కంటెంట్‌కు వెళ్లండి

Wicked గురించి బైబిల్ వచనాలు

724 వచనాలు · 18 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. నీతిమంతులు తమ పొరుగువారికి దారి చూపుతారు, కానీ దుష్టుని ప్రవర్తన వానిని దారి తప్పిస్తుంది.

  2. నీతి నిజాయితీగల వ్యక్తిని కాపాడుతుంది, కాని దుష్టత్వం పాపిని పడగొడుతుంది.

  3. బోధను ఎగతాళి చేసేవారు తగిన మూల్యం చెల్లిస్తారు, కాని ఆజ్ఞను గౌరవించేవారు ఫలం పొందుతారు.

  4. దుష్టులైన దూతలు కీడు చేయడానికి లోబడతారు, నమ్మకమైన రాయబారులు స్వస్థత కలిగిస్తారు.

  5. ఆశ తీరుట వలన ప్రాణానికి తీపి చెడుతనాన్ని విడిచిపెట్టడం బుద్ధిలేనివారికి అసహ్యము.

  6. కష్టం పాపులను వెంటాడుతుంది, నీతిమంతులకు మేలు ప్రతిఫలంగా వచ్చును.

  7. పాపానికి సవరణలు చేయడంలో మూర్ఖులు ఎగతాళి చేస్తారు, కాని యథార్థవంతులు ఆయన నుండి దయ పొందుతారు.

  8. చెడ్డవారు మంచివారి ఎదుటను, దుష్టులు నీతిమంతుల గుమ్మాల దగ్గర వంగుతారు.

  9. కీడు తలపెట్టేవారు తప్పిపోతారు? మేలు చేసేవారు, కృపా సత్యములను పొందుతారు.

  10. అపాయం వచ్చినప్పుడు దుష్టులు నశిస్తారు, చనిపోయే సమయంలో కూడ నీతిమంతులకు దేవునిలో ఆశ్రయం దొరుకుతుంది.

  11. నీతిమంతుని ఇంట్లో గొప్ప ధననిధి ఉన్నది, కాని దుష్టుని కలుగు వచ్చుబడి కష్టానికి కారణము.

  12. భక్తిలేనివారు అర్పించు బలులు యెహోవాకు అసహ్యం, అయితే యథార్థవంతుల ప్రార్ధన ఆయనకు సంతోషకరము.

  13. దుష్టుల మార్గాన్ని యెహోవా అసహ్యించుకుంటారు, నీతిని అనుసరించేవారిని ఆయన ప్రేమిస్తారు.

  14. దారితప్పిన వానికి కఠిన శిక్ష కలుగును, గద్దింపును ద్వేషించువారు చావునొందుదురు.

  15. భక్తిహీనులకు యెహోవా దూరంగా ఉంటారు, నీతిమంతుల ప్రార్ధన ఆయన అంగీకరిస్తారు.

  16. బీదల మొర వినకుండ చెవులు మూసుకునేవాడు, తాను మొరపెట్టినప్పుడు జవాబు రాదు.

  17. నీతిమంతుల కోసం భక్తిలేనివారు, అలాగే యథార్థవంతులకు నమ్మకద్రోహులు క్రయధనమవుతారు.

  18. పగలంతా వారు మరింత కావాలని కోరుకుంటారు, కాని నీతిమంతులు మిగుల్చుకోకుండ ఇస్తారు.

  19. దుష్టుల బలులు అసహ్యం, చెడు ఉద్దేశంతో అర్పిస్తే ఇంకెంత అసహ్యమో!

  20. దుష్టుల మార్గాల్లో వలలు, ఆపదలు ఉన్నాయి, అయితే తమ ప్రాణాలు కాపాడుకునేవారు వాటికి దూరముగా ఉంటారు.

  21. బుద్ధిహీనున్ని రోటిలోని గోధుమలలో వేసి రోకటితో దంచినా సరే వాని మూర్ఖత్వం వదిలిపోదు.

  22. ఎవడు వెంటాడకుండానే దుష్టులు పారిపోతారు, కాని నీతిమంతులు సింహంలా ధైర్యంగా నిలబడతారు.

  23. బోధనను విడిచిపెట్టిన వారు దుష్టులను పొగడుతారు, కాని దానిని లక్ష్యపెట్టేవారు దుష్టులను వ్యతిరేకిస్తారు.

  24. కీడుచేసేవారు సరియైనది గ్రహించరు, కాని యెహోవాను ఆశ్రయించువారు దాన్ని పూర్తిగా గ్రహిస్తారు.

  25. ఒకవేళ ఎవరైనా నా బోధను పెడచెవిని పెడితే, వారి ప్రార్థనలు కూడా అసహ్యకరమైనవి.