కంటెంట్‌కు వెళ్లండి

The Providence of God గురించి బైబిల్ వచనాలు

163 వచనాలు · 41 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. దేవుని ఊపిరి మంచును పుట్టిస్తుంది, మహా సముద్ర ఉపరితలాలు గడ్డకడతాయి.

  2. ఆయన దట్టమైన మేఘాలను తేమతో నింపుతారు; మేఘాలలో తన మెరుపులను వ్యాపింపజేస్తారు.

  3. భూమి అంతటి ఉపరితలం మీద ఆయన ఆజ్ఞాపించిన వాటన్నిటిని చేయడానికి, ఆయన నిర్దేశించిన మార్గంలో అవి చుట్టూ తిరుగుతాయి.

  4. ప్రజలను శిక్షించడానికి లేదా తన భూమికి నీళ్లు పోయడానికి, తన ప్రేమను చూపించడానికి ఆయన మేఘాలను రప్పిస్తారు.

  5. ఎల్లప్పుడు నేను నా ఎదుట యెహోవాను చూస్తున్నాను. ఆయన నా కుడి ప్రక్కనే ఉన్నారు, కాబట్టి నేను కదల్చబడను.

  6. నా బ్రతుకంతా మీ చేతిలోనే ఉంది; నన్ను వెంటాడే వారి నుండి, నా శత్రువుల చేతుల్లో నుండి నన్ను విడిపించండి.

  7. యెహోవా దేశాల ప్రణాళికలను విఫలం చేస్తారు; ప్రజల ఉద్దేశాలను ఆయన అడ్డుకుంటారు.

  8. మీ నీతి దేవుని ఉన్నత పర్వతాల్లా, మీ న్యాయం అగాధ సముద్రంలా ఉన్నాయి. యెహోవా! మీరు మనుష్యులను జంతువులను సంరక్షిస్తున్నారు.

  9. యెహోవా నీతిమంతులను ప్రేమిస్తారు తన నమ్మకస్థులను ఆయన విడిచిపెట్టరు. ఆయన వారిని శాశ్వతంగా భద్రపరుస్తారు; కాని దుష్టుల సంతానం నశిస్తుంది.

  10. మీరు నా దినాలను కేవలం బెత్తెడంత చేశారు; నా జీవితకాలం మీ ఎదుట శూన్యము. భద్రత గలవారిగా అనిపించినా, మనుష్యులంతా కేవలం ఊపిరి వంటివారు. సెలా

  11. ఇదంతా నేను అర్థం చేసుకోవాలని ప్రయత్నించినప్పుడు, నేను దేవుని పరిశుద్ధాలయంలో ప్రవేశించే వరకు అది నన్ను గాఢంగా ఇబ్బంది పెట్టింది; అప్పుడు నేను వారి చివరి గమ్యమేంటో గ్రహించాను.

  12. తూర్పు నుండి కాని పడమర నుండి కాని అరణ్యం నుండి కాని ఎవరూ తమను తాము హెచ్చించుకోలేరు.

  13. దేవుడే తీర్పు తీరుస్తారు: ఆయన ఒకని తగ్గిస్తారు, మరొకని హెచ్చిస్తారు.

  14. మీ అడుగుజాడలు కనిపించనప్పటికీ, మీ మార్గం సముద్రం గుండా, శక్తివంతమైన జలాల గుండా వెళ్లింది.

  15. వేటగాని వల నుండి, మరణకరమైన తెగులు నుండి, ఆయన తప్పక విడిపిస్తారు.

  16. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పుతారు, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం; ఆయన నమ్మకత్వం నీకు డాలుగాను గోడగాను ఉంటుంది.

  17. నీ మార్గాలన్నిటిలో నిన్ను కాపాడమని నీ గురించి ఆయన తన దూతలకు ఆజ్ఞాపిస్తారు.

  18. భూమిని దాని పునాదులపై నిలిపారు; అది ఎన్నటికి కదలదు.

  19. మీరు దానిని ఒక వస్త్రంలా నీటి అగాధాలతో కప్పారు; జలాలు పర్వతాలకు పైగా నిలిచాయి.

  20. మీ మందలింపుతో జలాలు పారిపోయాయి, మీ ఉరుముల ధ్వనికి పలాయనం చిత్తగించాయి;

  21. అవి పర్వతాలకు మీదుగా వెళ్లాయి, అవి లోయల్లోకి దిగిపోయాయి, వాటికి మీరు నిర్ణయించిన చోటుకు అవి చేరుకున్నాయి.

  22. అవి దాటలేని సరిహద్దును మీరు ఏర్పరిచారు; అవి ఎన్నటికి భూమిని ముంచివేయవు.

  23. సకాలంలో మీరు వాటికి వాటి ఆహారం పెడతారని, జీవులన్నీ మీ వైపే చూస్తున్నాయి.

  24. మీరు దానిని వారికి ఇచ్చినప్పుడు, అవి సమకూర్చుకుంటాయి; మీరు గుప్పిలి విప్పి పెడుతుంటే అవి తిని తృప్తి చెందుతాయి.

  25. మీ శాసనాలను నేను ధ్యానిస్తాను మీ మార్గాలను పరిగణిస్తాను.