కంటెంట్‌కు వెళ్లండి

Dan

63 వచనాలు · 15 కుటుంబ సభ్యులు

Dan ను ప్రస్తావించే వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. దాను, యోసేపు, బెన్యామీను, నఫ్తాలి, గాదు, ఆషేరు.

  2. కాబట్టి దావీదు యోవాబుతో, సైన్యాధిపతులతో, “మీరు వెళ్లి బెయేర్షేబ నుండి దాను వరకు ఉన్న ఇశ్రాయేలీయులను లెక్కించండి. వారి సంఖ్య నాకు తెలిసేలా ఆ వివరాలు నా దగ్గరకు తీసుకురండి” అని చెప్పాడు.

  3. దానీయుల మీద: యెరోహాము కుమారుడైన అజరేలు.

  4. అతని తల్లి దాను వంశీయురాలు. తండ్రి తూరుకు చెందిన వాడు. బంగారం వెండి ఇత్తడి ఇనుము రాళ్లు దూలాలతో పని చేయడం అతనికి బాగా తెలుసు. ఊదా నీలి సన్నని నూలుతో ఎరుపు నూలుతో పని చేసే నైపుణ్యం ఉన్నవాడు. అన్ని రకాల చెక్కడపు పనిలో నైపుణ్యం ఉన్నవాడు, నాకు యజమాని నీకు తండ్రియైన దావీదు, మీరు ఏర్పాటుచేసిన పనివారితో అతడు పని చేస్తాడు.

  5. రాజైన ఆసాతో బెన్-హదదు ఏకీభవించి, తన సేనాధిపతులను ఇశ్రాయేలు పట్టణాల మీదికి పంపాడు. వారు ఈయోను, దాను, ఆబేల్-మయీము, నఫ్తాలి ప్రాంతానికి చేరిన పట్టణాలలోని కొట్లను జయించారు.

  6. ప్రజలంతా యెరూషలేముకు వచ్చి ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు పస్కా పండుగ జరుపుకోవాలని బెయేర్షేబ నుండి దాను వరకు ఇశ్రాయేలు అంతటా ప్రకటించాలని వారు నిర్ణయించుకున్నారు. చాలాకాలంగా వ్రాయబడిన ప్రకారం పెద్ద సంఖ్యలో ప్రజలు పండుగ జరుపుకోలేదు.

  7. దాను నుండి ఒక స్వరం, ఎఫ్రాయిం కొండల నుండి కీడు వస్తుందని ప్రకటిస్తుంది.

  8. శత్రువుల గుర్రాల బుసలు కొట్టడం దాను నుండి వినబడుతుంది; వారి మగ గుర్రాల సకిలింపుకు దేశమంతా వణికిపోతుంది. వారు మ్రింగివేయడానికి భూమిని, అందులోని సమస్తాన్ని, పట్టణాన్ని, అందులో నివసించే వారినందరిని మ్రింగివేయడానికి వచ్చారు.

  9. వారు ఇజాలు నుండి ద్రాక్షరసం పీపాలు ఇచ్చి, అచ్చుపోసిన ఇనుము, లవంగపట్ట, వోమ ఇచ్చి మీ సరుకులు కొన్నారు.

  10. “పేర్ల ప్రకారం జాబితా తయారుచేయబడిన గోత్రాలు ఇవే: “ఉత్తర సరిహద్దులో దానుకు ఒక భాగం ఉంటుంది; అది హెత్లోను నుండి లెబో హమాతుకు వెళ్లే రహదారి వెంట ఉంటుంది; హజర్-ఎనాను హమాతుకు ప్రక్కన దమస్కు ఉత్తర సరిహద్దు తూర్పు వైపు నుండి పడమటి వైపు వరకు దాని సరిహద్దులో భాగంగా ఉంటుంది.

  11. ఆషేరు వారికి ఒక భాగం; అది తూర్పు నుండి పడమటి వరకు దానుకు సరిహద్దుగా ఉంటుంది.

  12. తూర్పు దిక్కున 4,500 మూరల పొడవుతో మూడు ద్వారాలు: యోసేపు ద్వారం, బెన్యామీను ద్వారం, దాను ద్వారము.

  13. సమరయ దోషానికి కారణమైనదాని తోడని, ‘దాను దేవుని తోడు’ అని, ‘బెయేర్షేబ దేవుని తోడు’ అని ప్రమాణం చేసేవారు మళ్ళీ లేవకుండా కూలిపోతారు.”