కంటెంట్‌కు వెళ్లండి

Rulers గురించి బైబిల్ వచనాలు

255 వచనాలు · 5 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. మీరు బలహీనమైన వాటిని బలపరచలేదు, రోగంతో ఉన్నవాటిని స్వస్థపరచలేదు, గాయపడిన వాటికి కట్టు కట్టలేదు. మీరు దారితప్పిన వాటిని తిరిగి తీసుకురాలేదు, తప్పిపోయిన వాటికోసం వెదకలేదు. మీరు వాటిని కఠినంగా, క్రూరంగా పాలించారు.

  2. “ ‘కాబట్టి కాపరులారా, యెహోవా మాట వినండి:

  3. నా జీవం తోడు కాపరులు లేని నా గొర్రెలు దోచుకోబడ్డాయి, అడవి మృగాలన్నిటికి ఆహారమయ్యాయి, నా కాపరులు నా గొర్రెలను వెదకలేదు, నా గొర్రెలను జాగ్రత్తగా చూసుకోకుండా వారు తమ గురించి మాత్రమే చూసుకున్నారు అని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు.

  4. కాబట్టి కాపరులారా, యెహోవా మాట వినండి:

  5. ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: నేను ఆ కాపరులకు వ్యతిరేకిని, నా మంద గురించి నేను వారిని లెక్క అడుగుతాను. గొర్రెల కాపరులు ఇకపై మందను మేపకుండ నేను వారిని తొలగిస్తాను, తద్వార వారు తమను తాము పోషించుకోలేరు. వారి నోటి నుండి నేను నా మందను విడిపిస్తాను, ఇకపై అది వారికి ఆహారంగా ఉండదు.

  6. “ ‘ప్రభువైన యెహోవా చెబుతున్న మాట ఇదే: ఇశ్రాయేలు అధిపతులారా! ఇక చాలు. ఇంతవరకు మీరు పెట్టిన హింసను బాధను విడిచిపెట్టి, న్యాయమైనది సరియైనది చేయండి. నా ప్రజలను దోచుకోవడం మానండి. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.

  7. యూదా నాయకులు సరిహద్దు రాళ్లను జరిపే వారిలా ఉన్నారు. వారి మీద నా కోపాన్ని నీటి ప్రవాహంలా కుమ్మరిస్తాను.

  8. “వారు తమ దుష్టత్వంతో రాజును, వారి అబద్ధాలతో అధిపతులను సంతోషపరుస్తారు.

  9. సమరయ రాజు నాశనమవుతాడు, అతడు నీటిలో విరిగిపోయిన రెమ్మలా కొట్టుకు పోతాడు.

  10. “సరియైనది ఎలా చేయాలో వారికి తెలియదు,” అని యెహోవా చెప్తున్నారు, “వారు తమ కోటలలో తాము కొల్లగొట్టిన దోపుడుసొమ్మును దాచుకుంటారు.”

  11. కాబట్టి ప్రభువైన యెహోవా చెప్పే మాట ఇదే: “శత్రువు నీ ప్రాంతంలో చొరబడతాడు, మీ దుర్గాలను పడగొడతాడు, మీ కోటలను దోచుకుంటాడు.”

  12. సమరయ పర్వతం మీద తిరిగే బాషాను ఆవులారా! దిక్కులేని వారిని బాధిస్తూ, బీదలను అణగద్రొక్కుతూ “మాకు కొంచెం మద్యం తీసుకురండి!” అని భర్తలకు చెప్పే స్త్రీలారా, ఈ మాట వినండి.

  13. ప్రభువైన యెహోవా తన పవిత్రత తోడని ప్రమాణం చేశారు: “మిమ్మల్ని కొంకులతో పట్టుకుని, మీలో మిగిలిన వారిని గాలంతో పట్టుకుని తీసుకెళ్లే కాలం ఖచ్చితంగా రాబోతుంది.

  14. మీరు బీదలను అణగద్రొక్కుతూ, వారి ధాన్యం మీద పన్ను వేస్తారు. కాబట్టి మీరు రాళ్లతో భవనాలను కట్టుకున్నా, వాటిలో కాపురముండరు; అందమైన ద్రాక్షతోటలు నాటినా మీరు ఆ పండ్ల రసం త్రాగరు.

  15. ఎందుకంటే మీ అపరాధాలు ఎన్ని ఉన్నాయో మీ పాపాలు ఎంత ఘోరమైనవో నాకు తెలుసు. మీరు లంచాలు తీసుకుని అమాయకులను బాధిస్తారు, న్యాయస్థానంలో వచ్చే బీదలకు న్యాయం జరగనివ్వరు.

  16. గుర్రాలు బండ మీద పరుగెత్తుతాయా? బండ మీద ఎవరైనా ఎద్దులతో దున్నుతారా? కాని న్యాయాన్ని విషంగా మార్చారు, నీతి ఫలాన్ని చేదుగా మార్చారు.

  17. లో దెబారును జయించి ఆనందిస్తున్న మీరు, “మా సొంత బలంతోనే కర్నాయీమును పట్టుకోలేదా?” అంటారు.

  18. అప్పుడు నేను ఇలా అన్నాను, “యాకోబు నాయకులారా, ఇశ్రాయేలు పాలకులారా, వినండి. న్యాయాన్ని మీరు తెలుసుకోవద్దా?

  19. మీరు మంచిని అసహ్యించుకుని చెడును ప్రేమిస్తారు; నా ప్రజల చర్మం ఒలిచి, వారి ఎముకల మీద మాంసాన్ని చీలుస్తారు;

  20. నా ప్రజల మాంసాన్ని తింటారు, వారి చర్మం ఒలిచి, వారి ఎముకలను ముక్కలుగా విరగ్గొడతారు; పాత్రలో వేసే మాంసాన్ని ముక్కలు చేసినట్లు, కుండలో వేసే మాంసాన్ని ముక్కలు చేసినట్లు చేస్తారు.”

  21. యాకోబు నాయకులారా, ఇశ్రాయేలు పాలకులారా, మీరు ఇది వినండి. మీరు న్యాయాన్ని తృణీకరించి, సరియైన దానినంతటిని వంకర చేస్తారు;

  22. మీరు రక్తపాతంతో సీయోనును కడతారు, దుష్టత్వంతో యెరూషలేమును నిర్మిస్తారు.

  23. దాని నాయకులు లంచం తీసుకుని తీర్పు చెప్తారు, దాని యాజకులు జీతానికి ఉపదేశిస్తారు. దాని ప్రవక్తలు డబ్బు కోసం సోదె చెప్తారు. అయినా వారు యెహోవా సహాయం కోసం చూస్తూ, “యెహోవా మన మధ్య ఉన్నారు గదా! ఏ కీడు మన మీదికి రాదు” అంటారు.

  24. వారి రెండు చేతులు కీడు చేస్తాయి; పాలకులు బహుమతులు కోరతారు, న్యాయాధిపతులు లంచాలు పుచ్చుకుంటారు, గొప్పవారు తమ కోరికను తెలియజేస్తారు. వారంతా కలిసి కుట్ర చేస్తారు.

  25. వారిలో మంచి వారు ముళ్ళపొద వంటివారు, వారిలో అత్యంత యథార్థవంతులు ముండ్లకంచె కంటే ఘోరము. దేవుడు మిమ్మల్ని దర్శించే రోజు, మీ కాపరులు హెచ్చరించే రోజు వచ్చింది. ఇప్పుడే మీరు కలవరపడే సమయము.