురించి లేదా తాము ఎంతో నమ్మకంగా నొక్కి చెప్పే వాటి గురించి వారికే తెలియదు.
- 1 తిమోతి 1:8సుమారు క్రీ.శ. 65
ధర్మశాస్త్రాన్ని సరియైన రీతిలో ఉపయోగిస్తే అది మంచిదే అని మనందరికి తెలుసు.
- 1 తిమోతి 1:9సుమారు క్రీ.శ. 65
అంతేకాక ధర్మశాస్త్రం నీతిమంతుల కోసం కాదు గాని, చట్టానికి విరుద్ధంగా ఉన్నవారికి, తిరుగుబాటు చేసేవారికి, భక్తిహీనులకు, పాపులకు, అపవిత్రులకు, నాస్తికులకు, తమ తల్లిదండ్రులను చంపేవారి కోసం, హంతకుల కోసం