Skip to content

Sciences గురించి బైబిల్ వచనాలు

74 వచనాలు · 13 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. అరాము కుమారులు: ఊజు, హూలు, గెతెరు, మెషెకు.

  2. అర్పక్షదు షేలహుకు తండ్రి: షేలహు ఏబెరుకు తండ్రి.

  3. ఏబెరుకు ఇద్దరు కుమారులు పుట్టారు: ఒకనికి పెలెగు అని పేరు పెట్టారు ఎందుకంటే అతని కాలంలోనే భూమి విభజింపబడింది; అతని సోదరునికి యొక్తాను అని పేరు పెట్టారు.

  4. యొక్తాను కుమారులు: అల్మోదాదు, షెలపు, హసర్మావెతు, యెరహు,

  5. హదోరము, ఊజాలు, దిక్లా,

  6. ఓబాలు, అబీమాయేలు, షేబ,

  7. ఓఫీరు, హవీలా, యోబాబు. వీరందరు యొక్తాను కుమారులు.

  8. (వీరు నివసించే ప్రాంతం మేషా నుండి తూర్పు కొండసీమ ఉన్న సెఫారా వరకు ఉంది.)

  9. అప్పుడు వారు, “రండి, మన కోసం ఆకాశాన్ని అంటే గోపురం గల ఒక పట్టణాన్ని కట్టుకుని మనకు మనం పేరు తెచ్చుకుందాం; లేదా మనం భూమంతా చెదిరిపోతాం” అని అన్నారు.

  10. దేవుడు అబ్రామును బయటకు తీసుకువచ్చి, “పైన ఆకాశాన్ని చూసి నీకు చేతనైతే నక్షత్రాలను లెక్కబెట్టు. నీ సంతానం అలా ఉంటుంది” అని చెప్పారు.

  11. కాబట్టి అతడు తన రథాన్ని సిద్ధం చేసుకుని తనతో పాటు తన సైన్యాన్ని తీసుకెళ్లాడు.

  12. అతడు ప్రత్యేకమైన ఆరువందల రథాలను వాటితో పాటు ఈజిప్టులో ఉన్న ఇతర రథాలన్నిటిని ప్రతి దాని మీద అధిపతులతో తీసుకెళ్లాడు.

  13. మీలో అయిదుగురు వందమందిని, వందమంది పదివేలమందిని తరుముతారు, మీ శత్రువులు మీ ఎదుట ఖడ్గం ద్వార కూలుతారు.

  14. లేకపోతే మీరు తిని తృప్తి చెందినప్పుడు, మీరు మంచి ఇళ్ళు కట్టుకుని వాటిలో స్థిరపడినప్పుడు,

  15. ప్రతి గోత్రం నుండి ముగ్గురు వ్యక్తులను నియమించండి. ఒక్కొక్కరి వారసత్వం ప్రకారం భూమిని పరిశీలించి దాని వివరాలు వ్రాసి నా దగ్గరకు తీసుకురావడానికి నేను వారిని పంపుతాను. అప్పుడు వారు నా దగ్గరకు తిరిగి వస్తారు.

  16. మీరు భూమిని ఏడు భాగాలుగా విభజించాలి. యూదా వారు దక్షిణాన ఉన్న తన ప్రాంతంలోనూ, యోసేపు గోత్రాలు ఉత్తరాన ఉన్న తమ ప్రాంతాల్లోనూ ఉండాలి.

  17. మీరు భూమి యొక్క ఏడు భాగాల వివరాలు వ్రాసి వాటిని నా దగ్గరకు తీసుకురండి, నేను మన దేవుడైన యెహోవా సన్నిధిలో మీ కోసం చీట్లు వేస్తాను.

  18. అయితే లేవీయులు మీ మధ్య భాగాన్ని పొందరు, ఎందుకంటే యెహోవాకు యాజక సేవ చేయడమే వారి వారసత్వము. గాదు, రూబేను, మనష్షే అర్థగోత్రం ఇప్పటికే యొర్దాను తూర్పు వైపున వారి వారసత్వాన్ని పొందారు. యెహోవా సేవకుడైన మోషే దానిని వారికి ఇచ్చాడు.”

  19. మనుష్యులు భూమిని పరిశీలించడానికి బయలుదేరేటప్పుడు యెహోషువ వారికి, “మీరు వెళ్లి భూమిని పరిశీలించి దాని వివరాలు వ్రాసి నా దగ్గరకు తిరిగి రండి. అప్పుడు నేను షిలోహులో యెహోవా సన్నిధిలో మీ కోసం చీట్లు వేస్తాను” అని చెప్పాడు.

  20. ఆ మనుష్యులు అక్కడినుండి బయలుదేరి దేశమంతా తిరిగి ఏడు భాగాలుగా పట్టణాలవారీగా దాని వివరాలను ఒక గ్రంథపుచుట్ట మీద వ్రాసి, షిలోహులోని శిబిరంలో ఉన్న యెహోషువ దగ్గరకు తిరిగి వచ్చారు.

  21. అతడు లెబానోనులో ఉండే దేవదారు చెట్ల నుండి, గోడల నుండి మొలిచే హిస్సోపు మొక్కల వరకు చెట్ల గురించి వివరించాడు. అతడు జంతువులు, పక్షులు, ప్రాకే జంతువులు, చేపల గురించి కూడా వివరించాడు.

  22. హీరాము సముద్రం గురించి తెలిసిన తన నావికులను సొలొమోను మనుష్యులతో పాటు పని చేయడానికి పంపించాడు.

  23. అహాబు పరిపాలనకు సంబంధించిన ఇతర విషయాలు, అతడు చేసినదంతా, దంతంతో అతడు కట్టించుకున్న భవనం గురించి, అతడు పటిష్టం చేసుకున్న పట్టణాల గురించి ఇశ్రాయేలు రాజుల చరిత్ర గ్రంథంలో వ్రాయబడలేదా?

  24. అహజ్యా పరిపాలన గురించిన ఇతర విషయాలు, అతడు చేసినవి ఇశ్రాయేలు రాజుల చరిత్ర గ్రంథంలో వ్రాయబడ్డాయి.

  25. ఇశ్రాయేలు ప్రజలందరి పేర్లు తమ వంశాల ప్రకారం ఇశ్రాయేలు యూదా రాజుల గ్రంథంలో వ్రాయబడ్డాయి. వారు చేసిన నమ్మకద్రోహాన్ని బట్టి వారు బబులోనుకు బందీలుగా కొనిపోబడ్డారు.