కంటెంట్‌కు వెళ్లండి

Dan

63 వచనాలు · 15 కుటుంబ సభ్యులు

Dan ను ప్రస్తావించే వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. వారి వంశాల ప్రకారం దాను గోత్రికులు వారసత్వంగా పొందిన పట్టణాలు, వాటి గ్రామాలు ఇవి.

  2. మిగిలిన కహాతు సంతతివారికి ఎఫ్రాయిం, దాను, మనష్షే అర్థ గోత్రాల నుండి చీట్ల ద్వారా పది పట్టణాలు ఇచ్చారు.

  3. దాను గోత్రం నుండి వారికి ఇచ్చినవి: ఎల్తెకే, గిబ్బెతోను,

  4. అమోరీయులు దాను గోత్రం వారిని మైదానం దిగువకు రాకుండ కొండసీమ ప్రాంతానికి పరిమితం చేశారు.

  5. గిలాదువారు యొర్దాను అవతల నివసించారు. దానీయులు ఓడల దగ్గర ఎందుకు తిరుగుతున్నారు? ఆషేరీయులు సముద్రతీరాన తమ ఓడరేవుల్లో ఉన్నారు.

  6. అతడు జోరహు, ఎష్తాయోలు మధ్యలో మహెనుదాను అనే స్థలంలో ఉన్నప్పుడు యెహోవా ఆత్మ అతన్ని పురికొల్పడం మొదలుపెట్టాడు.

  7. కాబట్టి దానీయులు తమ వంశాల నుండి అయిదుగురు సమర్థులైన యోధులను ఎన్నుకుని దానీయులందరి తరుపున జోరహు నుండి ఎష్తాయోలు నుండి దేశాన్ని పరిశీలించడానికి పంపి వారితో, “మీరు వెళ్లి దేశాన్ని పరిశీలించి రండి” అని అన్నారు. కాబట్టి వారు ఎఫ్రాయిం కొండసీమకు వెళ్లి మీకా ఇంటికి వచ్చి అక్కడే ఆ రాత్రి గడిపారు.

  8. ద్వారం దగ్గర యుద్ధాయుధాలు ధరించిన ఆరువందలమంది దానీయులు నిలబడ్డారు.

  9. వారు మీకా ఇంటి నుండి కొంత దూరం వెళ్లాక, మీకా పొరుగువారు సమకూడి దానీయుల వెంటపడ్డారు.

  10. వారు కేకలు వేస్తుండగా, దానీయులు తిరిగి మీకాను, “నీ మనుష్యులను పోరాడడానికి పిలిచావు, నీకేమి కావాలి?” అని అడిగారు.

  11. దానీయులు అతనితో అన్నారు, “మాతో వాదించకు; కోపంతో మా మనుష్యుల్లో కొందరు నీపై దాడి చేసి నిన్ను నీ కుటుంబాన్ని చంపుతారు.”

  12. కాబట్టి దానీయులు తమ దారిన తాము వెళ్లిపోయారు. వారు అతనికంటే బలంగా ఉన్నారని గ్రహించి, మీకా తిరిగి తన ఇంటికి వెళ్లిపోయాడు.

  13. దానికి ఇశ్రాయేలు కుమారుడైన దాను అని తమ పూర్వికుడైన దాను పేరు పెట్టారు; మొదట ఆ పట్టణం లాయిషు అని పిలువబడేది.

  14. అక్కడ దానీయులు తమ కోసం ఆ విగ్రహాన్ని నిలుపుకున్నారు. దేశం చెరగా అయ్యేవరకు, మోషే కుమారుడు గెర్షోము యొక్క కుమారుడైన యోనాతాను, అతని కుమారులు దాను గోత్రానికి యాజకులుగా ఉన్నారు.

  15. అప్పుడు ఇశ్రాయేలీయులందరు, దాను నుండి బెయేర్షేబ వరకు ఉన్నవారు, గిలాదు ప్రదేశంలో ఉన్నవారు, అంతా ఏకమై మిస్పా దగ్గర యెహోవా సన్నిధిలో సమావేశమయ్యారు.

  16. కాబట్టి సమూయేలు యెహోవా ప్రవక్తగా స్థిరపడ్డాడని దాను నుండి బెయేర్షేబ వరకు ఇశ్రాయేలీయులందరు గుర్తించారు.

  17. To translate the kingdom from the house of Saul, and to set up the throne of David over Israel and over Judah, from Dan even to Beersheba.

  18. “కాబట్టి నా సలహా ఏంటంటే, దాను నుండి బెయేర్షేబ వరకు సముద్రపు ఇసుకరేణువులంత అసంఖ్యాకంగా ఇశ్రాయేలీయులందరు నీ దగ్గర సమకూడాలి. నీవే స్వయంగా వారిని యుద్ధంలో నడిపించాలి.

  19. కాబట్టి రాజు యోవాబును, అతనితో ఉన్న సైన్యాధిపతులను పిలిచి, “యుద్ధానికి వెళ్లగలిగిన వారి సంఖ్య నాకు తెలిసేలా దాను నుండి బెయేర్షేబ వరకు ఇశ్రాయేలు గోత్రాలన్నిటి దగ్గరకు వెళ్లి జనాభా లెక్క తీసుకురండి” అని చెప్పాడు.

  20. కాబట్టి యెహోవా ఉదయం నుండి నియమించబడిన సమయం పూర్తయ్యే వరకు ఇశ్రాయేలు మీదికి తెగులు రప్పించారు. అప్పుడు దాను నుండి బెయేర్షేబ వరకు డెబ్బైవేలమంది చనిపోయారు.

  21. సొలొమోను జీవితకాలంలో దాను నుండి బెయేర్షేబ వరకు యూదా, ఇశ్రాయేలు ప్రజలు క్షేమంగా, ప్రతి ఒక్కరు తమ సొంత ద్రాక్ష, అంజూర చెట్ల క్రింద నిర్భయంగా నివసించారు.

  22. అతడు ఒకదాన్ని బేతేలులో, ఇంకొక దానిని దానులో పెట్టాడు.

  23. కాని ఇది ఒక పాపంగా మారింది; ప్రజలు బేతేలులో ఉన్నదానిని పూజించారు, దూరమైనా సరే దానుకు వెళ్లి అక్కడ ఉన్నదానిని పూజించారు.

  24. రాజైన ఆసాతో బెన్-హదదు ఏకీభవించి, తన సేనాధిపతులను ఇశ్రాయేలు పట్టణాల మీదికి పంపాడు. అతడు ఈయోను, దాను, ఆబేల్-బేత్-మయకా, కిన్నెరెతు పరిసరాలన్నీ, నఫ్తాలి ప్రదేశమంతా జయించాడు.

  25. అయితే, ఇశ్రాయేలీయులు పాపం చేయడానికి కారణమైన నెబాతు కుమారుడైన యరొబాము పాపాలు చేస్తూ యెహు బేతేలులో దానులో ఉన్న బంగారు దూడలను పూజించడం మానలేదు.