కంటెంట్‌కు వెళ్లండి

The Tribe Of Simeon గురించి బైబిల్ వచనాలు

50 వచనాలు · 21 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. రెండవ చీటి షిమ్యోను గోత్రానికి దాని వంశాల ప్రకారం వచ్చింది. వారి వారసత్వం యూదా భూభాగంలో ఉంది.

  2. వారి వారసత్వంలో ఇవి కూడా ఉన్నాయి: బెయేర్షేబ (లేదా షేబ), మొలాదా,

  3. హజర్-షువలు, బాలా, ఎజెము,

  4. ఎల్తోలదు, బేతూలు, హోర్మా,

  5. సిక్లగు, బేత్-మర్కాబోతు, హజర్-సూసా,

  6. బేత్-లెబయోతు, షారుహెను అనేవి మొత్తం పదమూడు పట్టణాలు, వాటి గ్రామాలు,

  7. ఆయిను, రిమ్మోను, ఎతెరు, ఆషాను, మొత్తం నాలుగు పట్టణాలు, వాటి గ్రామాలు.

  8. ఈ పట్టణాల చుట్టూరా బాలత్-బెయేరు (దక్షిణాన ఉన్న రామా) వరకు ఉన్న గ్రామాలన్నీ.

  9. యూదా గోత్రం వారు తమ తోటి ఇశ్రాయేలీయులైన షిమ్యోను గోత్రం వారితో, “మాకు కేటాయించబడిన భూభాగంలో ఉన్న కనానీయులతో యుద్ధానికి మాతో పాటు రండి. అలాగే మీతో పాటు మేము కూడా మీ భూభాగం కోసం వస్తాం” అన్నారు. కాబట్టి షిమ్యోనీయులు వారితో వెళ్లారు.

  10. తర్వాత యూదా వారు తమ తోటి ఇశ్రాయేలీయులైన షిమ్యోనీయులతో వెళ్లి జెఫతులో నివసిస్తున్న కనానీయులపై దాడి చేసి, పట్టణాన్ని పూర్తిగా నాశనం చేశారు. కాబట్టి ఆ పట్టణానికి హోర్మా అని పేరు పెట్టారు.

  11. వారు బెయేర్షేబ, మొలాదా, హజర్-షువలు,

  12. బిల్హా, ఎజెము, తోలాదు,

  13. బెతూయేలు, హోర్మా, సిక్లగు,

  14. బేత్-మర్కాబోతు, హజర్-సూసీము, బేత్-బీరి, షరాయిము అనే పట్టణాల్లో నివసించారు. దావీదు పరిపాలన వరకు వారి పట్టణాలు ఇవే.

  15. ఏతాము, ఆయిను, రిమ్మోను, తోకెను, ఆషాను అనే అయిదు గ్రామాలు వారి చుట్టూ ఉండేవి,

  16. బయలు వరకు ఆ పట్టణాల చుట్టూ ఉన్న గ్రామాలన్నీ వారివి. ఇవి వారి నివాసస్థలాలు.

  17. వారు తమ మందల కోసం మేత వెదకడానికి లోయలో తూర్పుగా ఉన్న గెదోరు పొలిమేర వరకు వెళ్లారు.

  18. వారికి అక్కడ మంచి పుష్టికరమైన మేత దొరికింది. ఆ ప్రాంతం విశాలంగా, నెమ్మదిగా, ప్రశాంతంగా ఉంది. గతంలో హాము వంశీయులు కొంతమంది అక్కడ నివసించారు.

  19. జాబితాలో పేర్లు వ్రాయబడిన వీరు యూదా రాజైన హిజ్కియా కాలంలో అక్కడికి వచ్చారు. అక్కడ ఉన్న హాము వంశీయుల మెయునీయుల నివాసాలపై దాడి చేసి వారిని పూర్తిగా నాశనం చేసి, ఈ రోజు వరకు వారు అక్కడే స్థిరపడ్డారు, ఎందుకంటే వారి మందలకు సరిపోయేంత పచ్చిక అక్కడ ఉంది.

  20. ఈ షిమ్యోను వంశీయులలో అయిదువందల మంది శేయీరు కొండ ప్రాంతాన్ని ఆక్రమించుకున్నారు. ఇషీ కుమారులైన పెలట్యా, నెయర్యా, రెఫాయా, ఉజ్జీయేలు వారికి నాయకులు.

  21. అమాలేకీయులలో తప్పించుకున్న మిగిలిన వారందరిని చంపి, ఈ రోజు వరకు వారక్కడ నివసించారు.

  22. షిమ్యోనీయులలో యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్న వీరులు 7,100 మంది;

  23. ఇశ్రాయేలీయుల గోత్రాల నాయకులు: రూబేనీయులమీద: జిఖ్రీ కుమారుడైన ఎలీయెజెరు; షిమ్యోనీయుల మీద: మయకా కుమారుడైన షెఫట్యా;

  24. అతని దేవుడైన యెహోవా ఆసాకు తోడుగా ఉండడం చూసి పెద్ద సంఖ్యలో ఇశ్రాయేలు రాజ్యాన్ని విడచి అతని పక్షం చేరారు. ఆసా తన దగ్గరకు యూదా వారందరినీ బెన్యామీను వారందరినీ వారి మధ్య నివసిస్తున్న ఎఫ్రాయిం, మనష్షే, షిమ్యోను గోత్రాల వారిని సమకూర్చాడు.

  25. మనష్షే, ఎఫ్రాయిం, షిమ్యోను, నఫ్తాలి పట్టణాల వరకు వాటి చుట్టూ ఉన్న శిథిలాల్లో,