కంటెంట్‌కు వెళ్లండి

Wicked గురించి బైబిల్ వచనాలు

724 వచనాలు · 18 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. బుద్ధిహీనులు దుష్ట పన్నాగాల్లో ఆనందిస్తారు, కాని వివేకంగలవారు జ్ఞానాన్నిబట్టి ఆనందిస్తారు.

  2. దుష్టులు దేనికి భయపడతారో అదే వారి మీదికి వస్తుంది, నీతిమంతులు ఆశించిందే వారికి ఇవ్వబడుతుంది.

  3. సుడిగాలి వచ్చినపుడు దుష్టులు లేకుండా పోతారు, కానీ నీతిమంతులు దృఢంగా నిలిచి ఉంటారు.

  4. నీతిమంతుల ఆశలు ఆనందాన్నిస్తాయి కాని దుష్టుల ఆశలు ఫలించవు.

  5. నింద లేనివారికి యెహోవా మార్గం ఒక ఆశ్రయం, కాని కీడు చేసేవారికి అది పతనము.

  6. నీతిమంతులు ఎన్నడు కదిలించబడరు, కాని దుష్టులు దేశంలో ఉండరు.

  7. నీతిమంతుల నోటికి దయ పొందడం తెలుసు, కాని దుష్టుల నోటికి వక్ర మాటలే తెలుసు.

  8. యథార్థవంతుల యథార్థత వారిని నడిపిస్తుంది, కానీ నమ్మకద్రోహులు వారి వంచనతో నాశనమవుతారు.

  9. నిందలేనివారి నీతి వారి మార్గాలను తిన్నవిగా చేస్తాయి, కాని దుష్టులు తమ దుష్టత్వాన్ని బట్టి పడిపోతారు.

  10. యథార్థవంతుల నీతి వారిని విడిపిస్తుంది, కాని నమ్మకద్రోహులు వారి చెడు కోరికల చేత పట్టబడతారు.

  11. నీతిమంతులు బాధ నుండి తప్పించబడతారు కాని దుష్టులు దానిలో పడతారు.

  12. నీతిమంతులు అభివృద్ధి చెందుట పట్టణానికి సంతోషకరం; దుష్టులు నశించినపుడు ఆనంద కేకలు వినబడతాయి.

  13. యథార్థవంతుని దీవెన వలన పట్టణం హెచ్చింపబడుతుంది, కాని దుష్టుని నోటి వలన అది నాశనమవుతుంది.

  14. దుష్టులు మోసపూరితమైన జీతం పొందుతారు, కానీ నీతిగా జీవించేవారు నిజంగా ప్రతిఫలాన్ని పొందుతారు.

  15. నీతిమంతుడు నిజంగా జీవాన్ని పొందుతాడు, చెడును వెంటాడేవాడు మరణాన్ని కనుగొంటాడు.

  16. వక్ర హృదయాలు గలవారిని యెహోవా అసహ్యించుకుంటారు, అయితే నిందారహితమైన మార్గాలు గలవారిని బట్టి ఆయన సంతోషిస్తారు.

  17. ఇది ఖచ్చితం అని తెలుసుకోండి: దుష్టులు శిక్షించబడకుండా తప్పించుకోరు, నీతిమంతులు విడిపించబడతారు.

  18. నీతిమంతుల కోరిక ఉత్తమమైనది, దుష్టుల కోరిక గర్వంతో నిండి ఉంటుంది.

  19. నీతిమంతులు భూమి మీద తమ ప్రతిఫలం పొందితే, భక్తిహీనులు, పాపాత్ముల గతి ఖచ్చితంగా అలాగే ఉంటుంది కదా!

  20. చెడుతనం ద్వారా మనుష్యులు స్ధిరపరచబడరు, అయితే నీతిమంతులు ఎప్పటికిని పెరికివేయబడరు.

  21. నీతిమంతుల ఆలోచనలు న్యాయమైనవి దుష్టుల సలహాలు మోసకరమైనవి.

  22. దుష్టుల మాటలు ఒక హత్యకు పొంచి ఉన్న వారి లాంటివి, యథార్థవంతుల మాటలు వారిని విడిపిస్తాయి.

  23. దుష్టులు చనిపోయి కనుమరుగవుతారు, అయితే నీతిమంతుల ఇల్లు స్థిరంగా నిలుస్తుంది.

  24. కీడుచేసేవారు వారి పాపిష్ఠి మాటచేత చిక్కుకుంటారు, నిర్దోషులు ఆపద నుండి తప్పించుకుంటారు.

  25. నీతిమంతులకు ఏ ఆపద రాదు దుష్టులువాని ఇల్లు కీడుతో నిండి ఉంటుంది.