కంటెంట్‌కు వెళ్లండి

Seeking God గురించి బైబిల్ వచనాలు

88 వచనాలు · 64 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. అందరు దారి తప్పి చెడిపోయారు; మంచి చేసేవారు ఎవరూ లేరు. ఒక్కరు కూడా లేరు.

  2. దీనులు తృప్తిగా భోజనం చేస్తారు; యెహోవాను వెదికేవారు ఆయనను స్తుతిస్తారు, మీ హృదయాలు నిత్యం ఆనందిస్తాయి.

  3. ఆయనను వెదికే తరం ఇదే, యాకోబు దేవా, మీ ముఖకాంతిని వెదకేవారు అలాంటివారే. సెలా

  4. యెహోవాను ఒకటి అడిగాను, నేను కోరింది ఇదే; యెహోవా ప్రసన్నతను చూస్తూ ఆయన మందిరంలో ఆయనను వెదకుతూ నా జీవితకాలమంతా నేను యెహోవా మందిరంలో నివసించాలని కోరుతున్నాను.

  5. “ఆయన ముఖాన్ని వెదకు!” అని నా హృదయం మీ గురించి అంటుంది, యెహోవా, మీ ముఖాన్ని నేను వెదకుతాను.

  6. నేను యెహోవాను వెదికాను, ఆయన నాకు జవాబిచ్చారు; నా భయాలన్నిటి నుండి ఆయన నన్ను విడిపించారు.

  7. సింహాలు ఆకలితో బలహీనం కావచ్చు, కాని యెహోవాను వెదికేవారికి ఏ మేలు కొరతగా ఉండదు.

  8. దావీదు కీర్తన. అతడు యూదా అరణ్యంలో ఉండగా రచించిన కీర్తన. దేవా, మీరు నా దేవుడు, నేను ఆశగా మిమ్మల్ని వెదకుతున్నాను; నీరు లేక ఎండిపోయి పొడిగా ఉన్న దేశంలో, నేను మీ కోసం దప్పిగొన్నాను, నా శరీరమంతా మీ కోసం ఆశపడుతుంది.

  9. దీనులు చూసి ఆనందిస్తారు; దేవున్ని వెదికేవారి హృదయాలు తిరిగి బ్రతుకును గాక.

  10. అయితే మిమ్మల్ని వెదికేవారంతా మీలో ఆనందించి సంతోషించాలి; మీ రక్షణను ప్రేమించేవారు ఎల్లప్పుడు, “యెహోవా గొప్పవాడు!” అని అనాలి.

  11. నేను బాధలో ఉన్నప్పుడు నేను ప్రభువును ఆశ్రయించాను; అలసిపోకుండా రాత్రంతా నేను చేతులు చాచాను, నాకు ఆదరణ కలుగలేదు.

  12. అందువల్ల ఆయన వారి రోజులను నిష్ఫలంగా వారి సంవత్సరాలు భయంలో ముగిసిపోయేలా చేశారు.

  13. దేవుడు వారిని చంపినప్పుడల్లా వారు ఆయనను వెదికారు; వారు మరలా ఆసక్తిగా ఆయన వైపు తిరిగారు.

  14. వారు మీ నామాన్ని వెదకునట్లుగా, యెహోవా, సిగ్గుతో వారి ముఖాలు కప్పండి.

  15. ఆయన పరిశుద్ధ నామం గురించి గొప్పగా చెప్పండి; యెహోవాను వెదికేవారి హృదయాలు ఆనందించును గాక

  16. యెహోవాను, ఆయన బలాన్ని చూడండి; ఆయన ముఖాన్ని ఎల్లప్పుడు వెదకండి.

  17. ఆయన శాసనాలను పాటిస్తూ తమ హృదయమంతటితో ఆయనను వెదకేవారు ధన్యులు,

  18. నేను నా హృదయమంతటితో మిమ్మల్ని వెదకుతున్నాను; మీ ఆజ్ఞల నుండి నన్ను తొలగిపోనివ్వకండి.

  19. నేను మీ కట్టడలను వెదికాను, కాబట్టి స్వేచ్ఛలో నడుచుకుంటాను.

  20. నేను మీ వాడను, నన్ను రక్షించండి; నేను మీ కట్టడలను వెదికాను.

  21. “అప్పుడు వారు నాకు మొరపెడతారు కాని నేను జవాబు ఇవ్వను; నా కోసం ఆతురతగా వెదకుతారు కాని నేను కనబడను,

  22. నన్ను ప్రేమించేవారిని నేను ప్రేమిస్తాను, నన్ను వెదకేవారికి దొరుకుతాను.

  23. కీడుచేసేవారు సరియైనది గ్రహించరు, కాని యెహోవాను ఆశ్రయించువారు దాన్ని పూర్తిగా గ్రహిస్తారు.

  24. నేను ఇప్పుడే లేచి పట్టణం వైపు వెళ్తాను, పట్టణ వీధుల్లో రహదారుల్లో వెదకుతాను; నా హృదయం ప్రేమిస్తున్నవాని కోసం నేను వెదకుతాను. కాబట్టి నేను ఆయన కోసం వెదికాను కాని ఆయన కనపడలేదు.

  25. నేను దాదాపుగా వారిని దాటి వెళ్లాను అప్పుడు నా ప్రేమికుడు నాకు కనిపించాడు. ఆయనను గట్టిగా పట్టుకున్నాను ఆయనను నా తల్లి గృహానికి, నన్ను కనిన గది లోనికి తెచ్చే వరకు నేను వదల్లేదు.