కంటెంట్‌కు వెళ్లండి

Israel

1,007 వచనాలు · 20 కుటుంబ సభ్యులు

ఇలా కూడా పిలుస్తారు: Jacob

Israel ను ప్రస్తావించే వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. యాకోబు నిద్రలేచి, “ఖచ్చితంగా ఈ స్థలంలో యెహోవా ఉన్నారు, నేను అది గ్రహించలేకపోయాను” అని అనుకున్నాడు.

  2. మర్నాడు తెల్లవారినప్పుడు యాకోబు తన తలగడగా పెట్టుకున్న రాయిని తీసుకుని, దానిని స్తంభంగా నిలిపి, దాని మీదుగా నూనె పోశాడు.

  3. తర్వాత యాకోబు మ్రొక్కుబడి చేస్తూ ఇలా అన్నాడు, “దేవుడు నాకు తోడుగా ఉండి నన్ను ఈ ప్రయాణంలో కాపాడి నాకు తినడానికి ఆహారం ఇచ్చి వేసుకోడానికి వస్త్రాలు ఇచ్చి నన్ను నా తండ్రి ఇంటికి క్షేమంగా చేరిస్తే, యెహోవాయే నా దేవుడుగా ఉంటారు, స్తంభంగా నేను నిలబెట్టిన ఈ రాయి దేవుని మందిరంగా ఉంటుంది. అంతేకాక, నీవు నాకు ఇచ్చే అంతటిలో నుండి నేను నీకు పదవ భాగం ఇస్తాను” అని ఆయనకు మ్రొక్కుబడి చేసుకున్నాడు.

  4. యాకోబు తన ప్రయాణం కొనసాగించి తూర్పు ప్రజల దేశానికి వచ్చాడు.

  5. యాకోబు కాపరులను చూసి, “సోదరులారా, మీరు ఎక్కడి వారు?” అని అడిగాడు. వారు, “మేము హారాను వారం” అని జవాబిచ్చారు.

  6. యాకోబు తన మామ లాబాను కుమార్తెయైన రాహేలును, తన మామ మందను చూడగానే, అతడు వెళ్లి బావి మీద ఉన్న రాయిని దొర్లించి తన మామ మందకు నీళ్లు పెట్టాడు.

  7. తర్వాత యాకోబు రాహేలును ముద్దు పెట్టుకుని బిగ్గరగా ఏడ్చాడు.

  8. అతడు తన తండ్రి బంధువని, రిబ్కా కుమారుడని రాహేలుతో చెప్పాడు. కాబట్టి ఆమె పరుగెత్తుకుంటూ వెళ్లి తన తండ్రికి చెప్పింది.

  9. తన సోదరి కుమారుడైన యాకోబును గురించిన సమాచారం విన్న వెంటనే, లాబాను అతన్ని కలవడానికి త్వరపడ్డాడు. అతన్ని హత్తుకుని, ముద్దుపెట్టి, తన ఇంటికి తీసుకెళ్లాడు, అక్కడ యాకోబు అన్ని విషయాలు అతనికి చెప్పాడు.

  10. లాబాను అతనితో, “నీవు నా బంధువైనంత మాత్రాన ఏమి తీసుకోకుండ నా కోసం పని చేస్తావా? నీకు జీతంగా ఏమి కావాలో చెప్పు” అని అన్నాడు.

  11. యాకోబు రాహేలుతో ప్రేమలో ఉండి, “నీ చిన్న కుమార్తె రాహేలు కోసం నేను నీ దగ్గర ఏడు సంవత్సరాలు సేవ చేస్తాను” అన్నాడు.

  12. యాకోబు రాహేలు కోసం ఏడు సంవత్సరాలు పని చేశాడు, అయితే తనకు రాహేలు పట్ల ఉన్న ప్రేమను బట్టి అతనికి ఆ ఏడు సంవత్సరాలు కొద్దిరోజులే అనిపించింది.

  13. తర్వాత యాకోబు లాబానుతో, “నా భార్యను నాకు ఇవ్వు, నా గడువు తీరింది. నేను ఆమెతో పడుకుంటాను” అని అన్నాడు.

  14. యాకోబు అలాగే చేశాడు. లేయాతో తన వారం ముగించుకున్న తర్వాత లాబాను తన కుమార్తె రాహేలును అతనికి భార్యగా ఇచ్చాడు.

  15. రాహేలు తనకు పిల్లలు కలగడం లేదు అని గ్రహించి, తన అక్క మీద అసూయ పడింది. కాబట్టి యాకోబుతో, “నాకు పిల్లలను ఇవ్వు లేదా నేను చస్తాను!” అని అన్నది.

  16. యాకోబు ఆమెపై కోప్పడి, “నేనేమైన నీకు పిల్లలు పుట్టకుండా ఆపిన దేవుని స్థానంలో ఉన్నానా?” అని అన్నాడు.

  17. కాబట్టి తన దాసి బిల్హాను అతనికి భార్యగా ఇచ్చింది. యాకోబు ఆమెతో పడుకున్నాడు.

  18. బిల్హా గర్భవతియై అతనికి కుమారుని కన్నది.

  19. రాహేలు దాసి బిల్హా మళ్ళీ గర్భవతియై యాకోబుకు మరో కుమారున్ని కన్నది.

  20. లేయా పిల్లలు కనడం ఆగిపోయింది అని గ్రహించినప్పుడు, తన దాసి జిల్పాను యాకోబుకు భార్యగా ఇచ్చింది.

  21. లేయా దాసి జిల్పా యాకోబుకు కుమారున్ని కన్నది.

  22. లేయా దాసి జిల్పా యాకోబుకు మరో కుమారున్ని కన్నది.

  23. సాయంత్రం యాకోబు పొలం నుండి వచ్చినప్పుడు, లేయా అతన్ని కలవడానికి వెళ్లింది. “నీవు నాతో పడుకోవాలి, నీకోసం నా కుమారుని పండ్లను ఇచ్చాను” అని అతనితో అన్నది. కాబట్టి ఆ రాత్రి అతడు ఆమెతో పడుకున్నాడు.

  24. దేవుడు లేయా మనవి విన్నారు, ఆమె గర్భవతియై అయిదవ కుమారున్ని కన్నది.

  25. ఆమె మరోసారి గర్భవతియై ఆరవ కుమారున్ని కన్నది.