Skip to content

Slander గురించి బైబిల్ వచనాలు

116 వచనాలు · 71 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. అంతేకాక వారు సోమరులుగా ఇంటింటికి తిరుగుతూ అనవసరమైన ముచ్చట్లతో, మాట్లాడకూడనివి మాట్లాడుతూ, ఇతరుల పనులలో జోక్యం చేసుకోవడం అలవాటు చేసుకుంటారు.

  2. అలాంటివారు వివేకం లేనివారు అహంకారులు. అలాంటివారు, మాటల వలన కలిగే వివాదాలలో గొడవలలో అనవసరమైన ఆసక్తి కలిగి ఉంటారు. దాని ఫలితంగా అసూయలు, కలహాలు, ద్వేషపూరితమైన మాటలు, దుష్ట సందేహాలు కలుగుతాయి,

  3. అదే విధంగా, వృద్ధ స్త్రీలకు, భక్తి జీవితాన్ని కలిగి ఉండి, అపవాదులు వేసేవారిగా లేదా మద్యానికి బానిసలుగా ఉండకుండా, ఏది మంచిదో దానిని బోధించేవారిగా ఉండమని బోధించు.

  4. పరిపాలకులకు అధికారులకు లోబడుతూ విధేయత కలిగి మంచి పనులను చేయడానికి సిద్ధంగా ఉండాలని,

  5. ఎవరినీ నిందించకూడదని, శాంతియుతంగా వివేకం కలిగి ఉండాలని, అందరి పట్ల ఎల్లప్పుడూ సౌమ్యంగా మెలగాలని ప్రజలకు జ్ఞాపకం చేయి.

  6. తాము భక్తిపరులమని భావిస్తూ తమ నాలుకను అదుపులో పెట్టుకోనివారు తమ హృదయాలను తామే మోసం చేసుకుంటారు. అలాంటివారి భక్తి విలువలేనిది.

  7. నా సహోదరీ సహోదరులారా, ఒకరి గురించి ఒకరు చెడుగా మాట్లాడవద్దు. ఇతరుల గురించి చెడుగా మాట్లాడేవారు లేదా ఇతరులకు తీర్పు తీర్చేవారు ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా మాట్లాడతారు, ధర్మశాస్త్రానికి తీర్పు తీరుస్తారు. మీరు ధర్మశాస్త్రానికి తీర్పుతీర్చితే అప్పుడు మీరు ధర్మశాస్త్రాన్ని పాటించేవారిగా కాకుండా న్యాయాధికారిగా ఉన్నారని అర్థము.

  8. ధర్మశాస్త్రాన్ని ఇచ్చినవారు న్యాయాధికారి ఒక్కరే, ఆయన రక్షించగలరు నాశనం చేయగలరు. కాబట్టి మీ పొరుగువారికి తీర్పు తీర్చడానికి మీరు ఎవరు?

  9. కాబట్టి, ప్రతి విధమైన దుష్టత్వానికి, కపటానికి, అసూయకు దూరంగా ఉండండి. ప్రతి విధమైన దూషణ మానేయండి.

  10. దేవుని ఎరుగనివారు మిమ్మల్ని ఏ విషయాల్లో దూషిస్తున్నారో ఆ విషయాల్లో మీరు మంచి ప్రవర్తన కలవారై ఉండాలి. మీ సత్కార్యాలను వారు గుర్తించి, దేవుడు మనల్ని దర్శించే రోజున వారు దేవుని మహిమపరచగలరు.

  11. ఎందుకంటే, “ఎవరైనా జీవితాన్ని ప్రేమించి మంచి దినాలను చూడాలనుకుంటారో వారు చెడు మాట్లాడకుండ నాలుకను మోసపు మాటలు చెప్పకుండ తమ పెదవులను కాచుకోవాలి.

  12. మంచి మనస్సాక్షిని కలిగి ఉండండి. అప్పుడు క్రీస్తులో ఉన్న మీ మంచి ప్రవర్తన గురించి చెడుగా మాట్లాడేవారు తమ మాటలకు తామే సిగ్గుపడతారు.

  13. మీరు ఆ యూదేతరులతో కలిసి విచ్చలవిడిగా నిర్లక్ష్యంగా జీవించకపోవడం చూసి వారు ఆశ్చర్యపడి మిమ్మల్ని దూషిస్తున్నారు.

  14. మరి ముఖ్యంగా శరీరాశలను అనుసరించి చెడిపోయిన వారిని, ఆయన అధికారాన్ని తృణీకరించిన వారిని శిక్షించడం ఆయనకు తెలుసు. వీరు ధైర్యంగా దురహంకారంతో పరలోక సంబంధులను దూషించడానికి భయపడరు.

  15. అదే విధంగా, ఈ భక్తిహీనులు తమ కలల ప్రభావం వలన తమ శరీరాలను మలినం చేసుకుంటారు, అధికారులను తృణీకరిస్తారు, పరలోక సంబంధులను దూషిస్తారు.

  16. అప్పుడు పరలోకంలో ఒక గొప్ప స్వరం, “ఇదిగో, రక్షణ, అధికారం, రాజ్యం మన దేవునివి అయ్యాయి. ఆయన క్రీస్తుకు అధికారం వచ్చింది. ఎలాగంటే మన సహోదరీ సహోదరుల మీద రాత్రింబగళ్ళు మన దేవుని ముందు నేరాలను మోపుతున్న అపవాది క్రిందికి పడద్రోయబడ్డాడు.