Skip to content

Sin గురించి బైబిల్ వచనాలు

210 వచనాలు · 120 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. వారు తమ సంవత్సరాలు శ్రేయస్సులో గడుపుతారు సమాధానంతో సమాధికి వెళ్తారు.

  2. అయినప్పటికీ వారు దేవునితో, ‘మమ్మల్ని ఒంటరిగా వదిలేయండి! మీ మార్గాల గురించి తెలుసుకోవాలని మాకు ఆశ లేదు.

  3. మేము ఆయనను సేవించడానికి సర్వశక్తిమంతుడు ఎవరు? మేము ఆయనకు ప్రార్థిస్తే మాకే లాభం కలుగుతుంది?’ అంటారు.

  4. అలాంటప్పుడు దేవుని ఎదుట ఎలా నీతిమంతుడు కాగలడు? అలాంటప్పుడు స్త్రీకి పుట్టిన ఒకడు ఎలా పవిత్రుడు కాగలడు?

  5. మనుష్యులు చేసినట్లు, నేను నా దోషాన్ని నా హృదయంలో కప్పిపుస్తూ, నేను నా పాపాన్ని దాచే ప్రయత్నం చేశానా?

  6. వారు ఇతరుల దగ్గరకు వెళ్లి ఇలా చెప్తారు, ‘నేను పాపం చేశాను, సరియైన దానిని వంకరగా మార్చాను, అయినా దానికి తగిన శిక్ష నాకు విధించబడలేదు.

  7. నేను చూడలేనిది నాకు చూపించు; నేనేదైనా తప్పు చేసివుంటే ఇకమీదట అలాంటిది చేయను’ అనవచ్చు.

  8. కాబట్టి నన్ను నేను అసహ్యించుకుని దుమ్ములో బూడిదలో పడి పశ్చాత్తాపపడుతున్నాను.”

  9. వణకండి, పాపం చేయకండి. మీరు మీ పడకలో ఉన్నప్పుడు ధ్యానం చేసుకుంటూ ప్రశాంతంగా ఉండండి. సెలా

  10. వారు తమ హృదయ కోరికలను బట్టి అతిశయిస్తారు; వారు అత్యాశపరులను దీవిస్తారు, యెహోవాను దూషిస్తారు.

  11. “దేవుడు ఎప్పటికీ గమనించరు; ఆయన తన ముఖాన్ని కప్పుకున్నారు ఇక ఎప్పుడు చూడరు” అని వారు తమలో తాము అనుకుంటారు.

  12. మనుష్యులు నాకు లంచం ఇవ్వాలని ప్రయత్నించినా, మీ పెదవులు ఆజ్ఞాపించిన దానిని బట్టి నేను హింసాత్మక మార్గాలకు దూరంగా ఉన్నాను.

  13. కావాలని చేసే పాపాల నుండి మీ సేవకున్ని తప్పించండి; అవి నా మీద పెత్తనం చేయకుండా అరికట్టండి. అప్పుడు నేను యథార్థవంతుడనై ఘోరమైన అతిక్రమాలు చేయకుండ నిర్దోషిగా ఉంటాను.

  14. కీడు చేయడం మాని మేలు చేయాలి; సమాధానాన్ని వెదికి దానిని వెంటాడాలి.

  15. మీ ఉగ్రత వల్ల నా శరీరంలో ఆరోగ్యం లేదు; నా పాపాన్ని బట్టి నా ఎముకల్లో నెమ్మది లేదు.

  16. నా దోషాన్ని ఒప్పుకుంటున్నాను; నా పాపాన్ని గురించి బాధపడుతున్నాను.

  17. సంగీత దర్శకుడైన యెదూతూనుకు. దావీదు కీర్తన. నేను, “నేను నా నాలుకతో పాపం చేయకుండా ఉండడానికి నా మార్గాలను సరిచూసుకుంటాను; దుష్టులు నా దగ్గర ఉన్నప్పుడు నా నోటికి చిక్కం పెట్టుకుంటాను” అని అన్నాను.

  18. మీరు ఇవి చేసినప్పుడు నేను మౌనంగా ఉన్నాను, నేను మీలాంటి వాణ్ణే అని మీరనుకున్నారు. కాని నేనిప్పుడు మిమ్మల్ని నిలదీస్తున్నాను, నా ఆరోపణలను మీ ముందు పెడుతున్నాను.

  19. నా దోషాలన్నింటిని కడిగి, నా పాపము నుండి నన్ను శుభ్రపరచండి.

  20. నేను పాపిగా పుట్టాను, నా తల్లి నన్ను గర్భం దాల్చినప్పుడు నేను పాపిని.

  21. కీడు తలపెట్టడంలో వారు ఒకరినొకరు ప్రోత్సహిస్తారు. వారు తమ వలలను దాచడం గురించి మాట్లాడతారు; వారంటారు, “దీన్ని ఎవరు చూస్తారు?”

  22. నా హృదయంలో దుష్టత్వం ఉంటే, ప్రభువు నా ప్రార్థన వినేవారు కాదు.

  23. దేవా! ఈ శత్రువులు నిన్ను ఎలా ఎగతాళి చేస్తున్నారో చూడు. ఓ యెహోవా దేవా! ఈ మూర్ఖపు జనం మీ నామాన్ని దూషించారు జ్ఞాపకం తెచ్చుకోండి.

  24. కాని వారు ఆయనకు వ్యతిరేకంగా పాపం చేస్తూనే ఉన్నారు అరణ్యంలో మహోన్నతుని మీద తిరుగుబాటు చేశారు.

  25. మీరు మా దోషాలను మీ ఎదుట, మా రహస్య పాపాలను మీ సన్నిధి కాంతిలో ఉంచారు.