Skip to content

Slander గురించి బైబిల్ వచనాలు

116 వచనాలు · 71 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. మోసం చేసేవాడా, నీ నాలుక పదునైన క్షౌరం చేసే కత్తి; అది నాశనాన్ని చేస్తుంది.

  2. మోసపూరితమైన నాలుక గలవాడా, నీకు హానికరమైన మాటలే ఇష్టం.

  3. రహస్యంగా తమ పొరుగువారిపై అభాండాలు వేసేవారిని, నేను నాశనం చేస్తాను. అహంకారపు కళ్లు, గర్వించే హృదయం గలవారిని నేను సహించను.

  4. ఎందుకంటే దుష్టులు మోసగాళ్ళు నాకు వ్యతిరేకంగా తమ నోళ్ళు తెరిచి; అబద్ధాలాడే నాలుకలతో వారు నాకు వ్యతిరేకంగా మాట్లాడారు.

  5. ద్వేషపూరిత మాటలతో వారు నన్ను చుట్టుముడతారు; వారు కారణం లేకుండా నా మీద దాడి చేస్తారు.

  6. నా మీద నేరం మోపేవారికి నా గురించి చెడుగా మాట్లాడేవారికి, యెహోవా వారికి జీతం చెల్లించును గాక.

  7. వారు పాము నాలుకలా వారి నాలుకను పదును చేసుకుంటారు; వారి పెదవుల క్రింద సర్పాల విషం ఉంది. సెలా

  8. యెహోవాకు హేయమైనవి ఆరు, ఆయనకు హేయమైనవి ఏడు కలవు.

  9. అబద్ధాలు చెప్పే అబద్ధసాక్షి, సమాజంలో గొడవ రేపే వ్యక్తి.

  10. పగను దాచిపెట్టేవారు అబద్ధికులు, ఇతరుల మీద నిందలు వేసేవారు మూర్ఖులు.

  11. దుష్టులువాడు తన నోటి మాట వలన తన పొరుగువానికి నాశనం కలుగుతుంది, తెలివిచేత నీతిమంతులు తప్పించుకుంటారు.

  12. నిర్లక్ష్యపు మాటలు ఖడ్గాల్లా గుచ్చుతాయి, కాని జ్ఞానుల నాలుకలు స్వస్థత కలిగిస్తాయి.

  13. మూర్ఖులు తగవు రేపుతారు, పుకార్లు సన్నిహితులైన స్నేహితులను వేరు చేస్తాయి.

  14. ప్రేమను పెంచాలని కోరేవారు నేరాలు దాచిపెడతారు, జరిగిన వాటిని మాటిమాటికి జ్ఞాపకం చేసేవాడు గాఢ స్నేహితులను విడగొడతారు.

  15. పనికిమాలిన మాటలు రుచిగల పదార్థాల్లాంటివి అవి అంతరంగం లోనికి దిగిపోతాయి.

  16. తన పొరుగువాని మీద అబద్ధసాక్ష్యం చెప్పేవాడు సమ్మెట ఖడ్గము లేదా వాడిగల బాణాన్ని పోలినవాడు.

  17. ఊహించని వర్షాన్ని తెచ్చే ఉత్తర గాలిలా కపటమైన నాలుక భయానకంగా కనిపించేలా చేస్తుంది.

  18. కట్టెలు లేకపోతే నిప్పు ఆరిపోతుంది; అబద్ధాలు చెప్పేవాడు లేకపోతే తగాదా చల్లారుతుంది.

  19. పనికిమాలిన మాటలు రుచిగల పదార్థాల్లాంటివి అవి అంతరంగం లోనికి దిగిపోతాయి.

  20. ఒకవేళ లొంగదీయక ముందే పాము కాటేస్తే, పాములు ఆడించేవానికి లాభం ఉండదు.

  21. అవివేకంతో మొదలైన వారి మాటలు; దుర్మార్గపు వెర్రితనంతో ముగుస్తాయి;

  22. వారంతా మొండి తిరుగుబాటుదారులు, వారు అభాండాలు వేస్తూ తిరుగుతున్నారు. వారు ఇత్తడి, ఇనుము లాంటివారు; వారంతా అవినీతికి పాల్పడుతున్నారు.

  23. “ప్రతి ఒక్కరూ తన పొరుగువారి విషయంలో జాగ్రత్తగా ఉండాలి; బంధువుల్లో ఎవరినీ కూడా నమ్మవద్దు, ఎందుకంటే వారిలో ప్రతివాడు ఒక మోసగాడు, స్నేహితుడు స్నేహితుని మీద అపనిందలు వేస్తాడు.

  24. చాలామంది గుసగుసలాడడం విన్నాను, “అన్ని వైపుల భయం! అతన్ని ఖండించండి! అతన్ని ఖండిద్దాము.” నా స్నేహితులందరూ నేను జారిపడాలని చూస్తూ ఉన్నారు, “బహుశా అతడు మోసపోవచ్చు; అప్పుడు మనం అతనిపై విజయం సాధించి అతని మీద పగ తీర్చుకుందాము.”

  25. అప్పుడు ఆ అధికారులు రాజుతో, “ఈ వ్యక్తికి మరణశిక్ష విధించాలి. ఇతడు ఈ పట్టణంలో మిగిలి ఉన్న సైనికులను, అలాగే ప్రజలందరినీ తాను వారితో చెప్పే మాటల ద్వార నిరుత్సాహపరుస్తున్నాడు. ఈ వ్యక్తి ఈ ప్రజల క్షేమం కోరడంలేదు, వారి పతనాన్ని కోరుతున్నాడు.”