కంటెంట్‌కు వెళ్లండి

Seeking God గురించి బైబిల్ వచనాలు

88 వచనాలు · 64 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. అయితే అక్కడినుండి మీరు మీ దేవుడైన యెహోవాను వెదికితే, మీ పూర్ణహృదయంతో మీ పూర్ణాత్మతో వెదికినప్పుడు ఆయన మీకు దొరుకుతారు.

  2. కాని మీ దేవుడైన యెహోవా మీ గోత్రాలన్నిటిలో తన పేరును స్థాపించడానికి ఆయనకు నివాస స్థానంగా ఏర్పరచుకొనే స్థలాన్ని మీరు వెదికి ఆ స్థలానికి మీరు వెళ్లాలి;

  3. యెహోవాను, ఆయన బలాన్ని చూడండి; ఆయన ముఖాన్ని ఎల్లప్పుడు వెదకండి.

  4. ఇప్పుడు మనసారా మీ దేవుడైన యెహోవాను వెదకండి. యెహోవా నిబంధన మందసాన్ని, దేవుని సంబంధమైన పవిత్ర వస్తువులను, ఆయన పేరున కట్టబడే మందిరంలోకి చేర్చేటట్టు మీరు దేవుడైన యెహోవా పరిశుద్ధాలయాన్ని కట్టడం మొదలుపెట్టండి.”

  5. “కాబట్టి ఇప్పుడు యెహోవా సమాజంగా చేరిన ఇశ్రాయేలీయులందరు చూస్తుండగా, మన దేవుడు వింటుండగా, నేను మీకు చెప్పేది ఏంటంటే, మీరు ఈ మంచి దేశాన్ని స్వాధీనపరచుకుని, మీ తర్వాత మీ వారసులకు దానిని శాశ్వతమైన వారసత్వంగా అందించేలా మీ దేవుడైన యెహోవా ఇచ్చిన ఆజ్ఞలన్నిటిని జాగ్రత్తగా పాటించండి.

  6. “సొలొమోనూ, నా కుమారుడా! నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయాలను పరిశోధిస్తారు, ఆలోచనల ఉద్దేశాలన్నిటిని గ్రహిస్తారు కాబట్టి నీవు ఆయనను తెలుసుకుని పూర్ణహృదయంతో చిత్తశుద్ధితో ఆయనను సేవించు. నీవు ఆయనను వెదికితే, ఆయన నీకు దొరుకుతారు; అయితే నీవు ఆయనను విడిచిపెడితే, ఆయన నిన్ను శాశ్వతంగా తిరస్కరిస్తారు.

  7. ఇలా ఉండగా, ఇశ్రాయేలులోని అన్ని గోత్రాల్లో ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను వెదకడానికి తమ హృదయాల్లో నిర్ణయించుకున్న వారు తమ పూర్వికుల దేవుడైన యెహోవాకు బలులు అర్పించడానికి యెరూషలేముకు వెళ్తున్న లేవీయులను వెంబడించారు.

  8. రెహబాము యెహోవాను వెదకడం మీద మనస్సు నిలుపుకోలేదు, కాబట్టి చెడుగా ప్రవర్తించేవాడు.

  9. ఆసా యూదా వారితో, “మనం యెహోవాను వెదికి అనుసరించాం కాబట్టి ఈ దేశం ఇంకా మన స్వాధీనంలోనే ఉంది. ఆయనను వెదకి అనుసరించాం కాబట్టి మనం ఈ పట్టణాలను కట్టి, వాటికి చుట్టూ గోడలు, గోపురాలు, ద్వారాలు, అడ్డగడియలు అమర్చుదాం” అన్నాడు. అలాగే వారు పట్టణాలను కట్టి వర్థిల్లారు.

  10. వారు తమ పూర్వికుల దేవుడైన యెహోవాకు మనస్పూర్తిగా హృదయపూర్వకంగా వెదికి అనుసరిస్తామని ఒడంబడిక చేశారు.

  11. యెహోషాపాతు తన పితరుడైన దావీదు ఆరంభ దినాల్లో అనుసరించిన విధానాలను అనుసరించాడు. కాబట్టి యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు. యెహోషాపాతు బయలును అనుసరించలేదు.

  12. అతడు ఇశ్రాయేలు ప్రజలు చేసినట్టు చేయక తన తండ్రి యొక్క దేవున్ని వెదికి, ఆయన ఆజ్ఞలు అనుసరించాడు.

  13. దేవుని భయం కలిగి ఉండాలని తనకు బోధించిన జెకర్యా దినాల్లో అతడు దేవున్ని అనుసరించాడు. అతడు యెహోవాను అనుసరించినంత కాలం దేవుడు అతనికి విజయాన్ని ఇచ్చారు.

  14. పరిశుద్ధాలయ నియమాల ప్రకారం అపవిత్రంగా ఉన్నప్పటికీ, తమ పూర్వికుల దేవుడైన యెహోవాను వెదికితే అలాంటి వారందరినీ యెహోవా క్షమించును గాక.”

  15. యెహోవా ఆలయ సేవ కోసం, ధర్మశాస్త్రం, ఆజ్ఞ కోసం మొదలుపెట్టిన ప్రతి పనిలోను అతడు తన దేవుని వెదికి అనుసరించాడు. మనస్పూర్తిగా పని చేశాడు కాబట్టి వర్ధిల్లాడు.

  16. అతడు పాలిస్తున్న ఎనిమిదో సంవత్సరంలో ఇంకా యువకునిగా ఉండగానే తన పితరుడైన దావీదు యొక్క దేవుని వెదకడం మొదలుపెట్టాడు. పన్నెండవ సంవత్సరంలో ఉన్నత స్థలాలను అషేరా స్తంభాలను, చెక్కిన విగ్రహాలను, పోతవిగ్రహాలను తీసివేయడం, యూదాను యెరూషలేమును పవిత్రం చేయడం మొదలుపెట్టాడు.

  17. జెరుబ్బాబెలు దగ్గరకు, కుటుంబ పెద్దల దగ్గరకు వచ్చి, “అష్షూరు రాజైన ఏసర్హద్దోను మమ్మల్ని ఇక్కడకు తీసుకుని వచ్చినప్పటి నుండి మీలాగే మేము కూడా మీ దేవుని వెదకుతున్నాం, ఆయనకు బలులు అర్పిస్తూ ఉన్నాం కాబట్టి నిర్మాణంలో మేము మీకు సహాయం చేస్తాం” అన్నారు.

  18. యెహోవా ధర్మశాస్త్రాన్ని అధ్యయనం చేసి దాని ప్రకారం చేయాలని, ఇశ్రాయేలీయులకు దాని శాసనాలను, న్యాయవిధులను నేర్పించాలని ఎజ్రా నిశ్చయించుకున్నాడు.

  19. మేము రాజుతో, “మా దేవున్ని వెదికే ప్రతి ఒక్కరిపై ఆయన కరుణాహస్తం ఉంటుంది. ఆయనను విడిచిపెట్టినవారి మీద ఆయన తీవ్రమైన కోపం కుమ్మరించబడుతుంది” అని చెప్పాము కాబట్టి, దారిలో ఎదురయ్యే శత్రువులు నుండి కాపాడడానికి సైనికులు, గుర్రపురౌతులను మాకు సహాయంగా పంపమని రాజును అడగడానికి నేను సిగ్గుపడ్డాను.

  20. “ఒకవేళ నేనే నువ్వైతే, నేను దేవునికే మొరపెడతాను; ఆయన ఎదుట నా వాదన చెప్పుకుంటాను.

  21. కాని నీవు జాగ్రత్తగా దేవుని వెదికితే, సర్వశక్తిమంతుడైన దేవుని వేడుకుంటే,

  22. నీవు పవిత్రంగా యథార్థంగా ఉంటే, ఇప్పుడే ఆయన నీ పక్షాన లేస్తారు, నీ సంపన్న స్థితిని తిరిగి ఇస్తారు.

  23. మీ నామం తెలిసిన వారు మీమీద నమ్మకం ఉంచుతారు, ఎందుకంటే యెహోవా, మిమ్మల్ని వెదికే వారిని మీరు ఎన్నడూ విడువరు.

  24. దుష్టులు తమ అహంకారంలో దేవున్ని వెదకరు; వారి ఆలోచనల్లో దేవునికి చోటు లేదు.

  25. వివేకం కలిగి దేవున్ని వెదకేవారు ఎవరైనా ఉన్నారా అని యెహోవా పరలోకం నుండి మనుష్యులందరిని పరిశీలించి చూస్తున్నారు.