Skip to content

Slander గురించి బైబిల్ వచనాలు

116 వచనాలు · 71 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. పర్షియా రాజైన అర్తహషస్త పరిపాలిస్తున్న సమయంలో బిష్లాము, మిత్రిదాతు, టాబెయేలు వారి సహచరులు అర్తహషస్తకు ఉత్తరం వ్రాశారు. ఆ ఉత్తరం అరామిక్ లిపిలో, అరామిక్ భాషలో వ్రాయబడింది.

  2. ప్రభుత్వ అధికారి రెహూము, కార్యదర్శి షింషయి, యెరూషలేము వారి మీద ఫిర్యాదు చేస్తూ రాజైన అర్తహషస్తకు ఇలా ఉత్తరం వ్రాశారు:

  3. ప్రభుత్వ అధికారి రెహూము, కార్యదర్శి షింషయి, వారి తోటి ఉద్యోగులు అనగా పర్షియా, ఎరెకు, బబులోను, షూషనుకు చెందిన ఏలామీయుల న్యాయాధిపతులు, అధికారులు,

  4. గొప్పవాడు గౌరవనీయుడైన ఆస్నప్పరు విడుదల చేయగా, సమరయ పట్టణంలో యూఫ్రటీసు నదిని అవతల నివసించే ఇతర ప్రజలు వ్రాస్తున్న ఉత్తరము.

  5. (ఇది వారు రాజుకు వ్రాసిన ఉత్తరానికి నకలు.) రాజైన అర్తహషస్తకు, యూఫ్రటీసు నది అవతల ఉంటున్న మీ సేవకులు వ్రాస్తున్న ఉత్తరము.

  6. రాజైన మీరు తెలుసుకోవలసింది ఏంటంటే, మీ దగ్గర నుండి మా దగ్గరకు వచ్చిన యూదులు యెరూషలేముకు వచ్చి తిరుగుబాటు చేసిన ఆ చెడ్డ పట్టణాన్ని తిరిగి కడుతున్నారు. వారు గోడలను మరలా కడుతూ పునాదులను మరమ్మత్తు చేస్తున్నారు.

  7. అంతేకాక, మీరు తెలుసుకోవలసింది ఏంటంటే, ఒకవేళ వీరే ఈ పట్టణాన్ని కట్టి దాని ప్రాకారాలు తిరిగి నిర్మిస్తే వారు పన్నులు గాని కప్పం గాని లేదా సుంకం గాని చెల్లించరు. తద్వారా రాజ్య ఆదాయానికి నష్టం కలుగుతుంది.

  8. మేము రాజుకు కట్టుబడి ఉన్నాం కాబట్టి రాజుకు అవమానం జరిగితే చూడలేము. అందుకే రాజుకు ఈ సమాచారాన్ని చేరవేస్తున్నాము.

  9. మీ పూర్వికులు వ్రాసిన చరిత్రను పరిశీలన చేయండి. వాటిలో ఈ పట్టణస్థులు తిరుగుబాటుదారులని, రాజులకు దేశాలకు హాని చేశారని, దేశద్రోహులని తెలుస్తుంది. ఆ కారణంగానే ఆ పట్టణం నాశనం అయ్యింది.

  10. వీరు ఈ పట్టణాన్ని కట్టి దాని గోడలను మరలా కడితే, యూఫ్రటీసు నది అవతలి ప్రాంతంలో ఏది కూడా మీ ఆధీనంలో ఉండదని రాజుకు తెలియజేస్తున్నాము.

  11. దానిలో ఈ విధంగా వ్రాసి ఉంది: “నీవు యూదులతో కలిసి రాజు మీద తిరుగుబాటు చేయాలనే ఆలోచనతో గోడ కడుతున్నావని ప్రజల మధ్యలో వదంతి ఉంది. దానిని గెషెము నిరూపించాడు. అంతే కాకుండా దాని ప్రకారం నీవు వారికి రాజు కావాలని చూస్తున్నావు.

  12. అప్పుడు హామాను రాజైన అహష్వేరోషుతో ఇలా అన్నాడు, “మీ రాజ్యంలోని సంస్థానాలన్నిటిలో ఉండే ప్రజల్లో ఉన్న ఒక జాతి ప్రజలు వేరుగా ఉంటున్నారు. వారి చట్టాలు ఇతర ప్రజల చట్టాలకు వేరుగా ఉన్నాయి; వారు రాజు శాసనాలను పాటించరు; అలా వారిని సహించడం రాజుకు అంత మంచిది కాదు.

  13. కొరడాలవంటి నోటిమాటల నుండి నిన్ను కాపాడతారు, నాశనం వచ్చినా నీవు భయపడవు.

  14. దావీదు కీర్తన. యెహోవా, మీ పవిత్ర గుడారంలో ఉండగలవారు ఎవరు? మీ పరిశుద్ధ పర్వతంపై నివసించగలవారు ఎవరు?

  15. తమ నాలుకతో అపవాదులు వేయనివారు, పొరుగువారికి కీడు చేయనివారు, స్నేహితుల గురించి చెడుగా మాట్లాడనివారు;

  16. అనేకమంది గుసగుసలాడడం నేను విన్నాను, “అన్నివైపులా భయమే!” నామీద వారు దురాలోచన చేస్తున్నారు నా ప్రాణం తీయాలని కుట్ర పన్నుతున్నారు.

  17. మీరు చెడు పలుకకుండ మీ నాలుకను, అబద్ధాలు చెప్పకుండ తమ పెదవులను అదుపులో పెట్టుకోవాలి.

  18. అబద్ధ సాక్షులు బయలుదేరుతున్నారు; నాకు తెలియని విషయాలను గురించి వారు నన్ను ప్రశ్నిస్తారు.

  19. నన్ను చంపాలనుకున్నవారు ఉచ్చులు బిగుస్తున్నారు, నాకు హాని కలిగించేవారు నా పతనం గురించి మాట్లాడుతున్నారు; రోజంతా వారు కుట్రలు చేస్తున్నారు.

  20. నా శత్రువులు, “వీడెప్పుడు చస్తాడు, వీని పేరు ఎప్పుడు చెరిగిపోతుంది?” అని నా గురించి చెప్పుకుంటున్నారు.

  21. నన్ను చూడటానికి వచ్చి అబద్ధాలాడతారు, వారు తమ హృదయంలో దుష్టత్వం నింపుకొని వస్తారు; వారు బయటకు వెళ్లినప్పుడు దానిని చెప్తారు.

  22. నా శత్రువులంతా ఏకమై నాకు వ్యతిరేకంగా గుసగుసలాడుతున్నారు; నాకు కీడును తలపెడుతున్నారు.

  23. “దుష్టమైన వ్యాధి అతనికి కలిగింది; కాబట్టి వాడు పడక నుండి మళ్ళీ లేవడు” అంటున్నారు.

  24. నేను నమ్మిన నా దగ్గరి స్నేహితుడు, నా ఆహారం తిన్నవాడే, నాకు వ్యతిరేకంగా మడిమ ఎత్తాడు.

  25. మీరు కూర్చుని మీ సోదరునికి వ్యతిరేకంగా సాక్ష్యమిస్తారు, మీ సొంత తల్లి కుమారుని మీద అభాండాలు వేస్తారు.