కంటెంట్‌కు వెళ్లండి

Psalms గురించి బైబిల్ వచనాలు

896 వచనాలు · 16 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. ఆకాశం వైపు మీ కొమ్ము ఎత్తకండి; అంత గర్వంగా మాట్లాడకండి’ ” అని మీరంటారు.

  2. తూర్పు నుండి కాని పడమర నుండి కాని అరణ్యం నుండి కాని ఎవరూ తమను తాము హెచ్చించుకోలేరు.

  3. దేవుడే తీర్పు తీరుస్తారు: ఆయన ఒకని తగ్గిస్తారు, మరొకని హెచ్చిస్తారు.

  4. యెహోవా చేతిలో ఒక పాత్ర ఉంది అందులో సుగంధద్రవ్యాలు కలిపిన పొంగుతున్న ద్రాక్షరసం ఉంది; ఆయన దాన్ని బయటకు కుమ్మరిస్తారు, భూమిలోని దుష్టులందరు మడ్డితో సహా దాన్ని త్రాగివేస్తారు.

  5. నేనైతే నిత్యం ప్రకటిస్తాను; యాకోబు దేవునికి నేను స్తుతి పాడతాను.

  6. ఎందుకంటే, “దుష్టులందరి కొమ్ములను నేను విరగ్గొడతాను, కాని నీతిమంతుల కొమ్ములు హెచ్చిస్తాను” అని ఆయన అంటారు.

  7. సంగీత దర్శకునికి. తంతి వాయిద్యాలతో పాడదగినది. ఒక ఆసాపు కీర్తన. ఒక గీతము. యూదాలో దేవుడు ప్రఖ్యాతి గాంచారు; ఇశ్రాయేలులో ఆయన నామం గొప్పది.

  8. షాలేములో ఆయన గుడారం ఉంది. సీయోనులో ఆయన నివాసస్థలం ఉంది.

  9. అక్కడ ఆయన మెరుస్తున్న బాణాలు, డాళ్లు, ఖడ్గాలు, యుద్ధ ఆయుధాలు విరిచివేశారు. సెలా

  10. వేటకు ప్రసిద్ధి చెందిన పర్వతాల కంటే, మీరు గొప్ప వెలుగుతో ప్రకాశిస్తున్నారు.

  11. బలవంతులు దోపిడి చేయబడ్డారు, వారు నిద్రపోయారు. ఏ ఒక్క యోధుడు మాకు వ్యతిరేకంగా చేయి ఎత్తలేడు.

  12. యాకోబు దేవా! మీరు గద్దిస్తే గుర్రం రథం మరణ నిద్రలో పడి ఉంటాయి.

  13. మీ ఒక్కరికే భయపడాలి. మీరు కోప్పడినప్పుడు మీ ఎదుట ఎవరు నిలవగలరు?

  14. పరలోకం నుండి మీరు తీర్పు ప్రకటించారు, దేశం భయపడి మౌనం వహించింది.

  15. ఎందుకంటే దేవా, దేశంలో అణగారిన వారినందరిని రక్షించడానికి, తీర్పు తీర్చడానికి మీరు లేచారు. సెలా

  16. మనుష్యుల మీది మీ ఉగ్రత మీకు స్తుతి కలిగిస్తుంది, మీ ఉగ్రత నుండి తప్పించుకున్న వారిని మీరు ఆయుధంగా ధరించుకుంటారు.

  17. దేవుడైన యెహోవాకు మ్రొక్కుబడులు చేసి వాటిని చెల్లించండి; పొరుగు దేశాలన్నీ భయపడదగినవానికి బహుమతులు తెచ్చుదురు గాక.

  18. పాలకుల పొగరును ఆయన అణచివేస్తారు; భూరాజులు ఆయనను చూసి భయపడాలి.

  19. ఆసాపు కీర్తన. ఓ దేవా, పరదేశులు స్వాస్థ్యాన్ని ఆక్రమించుకున్నారు; అవి మీ పవిత్ర మందిరాన్ని అపవిత్రం చేశారు, యెరూషలేమును పాడు దిబ్బగా చేశారు.

  20. వారు మీ సేవకుల కళేబరాలను ఆకాశపక్షులకు ఆహారంగా, మీ సొంత ప్రజల మాంసాన్ని అడవి మృగాలకు ఆహారంగా వదిలేశారు.

  21. వారు యెరూషలేము చుట్టూ రక్తాన్ని నీటిలా పారబోశారు, చనిపోయినవారిని పాతిపెట్టడానికి ఎవరూ లేరు.

  22. మా పొరుగువారికి మేము అసహ్యులం అయ్యాం, మా చుట్టుపక్కల వారు మమ్మల్ని వెక్కిరించి హేళన చేస్తున్నారు.

  23. ఎంతకాలం, యెహోవా? మీరు ఎప్పటికీ కోప్పడతారా? ఎంతకాలం మీ రోషం అగ్నిలా మండుతుంది?

  24. మిమ్మల్ని గుర్తించని దేశాల మీద, మీ పేరట మొరపెట్టని, రాజ్యాల మీద, మీ ఉగ్రతను కుమ్మరించండి.

  25. వారు యాకోబును మ్రింగివేశారు అతని నివాసాన్ని నాశనం చేశారు.