కంటెంట్‌కు వెళ్లండి

Tyre గురించి బైబిల్ వచనాలు: All nations to be terrified at its destruction

13 వచనాలు · 47 కోణాలు

All nations to be terrified at its destruction గురించి వచనాలు

  1. “తూరు గురించి ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: నీవు కూలిపోయినప్పుడు నీలో నుండి వచ్చే గాయపడినవారి కేకలు, నీ మధ్య జరుగుతున్న ఊచకోతను విని తీరప్రాంతాలు వణకవా?

  2. తీరప్రాంతపు అధికారులందరూ తమ సింహాసనాల మీది నుండి దిగి, వారి వస్త్రాలను, చేతికుట్టుతో చేసిన వస్త్రాలను తీసివేసి, భయంతో నేలపై కూర్చుని గడగడ వణకుతూ నీ గురించి ఆందోళన చెందుతారు.

  3. నీ గురించి విలాప గీతం ఎత్తి ఇలా పాడతారు: “ ‘సముద్ర ప్రజలతో నిండిన గొప్ప పట్టణమా! నీవెలా నాశనమైపోయావు! నీవు నీ నివాసులు సముద్రాల మీద బలవంతులుగా ఉన్నారు, అక్కడ నివసించిన వారందరిపై నీవు నీ భయాన్ని ఉంచావు.

  4. ఇప్పుడు నీవు కూలిపోయిన రోజున తీరప్రాంతాలు కంపిస్తున్నాయి. నీవు పతనాన్ని చూసి సముద్ర ద్వీపాలు భయపడుతున్నాయి.’

  5. తెడ్డు నడిపే వారందరూ నావికులు, ఓడ నాయకులు తమ ఓడల మీద నుండి దిగివచ్చి తీరాన నిలబడతారు.

  6. వారంతా గొంతెత్తి నీ గురించి ఏడుస్తారు; తమ తలలపై బూడిద చల్లుకుని బూడిదలో దొర్లుతారు.

  7. నీ గురించి వారు తమ తలలు గొరిగించుకుని గోనెపట్టలు కట్టుకుని తీవ్రమైన దుఃఖంతో నీ గురించి ఏడుస్తారు;

  8. వారు నీ గురించి ఏడుస్తూ విలాప గీతం పాడతారు: “సముద్రం మధ్యలో మునిగిపోయిన తూరు పట్టణమా! నీకు సాటియైన పట్టణమేదీ?”

  9. సముద్రం మీద నీ వస్తువులు తీసుకెళ్తూ, అనేకమందిని తృప్తిపరిచావు; నీ విస్తారమైన సంపదతో నీ వ్యాపార వస్తువులతో భూరాజులను ఐశ్వర్యవంతులను చేశావు.

  10. ఇప్పుడు లోతైన జలాల్లో మునిగి సముద్రంలో నాశనమయ్యావు; నీ వస్తువులు నీ సహచరులు నీతో పాటే మునిగిపోయారు.

  11. తీరప్రాంతాలలో ఉన్నవారంతా నీ గురించి దిగులుపడతారు; వారి రాజులు వణకుతారు. వారి ముఖాలు చిన్నబోయాయి.

  12. వివిధ ప్రజల మధ్యలో వర్తకులు నిన్ను ఎగతాళి చేస్తారు. నీవు భయంకరమైన ముగింపుకు వచ్చావు, పూర్తిగా నాశనం అవుతావు.’ ”

  13. అష్కెలోను దానిని చూసి భయపడుతుంది; గాజా వేదనతో విలపిస్తుంది ఎక్రోను కూడా తన నిరీక్షణ కోల్పోతుంది. గాజా తన రాజును కోల్పోతుంది అష్కెలోను ఎడారిగా మారుతుంది.