కంటెంట్‌కు వెళ్లండి

Rulers గురించి బైబిల్ వచనాలు

255 వచనాలు · 5 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. అందుకే ధర్మశాస్త్రం కుంటుపడింది, ఎప్పుడూ న్యాయం జరగడం లేదు. దుర్మార్గులు నీతిమంతులను చుట్టుముడుతున్నారు, న్యాయం చెడిపోతుంది.

  2. ద్రాక్షరసం అతన్ని మోసం చేస్తుంది; గర్విష్ఠియైన అతడు ఎప్పుడూ విశ్రమించడు. అతనికి పాతాళమంత దురాశ ఉన్నందున మరణంలా అది ఎన్నడూ తృప్తిపడదు, అతడు సమస్త జనాలను వశపరచుకుంటాడు ప్రజలందరిని బందీలుగా తీసుకెళ్తాడు.

  3. “అయితే వారందరూ అతన్ని ఎగతాళి చేస్తూ ఈ సామెత చెబుతారు, “ ‘దొంగిలించిన వస్తువులను పోగుచేసి బలత్కారంతో ధనవంతునిగా మారిన వారికి శ్రమ! ఇలా ఎంతకాలం కొనసాగుతుంది?’

  4. అప్పు ఇచ్చినవారు నీ మీద అకస్మాత్తుగా పడరా? వారు లేచి నీకు వణుకు పుట్టించరా? అప్పుడు వారు నిన్ను దోచుకుంటారు.

  5. నీవు అనేక దేశాలను దోచుకున్నావు కాబట్టి, మిగిలి ఉన్న ప్రజలంతా నిన్ను దోచుకుంటారు. నీవు నరహత్యలు చేసినందుకు, భూములను పట్టణాలను వాటిలోని వారందరినీ నాశనం చేసినందుకు ప్రజలు నిన్ను దోచుకుంటారు.

  6. “తనకు నాశనం కలుగకుండా తన నివాసాన్ని ఎత్తు చేసుకుని అన్యాయమైన సంపాదనతో తన ఇంటిని నిర్మించుకునే వారికి శ్రమ!

  7. అనేక ప్రజలను నాశనం చేయడానికి కుట్రచేసి నీ ఇంటివారి మీదికి అవమానం తెచ్చుకుని నీ ప్రాణాన్ని కోల్పోతున్నావు.

  8. గోడ రాళ్లు మొరపెడతాయి, చెక్క దూలాలు వాటిని ప్రతిధ్వనింపచేస్తాయి.

  9. “రక్తం చిందించి పట్టణాన్ని నిర్మించేవారికి అన్యాయంతో ఊరిని స్థాపించేవారికి శ్రమ!

  10. ప్రజలు కష్టపడతారు కాని అగ్ని పాలవుతారని, వ్యర్థమైన దాని కోసం కష్టపడి జనులు అలసిపోతారని సైన్యాల యెహోవా నిర్ణయించలేదా?

  11. “యెహోవా ఏర్పరచిన బలి దినాన నేను అధికారులను, రాజకుమారులను, విదేశీయుల్లా దుస్తులు వేసుకున్నవారందరిని శిక్షిస్తాను.

  12. దానిలో ఉన్న అధికారులు గర్జించే సింహాలు; దాని పాలకులు రాత్రివేళ తిరుగుతూ, ఉదయానికి ఏమీ మిగల్చకుండా తినే తోడేళ్లు.

  13. “సైన్యాల యెహోవా చెప్పే మాట ఇదే: ‘సత్యంతో న్యాయం తీర్చండి; ఒకరిపట్ల ఒకరు కనికరం, దయ కలిగి ఉండండి.

  14. విధవరాండ్రను తండ్రిలేనివారిని విదేశీయులను బీదలను హింసించకండి. ఒకరి మీద ఒకరు కుట్ర చేయకండి’ అని చెప్పింది.

  15. మీరు చేయవలసిన పనులేవంటే: ఒకరితో ఒకరు సత్యమే మాట్లాడాలి, మీ న్యాయస్థానాల్లో సమాధానకరమైన తీర్పు ఇవ్వాలి;

  16. అప్పుడు పౌలు అతనితో, “ఓ సున్నం కొట్టిన గోడా, దేవుడు నిన్ను కొడతాడు! ధర్మశాస్త్రం ప్రకారం నాకు తీర్పు తీర్చడానికి అక్కడ కూర్చుని, నన్ను కొట్టమని ఆదేశించి నీవు ధర్మశాస్త్ర ఆజ్ఞలను అతిక్రమిస్తున్నావు!” అన్నాడు.

  17. ఒకవేళ అది ప్రోత్సహించడమైతే ప్రోత్సహించు; ఒకవేళ అది దానం చేయడమైతే ధారళంగా దానం చేయి; ఒకవేళ ఇతరులను నడిపించడమైతే శ్రద్ధగా నడిపించు, ఒకవేళ అది కనికరం చూపించడమైతే, సంతోషంగా చూపించండి.

  18. దేవుడు ఇచ్చిన అధికారం తప్ప మరి ఏ అధికారం లేదు కాబట్టి ప్రతీ వ్యక్తి తన పైఅధికారులకు లోబడి ఉండాలి. ఇప్పుడు ఉన్న అధికారాలు దేవుడు నియమించినవే.

  19. కాబట్టి ఎవరైతే అధికారాన్ని ఎదిరిస్తున్నారో వారు దేవుడు నియమించిన దాన్ని ఎదిరిస్తున్నారు. అలా చేసేవారు తమ మీదకు తామే తీర్పు తెచ్చుకుంటారు.

  20. మంచి పనులు చేసేవారిని పరిపాలకులు భయపెట్టరు; అయితే తప్పు చేసే వారికే వారంటే భయం. అధికారంలో ఉన్నవారికి భయపడకుండా ఉండాలంటే మీరు మంచి పనులు చేయాలి.

  21. మీ మంచి కోసం అధికారంలో ఉన్నవారు దేవుని సేవకులు. మీరు తప్పు చేస్తే భయపడండి, ఎందుకంటే పరిపాలకులు కారణం లేకుండా ఖడ్గాన్ని పట్టుకోరు. వారు తప్పు చేసేవారిపై కోపాన్ని చూపించి శిక్ష విధించే దేవుని సేవకులు.

  22. కాబట్టి, శిక్ష విధించబడుతుందని కాక మనస్సాక్షిని బట్టి మనం అధికారులకు లోబడి ఉండాలి.

  23. అధికారులు దేవుని సేవకులు, వారు తమ సమయమంతా పాలనకే ఇస్తారు, అందుకే మనం వారికి పన్నులు చెల్లిస్తున్నాము.

  24. మీరు ఎవరికి ఏమి రుణపడి ఉంటే వారికి అది చెల్లించండి: మీరు పన్నులు చెల్లించాల్సి ఉంటే పన్నులు చెల్లించండి; ఆదాయపన్నైతే ఆదాయపన్ను చెల్లించండి; మర్యాదైతే మర్యాద; గౌరవమైతే గౌరవం ఇవ్వండి.

  25. అన్నిటికంటే ప్రాముఖ్యంగా, నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే, అందరి పక్షంగా అనగా రాజుల కోసం అధికారంలో ఉన్న వారందరి కోసం దేవునికి విన్నపాలు, విజ్ఞాపనలు, ప్రార్థనలు చేసి కృతజ్ఞతలు చెల్లిస్తే, మనం పూర్ణ భక్తి, పరిశుద్ధత కలిగి శాంతి సమాధానాలతో ప్రశాంతంగా జీవించగలము.