Skip to content

Sciences గురించి బైబిల్ వచనాలు

74 వచనాలు · 13 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. తర్వాత అతడు యెహోవా మందసం దగ్గర సేవ చేయడానికి, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను కీర్తించడానికి స్తుతించడానికి, కృతజ్ఞతలు అర్పించడానికి లేవీయులలో కొంతమందిని నియమించాడు.

  2. వారిలో ఆసాపు నాయకుడు, అతని తర్వాతి నాయకుడు జెకర్యా, తర్వాత యహజీయేలు, షెమీరామోతు, యెహీయేలు, మత్తిత్యా, ఏలీయాబు, బెనాయా, ఓబేద్-ఎదోము, యెహీయేలు. వారు వీణలు, సితారలు వాయించడానికి నియమించబడ్డారు. ఆసాపు తాళాలను వాయించేవాడు.

  3. యాజకులైన బెనాయా, యహజీయేలు దేవుని నిబంధన మందసం ఎదుట క్రమంగా బూరలు ఊదేవారు.

  4. ఆ రోజు దావీదు యెహోవాను స్తుతించడానికి మొదటిసారిగా ఆసాపు, అతని తోటివారికి ఇలా పాడమని చెప్పాడు:

  5. వీరందరు తమ తండ్రుల పర్యవేక్షణలో ఉండి, యెహోవా మందిరంలో తాళాలు, వీణలు, సితారాలు వాయిస్తూ, పాటలు పాడుతూ దేవుని మందిరం దగ్గర సేవ చేసేవారు. ఆసాపు, యెదూతూను, హేమానులు రాజు పర్యవేక్షణలో ఉండేవారు.

  6. నా కుమారుడైన సొలొమోను మీ ఆజ్ఞలను, శాసనాలను, నియమాలను పాటిస్తూ, నేను ఆలయ నిర్మాణం కోసం సమకూర్చిన వాటితో అతడు కట్టించడానికి అతడు పూర్ణహృదయంతో భక్తి కలిగి ఉండునట్లు చేయండి.”

  7. రాజైన దావీదుకు సంబంధించిన ఇతర వివరాలన్నీ మొదటి నుండి చివరి వరకు, అతని పాలనకు అధికారానికి సంబంధించిన వివరాలు, అతడు, ఇశ్రాయేలీయులు ఇతర దేశాల రాజ్యాలు ఎదుర్కొన్న పరిస్థితుల వివరాలు దీర్ఘదర్శి సమూయేలు, నాతాను ప్రవక్త, దీర్ఘదర్శి గాదు వ్రాసిన చరిత్ర గ్రంథాల్లో ఉన్నాయి.

  8. రాత్రివేళ నేను నాతో ఉన్న కొంతమంది పురుషులతో కలిసి బయలుదేరాను. యెరూషలేము గురించి దేవుడు నా హృదయంలో ఉంచిన ఆలోచన ఎవరికి చెప్పలేదు. నేను ఎక్కిన జంతువు తప్ప నా దగ్గర మరో జంతువు లేదు.

  9. రాత్రివేళలో నేను లోయ ద్వారం గుండా ఘటసర్పం బావి వైపు పెంట ద్వారం దగ్గరకు వెళ్లి కూల్చబడిన యెరూషలేము గోడలు, అగ్నితో కాల్చబడిన దాని గుమ్మాలను పరిశీలించాను.

  10. అక్కడినుండి నీటి ఊట గుమ్మానికి రాజు కొలను దగ్గరకు వెళ్లాను కాని నేను ఎక్కిన జంతువు వెళ్లడానికి ఆ దారి చాలా ఇరుకుగా ఉంది.

  11. రాత్రివేళలో నేను లోయ గుండా వెళ్లి గోడను పరిశీలించి తిరిగి లోయ గుమ్మం గుండా వెనుకకు వచ్చాను.

  12. నేను ఎక్కడ వెళ్లానో ఏమి చేస్తున్నానో అధికారులకు తెలియదు. యూదులకు గాని యాజకులకు గాని సంస్థానాధిపతులకు గాని ఇతర అధికారులకు గాని నేను ఆ విషయం చెప్పలేదు.

  13. “అప్పుడు నేను ఇలా అనుకున్నాను, ‘నా ఇంట్లోనే నేను చనిపోతాను, నా రోజులు ఇసుక రేణువుల్లా ఉంటాయి.

  14. “కృత్తిక నక్షత్రాలను నీవు సంకెళ్ళతో బంధించగలవా? మృగశీర్ష నక్షత్రం యొక్క కట్లు విప్పగలవా?

  15. నక్షత్ర రాశులను వాటి వాటి కాలాల్లో వచ్చేలా నీవు చేయగలవా? సప్తరుషి నక్షత్రాలను వాటి ఉప నక్షత్రాలను నీవు నడిపించగలవా?

  16. ఓడలలో సముద్ర ప్రయాణం చేస్తూ మహాజలాల మీద వెళుతూ, కొందరు వ్యాపారం చేస్తారు.

  17. ఆ రోజున తన ప్రజల్లో మిగిలి ఉన్న శేషాన్ని అష్షూరు, ఈజిప్టు, పత్రూసు, కూషు, ఏలాము, బబులోను, హమాతులలో నుండి, మధ్యధరా సముద్ర ద్వీపాల్లో నుండి విడిపించి రప్పించడానికి యెహోవా రెండవసారి తన చేయి చాపుతారు.

  18. ఆకాశ నక్షత్రాలు వాటి నక్షత్రరాసులు తమ వెలుగు ఇవ్వవు. ఉదయించే సూర్యుడు చీకటిగా మారుతాడు చంద్రుడు తన వెలుగునివ్వడు.

  19. నీవు తీసుకున్న సలహాలన్నీ విని నీవు అలసిపోయావు. నీ జ్యోతిష్యులు, నెలలవారీగా రాశి ఫలాలను చెప్పేవారిని రమ్మను, నీ మీదికి వచ్చే వాటినుండి నిన్ను వారు రక్షించాలి.

  20. గిలాదులో ఔషధతైలం లేదా? అక్కడ వైద్యుడు లేడా? ఉంటే నా ప్రజల గాయానికి స్వస్థత ఎందుకు లేదు?

  21. ఆలయ ప్రాంతాన్ని పూర్తిగా చుట్టుముట్టిన గోడను నేను చూశాను. ఆ వ్యక్తి చేతిలోని ఉన్న కొలిచే కడ్డీ పొడవు ఆరు మూరలు, ఒక్కొక్కటి ఒక మూర ఒక బెత్తెడు వెడల్పు ఉంది. అతడు గోడను కొలిచాడు; అది ఆ కొలిచే కడ్డీ అంత వెడల్పు, ఆ కడ్డీ అంత ఎత్తు ఉంది.

  22. అప్పుడతడు తూర్పు వైపున ఉన్న ద్వారం దగ్గరికి వెళ్లి దాని మెట్లెక్కి దాని గుమ్మపు గడపను కొలిచినప్పుడు అది ఒక కొలిచే కర్ర పొడవు ఉంది.

  23. “నీవు ఎక్కడికి వెళ్తున్నావు?” అని నేను అడిగాను. అందుకతడు, “యెరూషలేము పొడవు, వెడల్పు ఎంత ఉందో కొలిచి తెలుసుకోవడానికి వెళ్తున్నాను” అన్నాడు.

  24. ఆమె ఎందరో వైద్యుల దగ్గరకు తిప్పలుపడి వెళ్లి తనకు ఉన్నదంతా ఖర్చుపెట్టినా, జబ్బు బాగవ్వడానికి బదులు ఆమె పరిస్థితి ఇంకా క్షీణించిపోయింది.