కంటెంట్‌కు వెళ్లండి

Israel

1,007 వచనాలు · 20 కుటుంబ సభ్యులు

ఇలా కూడా పిలుస్తారు: Jacob

Israel ను ప్రస్తావించే వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. రాహేలు యోసేపుకు జన్మనిచ్చిన తర్వాత, యాకోబు లాబానుతో, “నేను నా స్వదేశానికి వెళ్తాను, నన్ను పంపించు.

  2. లాబాను, “నీకు ఏమివ్వాలి?” అని అడిగాడు. అందుకు యాకోబు, “నాకు ఈ ఒక్కటి చేస్తే చాలు వేరే ఏమి అక్కర్లేదు. నేను నీ మందను కాపాడుతూ మేపుతాను:

  3. అప్పుడు అతడు, తనకు యాకోబుకు మధ్య మూడు రోజుల ప్రయాణమంత దూరం పెట్టాడు. లాబాను యొక్క మిగిలిన మందను యాకోబు మేపడం కొనసాగించాడు.

  4. అయితే యాకోబు చినారు, బాదం, సాలు అనే చెట్ల కొమ్మలను తీసుకుని ఆ కొమ్మల్లో తెల్లచారలు కనబడేలా అక్కడక్కడ వాటి తొక్కలను ఒలిచాడు.

  5. యాకోబు మందలో చిన్నవాటిని వేరు చేశాడు, కానీ మిగితా వాటిని లాబాను మందలోని చారలు ఉన్నవాటి వైపు, నల్లనివాటివైపు వాటి ముఖాలు త్రిప్పి ఉంచాడు. ఇలా తన కోసం వేరే మందను చేసుకున్నాడు, వాటిని లాబాను మందలతో కలపలేదు.

  6. మందలలో బలమైన ఆడవి వేడి మీద ఉన్నప్పుడు, అవి కొమ్మల దగ్గర చూలు కట్టేలా యాకోబు ఆ కొమ్మలను వాటికి ఎదురుగా నీటి తొట్టిలో పెట్టేవాడు.

  7. ఒకవేళ పశువులు బలహీనంగా ఉంటే, వాటిని అక్కడ పెట్టేవాడు కాదు. కాబట్టి బలహీనమైనవి లాబానుకు వెళ్లాయి, బలమైనవి యాకోబుకు వచ్చాయి.

  8. లాబాను కుమారులు, “యాకోబు మన తండ్రికి ఉన్న ఆస్తి అంతా తీసుకున్నాడు; అతడు సంపాదించుకున్న ఆస్తి అంతా మన తండ్రికి సంబంధించినదే” అని చెప్పుకోవడం యాకోబు విన్నాడు.

  9. లాబాను వైఖరి తన పట్ల ముందు ఉన్నట్లు లేదు అని యాకోబు గ్రహించాడు.

  10. అప్పుడు యెహోవా యాకోబుతో, “నీ పూర్వికుల దేశానికి నీ బంధువుల ఇంటికి తిరిగి వెళ్లు, నేను నీతో ఉంటాను” అని చెప్పారు.

  11. యాకోబు తన మందలు ఉన్న పొలం దగ్గరకు రమ్మని రాహేలుకు, లేయాకు కబురు పంపాడు.

  12. కలలో దేవదూత నాతో, ‘యాకోబు’ అని పిలిచాడు. ‘చిత్తం, నేను ఉన్నాను’ అని జవాబిచ్చాను.

  13. కాబట్టి యాకోబు తన పిల్లలను భార్యలను ఒంటెలపై ఎక్కించి,

  14. అంతేకాక తాను పారిపోతున్నాడని సిరియావాడైన లాబానుకు చెప్పకుండా యాకోబు మోసం చేశాడు.

  15. మూడవ రోజు యాకోబు పారిపోయాడని లాబానుకు తెలియజేయబడింది.

  16. రాత్రి దేవుడు కలలో సిరియావాడైన లాబానుకు ప్రత్యక్షమై, “నీవు యాకోబుతో మంచి కానీ చెడు కానీ ఏమి అనవద్దు, జాగ్రత్త” అని హెచ్చరించారు.

  17. లాబాను యాకోబును ఎదుర్కొన్నప్పుడు యాకోబు గిలాదు కొండ సీమలో తన గుడారం వేసుకున్నాడు, లాబాను అతని బంధువులు కూడా అక్కడే మకాం వేశారు.

  18. అప్పుడు లాబాను యాకోబుతో అన్నాడు, “నీవు చేసింది ఏంటి? నన్ను మోసం చేసి, నా కుమార్తెలను యుద్ధంలో చెరగా తీసుకెళ్లావు.

  19. నీకు హాని చేసే సత్తా నాకు ఉంది; కానీ గత రాత్రి నీ తండ్రి యొక్క దేవుడు, ‘నీవు యాకోబుతో మంచి కానీ చెడు కానీ ఏమి అనవద్దు, జాగ్రత్త’ అని నన్ను హెచ్చరించారు.

  20. యాకోబు లాబానుకు జవాబిస్తూ, “నేను భయపడ్డాను, ఎందుకంటే నీవు నీ కుమార్తెలను బలవంతంగా నా నుండి తీసుకెళ్తావని అనుకున్నాను.

  21. అయితే ఒకవేళ ఎవరి దగ్గర నీ దేవతల విగ్రహాలు దొరికితే, వారు బ్రతకరు. నీదేదైనా నా దగ్గర ఉన్నదేమో నీ బంధువుల సమక్షంలో వెదుక్కో; ఒకవేళ ఉంటే, తీసుకెళ్లు” అని అన్నాడు. అయితే రాహేలు ఆ దేవతల విగ్రహాలను దొంగిలించిందని యాకోబుకు తెలియదు.

  22. లాబాను వెదకడానికి యాకోబు గుడారంలోకి, లేయా గుడారంలోకి, ఇద్దరు దాసీల గుడారాల్లోకి వెళ్లి చూశాడు కానీ అతనికి ఏమీ దొరకలేదు. లేయా గుడారం నుండి బయటకు వచ్చి రాహేలు గుడారంలోకి వెళ్లాడు.

  23. యాకోబు కోపంతో లాబానుతో వాదన పెట్టుకున్నాడు. “నా నేరమేంటి? నేను ఏం పాపం చేశానని నన్నిలా తరుముతున్నావు?

  24. లాబాను యాకోబుతో, “ఈ స్త్రీలు నా కుమార్తెలు, పిల్లలు నా పిల్లలు, మందలు నా మందలు. అయినా ఇప్పుడు ఈ నా కుమార్తెల గురించి, లేదా వారు కన్న పిల్లల గురించి నేనేమి చేయగలను?

  25. కాబట్టి యాకోబు ఒక రాయిని తీసుకుని దానిని స్తంభంగా నిలబెట్టాడు.