కంటెంట్‌కు వెళ్లండి

Rulers గురించి బైబిల్ వచనాలు

255 వచనాలు · 5 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. రాజు పెదవులు దైవ వాక్కులా మాట్లాడతాయి, అతని నోరు న్యాయ ద్రోహం చేయదు.

  2. రాజులు చెడ్డపనులు చేయడాన్ని అసహ్యించుకుంటారు, నీతి వలన సింహాసనం స్ధిరపరచబడుతుంది.

  3. రాజులు నిజాయితీగల పెదవులను ఇష్టపడతారు, యథార్థంగా మాట్లాడేవారికి వారు విలువనిస్తారు.

  4. అనర్గళమైన పెదవులు దైవభక్తి లేని బుద్ధిహీనునికి సరిపోవు, అధికారికి అబద్ధమాడే పెదవులు ఇంకెంత ఘోరం!

  5. దోషులను వదిలి వేయడం అమాయకులను ఖండించడం, రెండు యెహోవాకు అసహ్యమే.

  6. అమాయకులకు జరిమానా విధించడం మంచిది కాకపోతే, నిజాయితీగల అధికారులను కొట్టడం సరికాదు.

  7. రాజు కోపం సింహగర్జన వంటిది, అతని దయ తుక్కు మీద కురియు మంచు వంటిది.

  8. న్యాయసింహాసనంపై కూర్చున్న రాజు, తన కంటి చూపులతో చెడుతనమంతయు చెదరగొడతారు.

  9. జ్ఞానంగల రాజు దుష్టులను చెదరగొడతాడు అతడు వారి మీదికి చక్రం దొర్లిస్తాడు.

  10. దయ, సత్యాలు రాజును కాపాడతాయి దయ వలన అతడు తన సింహాసనాన్ని నిలుపుకుంటాడు.

  11. యెహోవా చేతిలో రాజు హృదయం నీటి కాలువ ఆయనకు ఇష్టులైన వారివైపు దాని త్రిప్పుతారు.

  12. ఇవి కూడా జ్ఞానులు చెప్పిన సూక్తులే: న్యాయం తీర్చుటలో పక్షపాతము చూపుట మంచిది కాదు

  13. “నీవు అమాయకుడవు” అని దోషులతో చెప్పేవారిని, ప్రజలు శపిస్తారు దేశాలు అసహ్యించుకుంటారు.

  14. న్యాయంగా తీర్పు తీర్చువారికి మేలు కలుగును అధికమైన దీవెన అట్టివారిమీదికి వచ్చును.

  15. నిజాయితీగల జవాబు పెదవులపై పెట్టే ముద్దు లాంటిది.

  16. ఒక విషయాన్ని దాచిపెట్టడం దేవుని గొప్పతనం; ఒక విషయాన్ని బయటకు లాగడం రాజుల గొప్పతనము.

  17. ఆకాశాల ఎత్తు భూమి లోతు ఎలా కనుగొనలేమో, అలాగే రాజుల హృదయాలు కూడా శోధించలేనివి.

  18. రాజు ఎదుట నుండి చెడ్డ అధికారులను తొలగించండి, నీతి ద్వారా ఆయన సింహాసనం స్థాపించబడుతుంది.

  19. ఒక దేశం తిరుగుబాటు చేసినప్పుడు, దానికి చాలామంది పాలకులు ఉంటారు, కానీ వివేచన జ్ఞానంగల మనుష్యులు క్రమాన్ని పాటిస్తారు.

  20. నిస్సహాయ ప్రజలను పైన ఉన్న దుష్ట పాలకుడు గర్జించే సింహం లేదా దాడి చేసే ఎలుగుబంటిలాంటి వాడు.

  21. ఒక నిరంకుశ పాలకుడు బలాత్కారాన్ని అభ్యసిస్తాడు, కాని చెడుతో సంపాదించిన లాభాన్ని ద్వేషించేవాడు సుదీర్ఘ పాలనను అనుభవిస్తాడు.

  22. దుష్టులైన మనుష్యులు అధికారంలోకి వచ్చినప్పుడు ప్రజలు దాక్కుంటారు; కాని దుష్టులు నశించినప్పుడు నీతిమంతులు వృద్ధిచెందుతారు.

  23. నీతిమంతులు వృద్ధి చెందినప్పుడు ప్రజలు సంతోషిస్తారు; దుష్టులు ఏలునపుడు, ప్రజలు మూల్గుతారు.

  24. న్యాయం ద్వారా ఒక రాజు దేశానికి స్థిరత్వాన్ని ఇస్తాడు, కాని లంచం కోసం అత్యాశపడేవారు దానిని కూల్చివేస్తారు.

  25. ఒకవేళ పాలకుడు అబద్ధాలు వింటే, తన అధికారులంతా దుష్టులవుతారు.