కంటెంట్‌కు వెళ్లండి

Wicked గురించి బైబిల్ వచనాలు

724 వచనాలు · 18 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. రక్షణ దుష్టులకు దూరం, ఎందుకంటే వారు మీ శాసనాలు వెదకరు.

  2. అయితే యెహోవా వంకర త్రోవలకు తిరిగేవారిని దుష్టులతో పాటు బహిష్కరిస్తారు. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండును గాక.

  3. కానీ నేను పిలిచినప్పుడు మీరు వినడానికి నిరాకరించినందున నేను నా చేయి చాచినప్పుడు ఎవరూ పట్టించుకోనందున,

  4. మీరు నా సలహాను లెక్కచేయనందున నా గద్దింపును అంగీకరించనందున,

  5. ఆపద మిమ్మల్ని తాకినప్పుడు నేను నవ్వుతాను; విపత్తు మిమ్మల్ని అధిగమించినప్పుడు నేను ఎగతాళి చేస్తాను,

  6. విపత్తు తుఫానులా మిమ్మల్ని అధిగమించినప్పుడు, ఆపద మిమ్మల్ని తుఫానులా ముంచినప్పుడు, మీకు బాధ ఇబ్బంది కలిగినప్పుడు నేను ఎగతాళి చేస్తాను.

  7. “అప్పుడు వారు నాకు మొరపెడతారు కాని నేను జవాబు ఇవ్వను; నా కోసం ఆతురతగా వెదకుతారు కాని నేను కనబడను,

  8. వారు జ్ఞానాన్ని అసహ్యించుకున్నారు, యెహోవాకు భయపడాలని వారు కోరలేదు కాబట్టి.

  9. వారు నా సలహాను అంగీకరించలేదు నా గద్దింపును కూడా త్రోసివేశారు కాబట్టి,

  10. దుష్టుల చెడు మార్గాల నుండి, మూర్ఖంగా మాట్లాడేవారి నుండి జ్ఞానం నిన్ను కాపాడుతుంది.

  11. అలాంటివారు చీకటిదారిలో నడవడానికి, తిన్నని మార్గాలను విడిచిపెడతారు.

  12. చెడు చేయడంలో సంతోషిస్తారు, దుర్మార్గుల మూర్ఖత్వాన్ని బట్టి ఆనందిస్తారు.

  13. వారి త్రోవలు సరియైనవి కావు వారు వంచనతో ఆలోచిస్తారు.

  14. జ్ఞానం నిన్ను వ్యభిచార స్త్రీ నుండి, మోహపు మాట్లాడే దారితప్పిన స్త్రీ నుండి కాపాడుతుంది.

  15. అలాంటి స్త్రీ తన యవ్వన కాలపు భర్తను విడిచిపెట్టి దేవుని ఎదుట తాను చేసిన ప్రమాణాన్ని నిర్లక్ష్యం చేస్తుంది.

  16. ఖచ్చితంగా దాని ఇల్లు మరణం దగ్గరకు నడిపిస్తుంది, దాని త్రోవలు చనిపోయినవారి దగ్గరకు దారితీస్తాయి.

  17. ఆ స్త్రీ దగ్గరకు వెళ్లిన ఎవరూ తిరిగి రారు జీవమార్గాలను వారు చేరుకోలేరు.

  18. కీడు చేయనిదే వారు నిద్రపోలేరు; ఎదుటివారిని పడవేయనిదే వారికి నిద్రరాదు.

  19. వంకర మాటలు మాట్లాడుతూ తిరిగేవాడు, పనికిరానివాడు దుష్టత్వం నిండిన మనుష్యుడు.

  20. వాడు ద్వేషపూరితంగా కన్నుగీటుతూ, తన పాదాలతో సైగలు చేస్తూ తన వ్రేళ్ళతో సంజ్ఞలు చేస్తాడు.

  21. అతడు తన హృదయంలో వికృత ఆలోచనలతో కీడును తలపెడతాడు, అతడు అన్ని సమయాల్లో వివాదాన్ని వ్యాప్తి చేస్తాడు.

  22. కాబట్టి దుష్టుని మీదికి విపత్తు అకస్మాత్తుగా వస్తుంది; వాడు తిరుగు లేకుండా ఆ క్షణమందే కూలిపోతాడు.

  23. నీతిమంతుల తల మీదికి ఆశీర్వాదాలు వస్తాయి, కాని దుర్మార్గుల నోరు హింసను దాచిపెడుతుంది.

  24. యథార్థంగా ప్రవర్తించేవారు క్షేమంగా జీవిస్తారు, కానీ మోసం చేసేవారు పట్టుబడతారు.

  25. నీతిమంతుల పెదవులు అనేకులకు మేలు చేస్తాయి, కాని బుద్ధిహీనులు తెలివిలేక చస్తారు.