Skip to content

Reproof గురించి బైబిల్ వచనాలు

165 వచనాలు · 70 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. కాబట్టి మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి. “ఒకవేళ నీ సహోదరుడు గాని సహోదరి గాని నీ ఎడల పాపం చేస్తే, వారిని గద్దించండి; వారు పశ్చాత్తాపపడితే, వారిని క్షమించండి.

  2. వారు ఒకే రోజు నీకు వ్యతిరేకంగా ఏడుసార్లు తప్పు చేసి తాము చేసిన తప్పును బట్టి ‘నేను పశ్చాత్తాపపడుతున్నాను’ అంటూ నీ దగ్గరకు వస్తే, నీవు వారిని తప్పక క్షమించాలి.”

  3. అందుకు యేసు, “పేతురూ, ఈ రోజే కోడి కూయక ముందే, నేను నీకు తెలియదని మూడుసార్లు చెప్తావు అని నీతో చెప్తున్నాను” అన్నారు.

  4. కానీ మరొక నేరస్థుడు వానిని గద్దించి, “నీవు కూడా అదే శిక్షను పొందుతున్నావు, నీవు దేవునికి భయపడవా?” అన్నాడు.

  5. అందుకాయన, “మీరు ఎంత అవివేకులు, ప్రవక్తలు చెప్పిన మాటలను నమ్మలేని మందమతులుగా ఉన్నారు. క్రీస్తు ఈ శ్రమలు అనుభవించి తన మహిమలో ప్రవేశించకూడదా?” అని వారితో అన్నారు.

  6. తాము భూతాన్ని చూసామనుకొని వారు భయపడి వణికిపోయారు.

  7. ఆయన వారితో, “మీరెందుకు కలవరపడుతున్నారు, మీ మనస్సుల్లో ఎందుకు సందేహాలు కలుగుతున్నాయి?

  8. పావురాలను అమ్మేవారితో, “వీటిని ఇక్కడినుండి తీసివేయండి! నా తండ్రి ఇంటిని వ్యాపార స్థలంగా మార్చడం మానేయండి!” అన్నారు.

  9. ఈ లోకం మిమ్మల్ని ద్వేషించదు, కానీ నేను దాని పనులు చెడ్డవని సాక్ష్యమిస్తున్నాను కాబట్టి అది నన్ను ద్వేషిస్తుంది.

  10. నా మాటలు మీకెందుకు అర్థం కావడం లేదు? ఎందుకంటే నేను చెప్తుంది మీరు వినలేకపోతున్నారు.

  11. అందుకు యేసు, “నేను చేస్తుంది ఇప్పుడు నీకు అర్థం కాదు కాని తర్వాత నీవు అర్థం చేసుకుంటావు” అన్నారు.

  12. పేతురు, “వద్దు ప్రభువా, నీవు ఎప్పుడు నా పాదాలు కడుగకూడదు” అన్నాడు. అందుకు యేసు జవాబిస్తూ, “నేను నిన్ను కడక్కపోతే, నాతో నీకు పాలు ఉండదు” అన్నారు.

  13. అయితే నేను మీతో చెప్పేది నిజం, నేను వెళ్లిపోవడం మీకు మంచిది, ఎందుకంటే నేను వెళ్లకుండా ఆదరణకర్త మీ దగ్గరికి రారు. నేను వెళ్తే ఆయనను మీ దగ్గరికి పంపిస్తాను.

  14. ఆయన వచ్చినప్పుడు, పాపం గురించి నీతిని గురించి తీర్పును గురించి లోకస్తులను తప్పు ఒప్పుకునేలా చేస్తాడు.

  15. అప్పుడు పేతురు, “అననీయా, పొలాన్ని అమ్మిన డబ్బులో కొంత నీవు దాచుకొని పరిశుద్ధాత్మతో అబద్ధమాడడానికి ఎలా సాతాను నీ హృదయాన్ని ప్రేరేపించాడు?

  16. అమ్మక ముందు అది నీదే కాదా? దానిని అమ్మిన తర్వాత ఆ డబ్బు నీ ఆధీనంలోనే ఉంది కదా! అలాంటప్పుడు ఇలాంటి పని చేయాలని నీవు ఎలా ఆలోచించావు? నీవు మనుష్యులతో కాదు కాని దేవునితోనే అబద్ధమాడావు” అన్నాడు.

  17. అందుకు పేతురు ఆమెతో, “ప్రభువు ఆత్మను పరీక్షించడానికి మీరు ఎందుకు ఒక్కటయ్యారు? ఇదిగో, నీ భర్తను పాతిపెట్టిన వారి పాదాలు గుమ్మం దగ్గరే ఉన్నాయి, వారు నిన్ను కూడా మోసుకుపోతారు” అన్నాడు.

  18. “మెడవంచని ప్రజలారా! మీ హృదయాలు మీ చెవులు ఇంకా సున్నతి పొందనివిగా ఉన్నాయి. మీరు మీ పితరుల వలె ఎప్పుడు పరిశుద్ధాత్మను వ్యతిరేకిస్తున్నారు.

  19. అందుకు పేతురు, “నీవు దేవుని వరాన్ని డబ్బుతో కొనగలనని అనుకున్నావు కాబట్టి నీ డబ్బు నీతో నశించును గాక!

  20. సహోదరీ సహోదరులారా, మీ మధ్య భేదాలు లేకుండ మీ మనస్సులోను ఆలోచనలోను పరిపూర్ణ ఏకత్వంతో ఉండాలని మన ప్రభువైన యేసు క్రీస్తు పేరట నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను.

  21. నా సహోదరీ సహోదరులారా, మీలో కలహాలు ఉన్నాయని క్లోయె ఇంటివారిలో కొందరు నాకు తెలియజేశారు.

  22. నేను చెప్పేది ఏంటంటే: మీలో “నేను పౌలును అనుసరిస్తున్నానని” ఒకరు, “నేను అపొల్లోను అనుసరిస్తున్నానని” వేరొకరు, “నేను కేఫాను అనుసరిస్తున్నానని” మరొకరు, “నేను క్రీస్తును అనుసరిస్తున్నానని” మరి ఇంకొకరు చెప్పుకుంటున్నారని విన్నాను.

  23. క్రీస్తు విభజింపబడి ఉన్నాడా? పౌలు మీ కోసం సిలువ వేయబడ్డాడా? మీరు పౌలు పేరట బాప్తిస్మం పొందారా?

  24. మీ మధ్య వ్యభిచారం ఉన్నదని మేము విన్నాము. మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట కదా! ఇలాంటి వ్యభిచారం దేవుని ఎరుగనివారు కూడా సహించరు.

  25. ఇలా ఉండి కూడా మీరు గర్విస్తున్నారా! నిజానికి ఈ విషయం గురించి మీరు దుఃఖించి ఈ పని చేసిన వానిని మీ సహవాసం నుండి వెలివేయాలి కదా!