కంటెంట్‌కు వెళ్లండి

Tyre గురించి బైబిల్ వచనాలు: To be destroyed by the king of Babylon

11 వచనాలు · 47 కోణాలు

To be destroyed by the king of Babylon గురించి వచనాలు

  1. బబులోనీయుల దేశాన్ని చూడు, వారు తమ గుర్తింపును కోల్పోయారు! అష్షూరీయులు దానిని ఎడారి జీవులకు నివాసంగా చేశారు. వారు దానిలో ముట్టడి గోపురాలు కట్టించి, దాని కోటలు పడగొట్టి శిథిలాలుగా మార్చారు.

  2. తర్షీషు ఓడలారా, రోదించండి; మీ కోట నాశనమయ్యింది.

  3. యూదా రాజైన సిద్కియా దగ్గరకు యెరూషలేముకు వచ్చిన రాయబారులతో ఎదోము, మోయాబు, అమ్మోను, తూరు, సీదోను రాజులకు కబురు పంపించు.

  4. ఇప్పుడు నేను నీ దేశాలన్నిటిని నా సేవకుడు బబులోను రాజైన నెబుకద్నెజరు చేతికి అప్పగిస్తాను; అడవి జంతువులను కూడా అతనికి లోబడి చేస్తాను.

  5. “ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: ఉత్తరం నుండి నేను రాజుల రాజు, బబులోను రాజైన నెబుకద్నెజరును గుర్రాలు రథాలు, గుర్రపురౌతులు గొప్ప సైన్యంతో తూరు మీదికి రప్పించబోతున్నాను.

  6. అతడు ఖడ్గంతో ప్రధాన భూభాగంలో మీ నివాసాలను నాశనం చేస్తాడు; అతడు మీకు వ్యతిరేకంగా ముట్టడి పనులను ఏర్పాటు చేస్తాడు, మీ గోడలకు ముట్టడి దిబ్బలను ఏర్పాటు చేస్తాడు.

  7. అతడు మీ గోడల మీదికి తన పడగొట్టే యంత్రాలను పంపుతాడు, తన ఆయుధాలతో మీ గోపురాలను కూల్చివేస్తాడు.

  8. అతనికి ఉన్న గుర్రాలు రేపిన దుమ్ము నిన్ను కమ్ముతుంది. ఒకడు పగిలిన గోడలున్న పట్టణంలోకి ప్రవేశించినట్లు అతడు నీ గుమ్మాల్లోకి వచ్చినప్పుడు గుర్రపురౌతుల నుండి రథచక్రాల నుండి వచ్చే శబ్దానికి నీ గోడలు అదురుతాయి.

  9. అతడు తన గుర్రాల డెక్కలతో నీ వీధులన్నిటిని అణగద్రొక్కిస్తాడు. కత్తితో నీ ప్రజలను చంపుతాడు. నీ బలమైన స్తంభాలు నేల కూలిపోతాయి.

  10. వారు నీ సంపదను దోచుకుంటారు నీ వస్తువులను దొంగిలిస్తారు. వారు నీ గోడలను కూల్చివేసి, నీ విలాసవంతమైన భవనాలను పడగొట్టి, నీ రాళ్లను కలపను సముద్రంలోకి విసిరివేస్తారు.

  11. నేను నీ సంగీతాన్ని ఆపివేస్తాను. నీ సితార శబ్దం ఇకపై వినపడదు.