కంటెంట్‌కు వెళ్లండి

Seeking God గురించి బైబిల్ వచనాలు

88 వచనాలు · 64 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. మీతో ఎవరైనా, గుసగుసలాడే గొణిగే మృతుల ఆత్మలతో మాట్లాడేవారిని, ఆత్మలతో మాట్లాడేవారిని సంప్రదించమని చెప్పినప్పుడు, ప్రజలు తమ దేవుని దగ్గరే విచారించాలి కదా? సజీవుల గురించి చచ్చిన వారిని ఎందుకు సంప్రదించాలి?

  2. అయితే ప్రజలు తమను కొట్టినవాడి వైపు తిరుగలేదు, సైన్యాల యెహోవాను వారు వెదకలేదు.

  3. రాత్రివేళ నా ప్రాణం మీ కోసం ఆరాటపడుతుంది; ఉదయం నా ఆత్మ మిమ్మల్ని వెదుకుతుంది. మీ తీర్పులు భూమి మీదికి వచ్చినప్పుడు, ఈ లోక ప్రజలు నీతిని నేర్చుకుంటారు.

  4. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని లెక్కచేయకుండా యెహోవా నుండి సహాయం కోసం చూడకుండ సహయం కోసం ఈజిప్టుకు వెళ్లే వారికి గుర్రాలపై ఆధారపడేవారికి, తమ రథాల సంఖ్యపై గుర్రపురౌతుల గొప్ప బలం మీద నమ్మకం ఉంచే వారికి శ్రమ.

  5. యెహోవా గ్రంథాన్ని పరిశీలించి చదవండి: వీటిలో ఏవి తప్పిపోవు, ఏ ఒక్కటి కూడా తన జత లేకుండా ఉండదు. ఎందుకంటే, ఆయన నోరే ఈ ఆదేశాన్ని ఇచ్చింది, ఆయన ఆత్మ వాటిని పోగుచేస్తారు.

  6. నేను ఎక్కడో చీకటి దేశంలో నుండి రహస్యంగా మాట్లాడలేదు; ‘వ్యర్థంగా నన్ను వెదకండి’ అని యాకోబు సంతానంతో నేను చెప్పలేదు. యెహోవానైన నేను సత్యం మాట్లాడతాను; నేను యథార్థమైనవే తెలియజేస్తాను.

  7. యెహోవా మీకు దొరికే సమయంలో ఆయనను వెదకండి; ఆయన సమీపంలో ఉండగానే ఆయనను వేడుకోండి.

  8. ప్రతిరోజు వారు నన్ను వెదకుతారు; తమ దేవుని ఆజ్ఞలను విడిచిపెట్టని వారిగా నీతిని అనుసరించే దేశంగా నా మార్గాలు తెలుసుకోవడానికి అత్యాసక్తి చూపిస్తారు. తమకు న్యాయమైన తీర్పులు ఇవ్వాలని నన్ను అడుగుతారు, దేవుడు తమ దగ్గరకు రావాలని కోరుకుంటారు.

  9. మీరు నన్ను వెదకినప్పుడు, మీ పూర్ణహృదయంతో నన్ను వెదికినప్పుడు నన్ను కనుగొంటారు.

  10. తన మీద నిరీక్షణ కలిగి ఉన్నవారికి, తనను వెదికేవారికి యెహోవా మేలు చేస్తారు;

  11. కాబట్టి నేను ప్రభువైన దేవుని వైపు తిరిగి ప్రార్థన, విన్నపం ద్వారా ఆయనను ప్రాధేయపడ్డాను, ఉపవాసముండి, గోనెపట్ట చుట్టుకొని, బూడిద మీద పోసుకున్నాను.

  12. నా దేవుడైన యెహోవాకు ఇలా ప్రార్థన చేస్తూ ఒప్పుకున్నాను: “ప్రభువా! మిమ్మల్ని ప్రేమించి, మీ ఆజ్ఞలను పాటించేవారిపట్ల ప్రేమ నిబంధనను నిలిపే మహా భీకరుడవైన దేవా,

  13. వారు తమ అపరాధం ఒప్పుకుని నన్ను వెదికే వరకు నేను నా స్థలానికి తిరిగి వెళ్తాను, వారు తమ దురవస్థలో నన్ను తీవ్రంగా వెదకుతారు.”

  14. మీ కోసం నీతిని విత్తండి, మారని ప్రేమ అనే పంట కోయండి. దున్నబడని భూమిని చదును చేయండి; ఎందుకంటే, యెహోవా మీ దగ్గరకు వచ్చి, నీతి వర్షం మీపై కురిపించే వరకు, యెహోవాను వెదికే సమయం ఇదే.

  15. యెహోవా ఇశ్రాయేలుతో చెప్పే మాట ఇదే: “నన్ను వెదికితే బ్రతుకుతారు.

  16. యెహోవాను వెదకండి మీరు బ్రతుకుతారు, లేదంటే యోసేపు గోత్రాల మీద ఆయన అగ్నిలా పడతారు; అది వారిని కాల్చివేస్తుంది బేతేలులో దాన్ని ఆర్పివేయగల వారెవరూ ఉండరు.

  17. “యూదా వారి మీద, యెరూషలేములో నివసిస్తున్న వారందరి మీద నా చేయి చాపుతాను. ఈ స్థలంలో మిగిలి ఉన్న బయలు దేవత ఆరాధికులను ఆ విగ్రహాన్ని పూజించేవారి పూజారుల పేర్లతో సహా నిర్మూలిస్తాను.

  18. మిద్దెమీద ఎక్కి ఆకాశ నక్షత్ర సమూహాన్ని పూజించేవారిని, యెహోవా పేర మోలెకు దేవత పేర మొక్కి ఒట్టు వేసుకునేవారిని నేను నాశనం చేస్తాను.

  19. యెహోవాను అనుసరించకుండా ప్రక్కకు తిరిగినవారిని ఆయనను వెదకకుండ, ఆయన దగ్గర విచారణ చేయనివారిని నాశనం చేస్తాను.”

  20. దేశంలోని సమస్త దీనులారా, ఆయన ఆజ్ఞను పాటించేవారలారా, యెహోవాను వెదకండి. నీతిని వెదకండి, దీనత్వాన్ని వెదకండి; యెహోవా కోప్పడే దినాన బహుశ మీకు ఆశ్రయం దొరకవచ్చు.

  21. “యాజకులు సైన్యాలకు అధిపతియైన యెహోవా దూతలు. ఎందుకంటే మనుష్యులు వారి నోట ధర్మశాస్త్రం విని నేర్చుకుంటారు. కాబట్టి వారు జ్ఞానాన్ని కలిగి బోధించాలి.

  22. సైన్యాలకు యెహోవా చెప్పేదేమంటే, “నేను నా దూతను పంపుతాను, అతడు నా ముందర మార్గాన్ని సిద్ధపరుస్తాడు. ఆ తర్వాత మీరు వెదుకుతున్న ప్రభువు అంటే మీరు కోరే నిబంధన దూత తన ఆలయానికి హఠాత్తుగా వస్తాడు.”

  23. కాబట్టి మొదట ఆయన రాజ్యాన్ని ఆయన నీతిని వెదకండి. అప్పుడు ఇవన్నీ మీకు ఇవ్వబడతాయి.

  24. “అడగండి మీకు ఇవ్వబడుతుంది; వెదకండి మీకు దొరుకుతుంది; తట్టండి మీకు తలుపు తీయబడుతుంది.

  25. ఆ దూతలు వారి దగ్గర నుండి పరలోకానికి వెళ్లిన తర్వాత, ఆ గొర్రెల కాపరులు ఒకరితో ఒకరు, “రండి మనం బేత్లెహేము పట్టణానికి వెళ్లి, దేని గురించైతే ప్రభువు మనకు చెప్పారో, ఆ జరిగిన దానిని చూద్దాం” అని చెప్పుకొన్నారు.