కంటెంట్‌కు వెళ్లండి

Rulers గురించి బైబిల్ వచనాలు

255 వచనాలు · 5 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. “మేము చావుతో నిబంధన చేసుకున్నాం, పాతాళంతో ఒప్పందం చేసుకున్నాము. ప్రమాదం ప్రవాహంలా వేగంగా వచ్చినప్పుడు అది మమ్మల్ని తాకదు, ఎందుకంటే అబద్ధాన్ని మాకు అండగా చేసుకున్నాం, అసత్యాన్ని మా దాగు స్థలంగా చేసుకున్నాం” అని మీరు అతిశయిస్తున్నారు.

  2. దయలేని మనుష్యులు అదృశ్యమవుతారు, హేళన చేసేవారు మాయమవుతారు చెడు చేయడానికి ఇష్టపడేవారందరు,

  3. ఒక వ్యక్తి మీద తప్పుడు సాక్ష్యమిచ్చేవారు, న్యాయస్థానంలో మధ్యవర్తిత్వం చేసేవారిని వలలో వేసుకునేవారు అబద్ధసాక్ష్యంతో అమాయకులకు న్యాయం జరుగకుండా చేసేవారు తొలగించబడతారు.

  4. చాలా కాలం క్రితమే మండుతున్న స్థలం సిద్ధపరచబడింది; అది రాజు కోసం సిద్ధపరచబడింది. విస్తారమైన అగ్ని, చెక్కతో దాని అగ్ని గుంట లోతుగా విశాలంగా చేయబడింది; యెహోవా ఊపిరి మండుతున్న గంధక ప్రవాహంలా దానిని రగిలిస్తుంది.

  5. నాశనం చేసేవాడా, ఇంకా నాశనం చేయబడని నీకు శ్రమ! మోసం చేసేవాడా, ఇంకా మోసం చేయబడని నీకు శ్రమ! నీవు నాశనం చేయడం ముగించిన తర్వాతే నీవు నాశనం చేయబడతావు; నీవు మోసగించడం ముగించిన తర్వాతే నీవు మోసగించబడతావు.

  6. ఆయన రాజులను నిష్ఫలం చేస్తారు ఈ లోక పాలకులను ఏమీ లేకుండా చేస్తారు.

  7. “ఇప్పుడు ఇక్కడ నాకున్నది ఏంటి?” అని యెహోవా అంటున్నారు. “నా ప్రజలు ఏ కారణం లేకుండా కొనిపోబడ్డారు. వారిని పాలించేవారు వారిని ఎగతాళి చేస్తున్నారు రోజంతా నా నామం దూషించబడుతుంది” అని యెహోవా అంటున్నారు.

  8. “నేను కోరుకునే ఉపవాసం అన్యాయపు సంకెళ్ళను విప్పడం, బరువైన కాడి త్రాళ్లు తీసివేయడం, బాధించబడిన వారిని విడిపించడం, ప్రతీ కాడిని విరగ్గొట్టడం కాదా?

  9. కాబట్టి న్యాయం వెనుకకు నెట్టబడింది, నీతి దూరంగా నిలబడింది. సత్యం వీధుల్లో పడి ఉంది. నిజాయితీ లోపలికి రాలేకపోతుంది.

  10. సత్యం ఎక్కడా కనిపించడం లేదు, చెడును విడిచిపెట్టేవాడు దోచుకోబడుతున్నాడు. న్యాయం జరగకపోవడం చూసి యెహోవా అసంతృప్తి చెందారు.

  11. నేను ఇత్తడికి బదులు బంగారాన్ని ఇనుముకు బదులు వెండిని నీకు తెస్తాను. నేను కర్రకు బదులు ఇత్తడిని రాళ్లకు బదులు ఇనుమును నీకు తెస్తాను. నేను సమాధానాన్ని నీకు అధిపతిగా నీతిని నీకు పాలకునిగా నియమిస్తాను.

  12. వారు లావుగా నిగనిగలాడుతూ ఉన్నారు. వారి దుర్మార్గాలకు హద్దు లేదు; వారు న్యాయం కోరరు. వారు తండ్రిలేనివారి వాదనను వాదించరు; వారు పేదల న్యాయమైన కారణాన్ని సమర్థించరు.

  13. దీని కోసం నేను వారిని శిక్షించకూడదా?” అని యెహోవా ప్రకటిస్తున్నారు. “ఇలాంటి దేశం మీద నేను ప్రతీకారం తీర్చుకోకూడదా?

  14. రాజుతో, రాజమాతతో ఇలా చెప్పు, “మీర మీ సింహాసనాలు దిగిరండి, ఎందుకంటే మీ దివ్యమైన కిరీటాలు మీ తలల నుండి పడిపోతాయి.”

  15. దావీదు ఇంటివారలారా, యెహోవా మీతో ఇలా చెప్తున్నారు: “ ‘ప్రతి ఉదయం న్యాయం చేయండి; అణచివేసే వారి చేతి నుండి దోచుకోబడిన వానిని విడిపించండి, లేకపోతే మీరు చేసిన దుర్మార్గాన్ని బట్టి నా ఉగ్రత అగ్నిలా మండుతూ ఎవరూ ఆర్పలేనంతగా మిమ్మల్ని కాల్చివేస్తుంది.

  16. యెహోవా ఇలా అంటున్నారు: “నీవు యూదారాజు యొక్క రాజభవనానికి వెళ్లి, అక్కడ ఈ సందేశాన్ని ప్రకటించు:

  17. ‘దావీదు సింహాసనం మీద ఆసీనుడైయున్న యూదా రాజైన మీకు, మీ అధికారులకు, ఈ ద్వారాల గుండా వచ్చే మీ ప్రజలకు, యెహోవా ప్రకటిస్తున్న మాట వినండి.

  18. యెహోవా ఇలా చెప్తున్నారు: నీతిన్యాయాల ప్రకారం చేయండి. అణచివేసే వారి చేతిలో నుండి దోపిడికి గురైన వారిని విడిపించండి. విదేశీయులకు, తండ్రిలేనివారికి, విధవరాండ్రకు ఎలాంటి అన్యాయం చేయవద్దు, హింసించవద్దు, ఈ స్థలంలో నిర్దోషుల రక్తాన్ని చిందించవద్దు.

  19. “ ‘అపవిత్రుడా ఇశ్రాయేలీయుల దుష్ట అధిపతీ, నిన్ను శిక్షించే రోజు సమీపించింది; నీ శిక్షాకాలం ముగింపుకు చేరుకుంది,

  20. ప్రభువైన యెహోవా ఇలా అంటున్నాడు: తలపాగా తీసివేయి, కిరీటాన్ని తీసివేయి. ఇది వరకు ఉన్నట్లుగా ఇక ఉండదు: అల్పులు హెచ్చింపబడతారు, గొప్పవారు తగ్గించబడతారు.

  21. “ ‘చూడండి, నీలో ఉన్న ఇశ్రాయేలు నాయకులు తమ అధికారాన్ని దుర్వినియోగం చేసి హత్యలు చేయాలని నిర్ణయించుకున్నారు.

  22. దానిలో అధికారులు వేటాడినదాన్ని చీల్చే తోడేళ్లలా ఉన్నారు; అక్రమ సంపాదన కోసం వారు రక్తాన్ని చిందించి ప్రజలను చంపుతారు.

  23. “మనుష్యకుమారుడా, తూరు పాలకునితో ఇలా చెప్పు, ‘ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: “ ‘గర్వించిన హృదయంతో నీవు, “నేనొక దేవుడిని; సముద్రం మధ్యలో ఒక దేవుని సింహాసనం మీద నేను కూర్చున్నాను” అని అన్నావు. దేవునిలా నీవు జ్ఞానివి అనుకుంటున్నావు, కాని నీవు కేవలం ఒక మనిషివి మాత్రమే దేవునివి కాదు.

  24. “మనుష్యకుమారుడా, ఇశ్రాయేలు కాపరులకు వ్యతిరేకంగా ప్రవచించు; ప్రవచించి వారితో ఇలా చెప్పు: ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: మిమ్మల్ని మీరు మాత్రమే చూసుకునే ఇశ్రాయేలు కాపరులారా మీకు శ్రమ! కాపరులు తమ గొర్రెల మందను జాగ్రత్తగా చూసుకోవాలి కదా?

  25. మీరు క్రొవ్విన వాటిని తింటారు, ఉన్నితో బట్టలు వేసుకుంటారు, ఎంపిక చేసిన జంతువులను వధిస్తారు, కానీ మందను మాత్రం మీరు జాగ్రత్తగా చూసుకోరు.