Skip to content

Tyre గురించి బైబిల్ వచనాలు

113 వచనాలు · 47 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. వారంతా గొంతెత్తి నీ గురించి ఏడుస్తారు; తమ తలలపై బూడిద చల్లుకుని బూడిదలో దొర్లుతారు.

  2. నీ గురించి వారు తమ తలలు గొరిగించుకుని గోనెపట్టలు కట్టుకుని తీవ్రమైన దుఃఖంతో నీ గురించి ఏడుస్తారు;

  3. వారు నీ గురించి ఏడుస్తూ విలాప గీతం పాడతారు: “సముద్రం మధ్యలో మునిగిపోయిన తూరు పట్టణమా! నీకు సాటియైన పట్టణమేదీ?”

  4. సముద్రం మీద నీ వస్తువులు తీసుకెళ్తూ, అనేకమందిని తృప్తిపరిచావు; నీ విస్తారమైన సంపదతో నీ వ్యాపార వస్తువులతో భూరాజులను ఐశ్వర్యవంతులను చేశావు.

  5. ఇప్పుడు లోతైన జలాల్లో మునిగి సముద్రంలో నాశనమయ్యావు; నీ వస్తువులు నీ సహచరులు నీతో పాటే మునిగిపోయారు.

  6. తీరప్రాంతాలలో ఉన్నవారంతా నీ గురించి దిగులుపడతారు; వారి రాజులు వణకుతారు. వారి ముఖాలు చిన్నబోయాయి.

  7. వివిధ ప్రజల మధ్యలో వర్తకులు నిన్ను ఎగతాళి చేస్తారు. నీవు భయంకరమైన ముగింపుకు వచ్చావు, పూర్తిగా నాశనం అవుతావు.’ ”

  8. “మనుష్యకుమారుడా, తూరు పాలకునితో ఇలా చెప్పు, ‘ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: “ ‘గర్వించిన హృదయంతో నీవు, “నేనొక దేవుడిని; సముద్రం మధ్యలో ఒక దేవుని సింహాసనం మీద నేను కూర్చున్నాను” అని అన్నావు. దేవునిలా నీవు జ్ఞానివి అనుకుంటున్నావు, కాని నీవు కేవలం ఒక మనిషివి మాత్రమే దేవునివి కాదు.

  9. నీవు దానియేలు కన్నా జ్ఞానివా? నీకు తెలియని రహస్యం ఏదీ లేదా?

  10. నీకున్న జ్ఞానంతో వివేకంతో నీకోసం సంపద సంపాదించుకుని నీ ఖజానాలో వెండి బంగారాలను పోగు చేసుకున్నావు.

  11. వ్యాపారంలో నీకున్న గొప్ప నైపుణ్యంతో నీ సంపదను వృద్ధి చేసుకున్నావు, నీ సంపదను బట్టి నీవు హృదయంలో గర్వించావు.

  12. “ ‘కాబట్టి ప్రభువైన యెహోవా ఇలా అంటున్నారు: “ ‘దేవునిలా నీవు జ్ఞానివి అనుకుంటున్నావు కాబట్టి,

  13. నేను నీమీదికి విదేశీయులను, అత్యంత క్రూరులైన జనాంగాలను రప్పించబోతున్నాను; నీ జ్ఞానంతో నీవు సౌందర్యంగా నిర్మించుకున్న వాటి మీద ఖడ్గాన్ని దూసి, నీ వైభవాన్ని ద్వంసం చేస్తారు.

  14. వారు నిన్ను పాతాళంలో పడవేస్తారు. సముద్రం మధ్యలో భయంకరంగా చనిపోతావు.

  15. నీ సౌందర్యం చూసుకుని నీ హృదయం గర్వించింది నీ వైభవం కారణంగా నీ జ్ఞానం కలుషితమయ్యింది, కాబట్టి నేను నిన్ను భూమి మీద పడవేస్తాను. రాజులు నిన్ను చూసేలా నేను నిన్ను వారి ఎదుట ఉంచుతాను.

  16. నీ అన్యాయమైన వ్యాపారంతో నీవు చేసిన అనేక పాపాల వలన, నీ పరిశుద్ధాలయాలను అపవిత్రం చేశావు. కాబట్టి నీలో అగ్ని పుట్టిస్తాను. అది నిన్ను కాల్చివేస్తుంది, చూస్తున్న వారందరి ఎదుట నేను నిన్ను నేల మీద బూడిదగా చేస్తాను.

  17. “మనుష్యకుమారుడా, తూరు పట్టణం మీద బబులోను రాజైన నెబుకద్నెజరు తన సైన్యంతో దండెత్తి చాలా బాధాకరమైన పని చేయించాడు. వారందరి తలలు బోడివయ్యాయి. అందరి భుజాలు కొట్టుకుపోయాయి. అయినా తూరు పట్టణం మీదికి అతడు తెచ్చిన నష్టాన్ని బట్టి అతనికి అతని సైన్యానికి ప్రతిఫలం కూడా దొరకలేదు.

  18. కాబట్టి ప్రభువైన యెహోవా చెబుతున్న మాట ఇదే: ఈజిప్టు దేశాన్ని బబులోను రాజైన నెబుకద్నెజరుకు నేను అప్పగిస్తున్నాను. అతడు దాని ఆస్తిని తీసుకుని దాని సొమ్మును దోచుకొని కొల్లగొడతాడు. అదే అతని సైన్యానికి జీతం అవుతుంది.

  19. అతడు అతని సైన్యం నా కోసమే శ్రమించారు కాబట్టి అతడు చేసిన దానికి ప్రతిఫలంగా బహుమానంగా ఈజిప్టు దేశాన్ని అతనికి అప్పగించాను. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.

  20. “తూరూ, సీదోనూ, ఫిలిష్తియా ప్రాంతాలందరూ, నా మీద మీకున్న వ్యతిరేకత ఏంటి? నేను చేసిన దానికి నాకు ప్రతీకారం చేస్తున్నారా? ఒకవేళ మీరు నాకు ప్రతీకారం చేస్తే, మీరు చేసిన దాన్ని త్వరలోనే, చాలా వేగంగా మీ తల మీదికి రప్పిస్తాను.

  21. ఎందుకంటే మీరు నా వెండి బంగారాలను తీసుకెళ్లారు, నా శ్రేష్ఠమైన వస్తువులను మీ గుళ్ళకు తీసుకెళ్లారు.

  22. యూదా, యెరూషలేము ప్రజలు తమ ప్రాంతానికి దూరం ఉండాలని వారిని గ్రీకులకు అమ్మివేశారు.

  23. “చూడండి, మీరు వారిని అమ్మి వేసిన స్థలాల నుండి వారిని రప్పిస్తాను. మీరు చేసిన దాన్ని మీ తల మీదికే రప్పిస్తాను.

  24. నేను మీ కుమారులను, కుమార్తెలను యూదా ప్రజలకు అమ్ముతాను, వారు దూర దేశస్థులైన షెబాయీయులకు వారిని అమ్మివేస్తారు.” యెహోవా చెప్పింది ఇదే.

  25. యెహోవా ఇలా చెప్తున్నారు: “తూరు చేసిన మూడు పాపాల గురించి, దాని నాలుగు పాపాల గురించి నేను దానిని తప్పకుండా శిక్షిస్తాను. ఎందుకంటే సహోదర ఒప్పందాన్ని పరిగణించకుండా, అది సమాజమంతటిని బందీలుగా ఎదోముకు అమ్మివేసింది.