- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
Sin గురించి బైబిల్ వచనాలు
ముఖ్య బైబిల్ వచనాలు
వారంటారు, “యెహోవా చూడడం లేదు; యాకోబు దేవుడు గమనించడంలేదు.”
యెహోవాను ప్రేమించేవారు కీడును ద్వేషించుదురు గాక, ఎందుకంటే తన నమ్మకమైన వారి జీవితాలను ఆయన కావలి కాస్తారు దుష్టుల చేతి నుండి ఆయన విడిపిస్తారు.
నేను మీకు విరోధంగా పాపం చేయకూడదని మీ వాక్యాన్ని నా హృదయంలో దాచుకున్నాను.
దేవా, నన్ను పరిశోధించి నా హృదయాన్ని తెలుసుకోండి; నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకోండి.
చెడుమార్గమేదైనా నాలో ఉన్నదేమో చూడండి, నిత్యమైన మార్గంలో నన్ను నడిపించండి.
నా కుమారుడా, పాపిష్ఠి మనుష్యులు నిన్ను ప్రలోభపెడితే, నీవు వారికి లొంగిపోవద్దు.
ఒకవేళ వారు, “మాతో కూడా రా; నిర్దోషుల రక్తాన్ని చిందించడానికి దాగి ఉందాం; హాని చేయని ప్రాణం మీద ఆకస్మిక దాడి చేద్దాం;
పాతాళం వలె మనుష్యులు జీవించి ఉండగానే వారిని పూర్తిగా మ్రింగివేద్దాం, సమాధిలోనికి దిగువారి వలె పూర్ణబలంతో ఉండగానే వారిని మ్రింగివేద్దాం;
అన్ని రకాల విలువైన వస్తువులు మనం తెచ్చి మన ఇళ్ళను దోపుడు సొమ్ముతో నింపుకొందాం;
మాతో చీట్లు వేయండి; మనం దొంగిలించిన దానిని మనమందరం పంచుకుందాము.”
యెహోవాకు హేయమైనవి ఆరు, ఆయనకు హేయమైనవి ఏడు కలవు.
అవి ఏమనగా, అహంకారపు కళ్లు, అబద్ధమాడే నాలుక, నిర్దోషులను చంపే చేతులు.
చెడ్డ పన్నాగాలు చేసే హృదయం, కీడు చేయడానికి త్వరపడే పాదాలు,
అబద్ధాలు చెప్పే అబద్ధసాక్షి, సమాజంలో గొడవ రేపే వ్యక్తి.
యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండడం, చెడును అసహ్యించుకోవడమే; గర్వం, అహంకారం, చెడు పనులను చేయుట, అబద్ధపు మాటలు నాకు అసహ్యము.
నీతిమంతుల కష్టార్జితం జీవం, కాని దుష్టుల సంపాదన పాపం, మరణం.
పాపానికి సవరణలు చేయడంలో మూర్ఖులు ఎగతాళి చేస్తారు, కాని యథార్థవంతులు ఆయన నుండి దయ పొందుతారు.
నీతి ఒక దేశాన్ని ఘనతకెక్కేలా చేస్తుంది, పాపం ప్రజలకు అవమానం తెస్తుంది.
దుష్టుల మార్గాన్ని యెహోవా అసహ్యించుకుంటారు, నీతిని అనుసరించేవారిని ఆయన ప్రేమిస్తారు.
ప్రేమ, నమ్మకత్వం వలన పాపానికి ప్రాయశ్చిత్తం కలుగుతుంది; యెహోవాయందలి భయం వలన కీడు తొలగిపోతుంది.
“నా హృదయాన్ని స్వచ్ఛమైనదిగా ఉంచుకున్నాను; పాపం లేకుండ నేను శుద్ధునిగా ఉన్నాను” అని అనదగిన వారెవరు?
అహంకారపు చూపు గర్వ హృదయం దుష్ట క్రియలన్నీ పాపమే.
మూర్ఖుల పథకాలు పాపం, ఎగతాళి చేసేవారిని నరులు అసహ్యించుకుంటారు.
తమ పాపాలను దాచిపెట్టేవారు వర్ధిల్లరు, కాని వాటిని ఒప్పుకుని విడిచిపెట్టేవారు కనికరం పొందుతారు.
తమ కళ్లకు తాము పవిత్రులై తమ మలినం కడుగబడని వారు ఉన్నారు;