కంటెంట్‌కు వెళ్లండి

Rulers గురించి బైబిల్ వచనాలు

255 వచనాలు · 5 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. ఏ రాజు పేదలకు సత్యంగా న్యాయం తీరుస్తాడో, ఆ రాజు సింహాసనం శాశ్వతంగా స్థిరపరచబడుతుంది.

  2. “భూమిని వణికించునవి మూడు కలవు, అవి భరించలేనివి నాలుగు కలవు.

  3. అవి ఏమనగా రాజరికానికి వచ్చిన దాసుడు, తినడానికి పుష్కలంగా ఉన్న దైవభక్తి లేని మూర్ఖుడు,

  4. లెమూయేలూ, ఇది రాజులకు తగినది కాదు, మద్యపానం సేవించుట రాజులకు తగినది కాదు, పాలకులు మద్యము కోసం ఆరాటపడకూడదు,

  5. ఎందుకంటే వారు త్రాగి, నిర్ణయించిన వాటిని మరచిపోతారు, అణగారిన వారందరి హక్కులను హరించివేస్తారు.

  6. తమ గురించి తాము మాట్లాడలేని వారి కోసం, నిరాశ్రయులందరి హక్కుల కోసం మాట్లాడండి.

  7. మాట్లాడండి న్యాయంగా తీర్పు తీర్చండి; దీనుల, అవసరతలో ఉన్న వారి హక్కులను పరిరక్షించండి.

  8. సూర్యుని క్రింద ఈ భూమి మీద మరో విషయం నేను చూశాను. న్యాయస్థానంలో దుర్మార్గం జరుగుతూ ఉంది. న్యాయానికి బదులు దుర్మార్గమే ప్రబలుతోంది.

  9. నేనిలా అనుకున్నాను, “నీతిమంతులకు దుర్మార్గులకు దేవుడు తీర్పు తీరుస్తారు, ఎందుకంటే ప్రతి ప్రయత్నానికి సమయం ఉంది ప్రతి పనికి తీర్పు తీర్చడానికి సమయం ఉంది.”

  10. సూర్యుని క్రింద జరుగుతున్న అణచివేతనంతటిని నేను చూశాను: సూర్యుని క్రింద అణగారిన వారి కన్నీటిని నేను చూశాను, కాబట్టి వారిని ఆదరించేవారెవరూ లేరు; బాధపెట్టేవారు బలవంతులు, వారిని ఆదరించేవారెవరూ లేరు.

  11. మూర్ఖుడై హెచ్చరికలు వినడానికి ఇష్టపడని ముసలి రాజుకంటే బీదవాడైన జ్ఞానంగల యువకుడే నయము.

  12. అలాంటి యువకుడు చెరసాలలో నుండి బయటపడి పట్టాభిషేకం పొందవచ్చు. తన దేశంలో దరిద్రుడిగా పుట్టినా రాజు కాగలడు.

  13. ఒక ప్రాంతంలో పేదలను అణచివేయడం, న్యాయాన్ని హక్కులను పాటించకపోవడం లాంటివి నీవు చూస్తే ఆశ్చర్యపడవద్దు; ఎందుకంటే ఒక అధికారి మీద పైఅధికారులు ఉంటారు, వారందరిపైన ఉన్నతాధికారులు ఉంటారు.

  14. రాజు మాట మహోన్నతమైనది, “మీరు నీవు ఏం చేస్తున్నావు?” అని రాజును ఎవరు అడగగలరు?

  15. ఇవన్నీ నేను చూశాను, సూర్యుని క్రింద చేసిన ప్రతిదానికీ నేను నా మనస్సులో ఆలోచించాను. ఒకరు ఇతరులపై ఉన్న అధికారంతో తనకే హాని తెచ్చుకుంటున్నారు.

  16. నేను సూర్యుని క్రింద ఒక చెడ్డ విషయాన్ని చూశాను, ఒక పాలకుడు పొరపాటున చేసిన అన్యాయం:

  17. అదేమిటంటే మూర్ఖులను ఉన్నత పదవులలో, సమర్థులను దిగువ స్థాయిలో ఉంచడమే.

  18. నేను బానిసలు గుర్రాలపై, యువరాజులు బానిసల్లా కాలినడకన వెళ్లడం చూశాను.

  19. దాసుడు రాజుగా ఉన్న దేశానికి ఉదయాన్నే విందు చేసుకొనే యువరాజులు ఉన్న దేశానికి శ్రమ.

  20. గొప్ప జన్మ కలిగినవాడు రాజుగా ఉన్న దేశం మత్తు కోసం కాక బలం కోసం సరైన సమయంలో భోజనానికి కూర్చునే అధిపతులు ఉన్న దేశం ధన్యమైనది.

  21. నీ పాలకులు తిరుగుబాటుదారులు, దొంగలతో సహవాసం చేస్తారు. వారందరికి లంచాలు ఇష్టం కానుకల వెంటపడతారు. తండ్రిలేనివారి పక్షంగా న్యాయం తీర్చరు. విధవరాలి సమస్యను పరిష్కరించరు.

  22. నా ప్రజలను యువకులు అణచివేస్తారు స్త్రీలు వారిని పాలిస్తారు. నా ప్రజలారా, మీ నాయకులు మిమ్మల్ని తప్పుదారి పట్టిస్తారు మార్గం నుండి వారు మిమ్మల్ని తప్పిస్తారు.

  23. యెహోవా తన ప్రజల పెద్దలకు నాయకులకు తీర్పు ప్రకటించడానికి వస్తున్నారు: “మీరే నా ద్రాక్షతోటను నాశనం చేశారు; పేదల నుండి దోచుకున్న సొమ్ము మీ ఇళ్ళలో ఉంది.

  24. మీరు నా ప్రజలను ఎందుకు నలుగగొడుతున్నారు? పేదల ముఖాలను ఎందుకు నూరుతున్నారు?” అని సైన్యాల అధిపతియైన యెహోవా అంటున్నారు.

  25. ఇశ్రాయేలు వంశం సైన్యాల యెహోవా ద్రాక్షతోట, యూదా ప్రజలు ఆయన ఆనందించే ద్రాక్షలు. ఆయన న్యాయం కోసం చూడగా రక్తపాతం కనబడింది; నీతి కోసం చూడగా రోదనలు వినబడ్డాయి.